Jyothi Raj – Jani Master: ‘కొంత మంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్’ కష్టపడే వాళ్లను ఇలా ఇరికిస్తారు.!
గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు మతం మార్చుకోమని, పెళ్లి చేసుకొమ్మని బలవంతపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇక యువతి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రీసెంట్‌గా గోవాలో అరెస్ట్ కూడా చేశారు.
గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు మతం మార్చుకోమని, పెళ్లి చేసుకొమ్మని బలవంతపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇక యువతి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రీసెంట్‌గా గోవాలో అరెస్ట్ కూడా చేశారు. ఇక ఈక్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ ఆట సందీప్ సతీమణి, ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ జానీ మాస్టర్ కేసుపై సంచలన కామెంట్స్ చేశారు.
జానీ మాస్టర్ పేరు డైరెక్టుగా చెప్పకుండా ఓ వీడియోను రిలీజ్ చేసిన జ్యోతీరాజ్.. ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ స్మార్ట్ అవుతున్నారన్నారు. చాలామంది అమ్మాయిల గురించి చెప్పడానికే తాను ఈ వీడియో చేశానంటూ చెప్పారు. అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిల్ని ఏడిపిస్తే, వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే కచ్చితంగా శిక్షించాలని.. చట్టం దృష్టిలో అందరూ సమానమే అంటూ జ్యోతి చెప్పారు. ఎంత పెద్దవాళ్లను అయినా సరే వదలకూడదన్నారు. కానీ కొన్ని చట్టాలని ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఈమె.
లైఫ్ లో చాలా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్ ని దెబ్బ కొట్టడానికి కొంత మంది అమ్మాయిలు చూస్తున్నారని.. వాళ్లను కూడా కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మనం రెండు వైపులా వినే మాట్లాడాలని చెప్పారు. కానీ ఫేమస్ వ్యక్తి కదా అని తన పొజిషన్ ని మన వ్యూస్ కోసం, ఇంటర్వూస్ కోసం వాడొద్దంటూ చెప్పారు జ్యోతి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.