Coolie Movie: కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..

Coolie Movie: కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..

Anil kumar poka

|

Updated on: Sep 20, 2024 | 1:11 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్‌’ బ్లాక్ బస్టర్ తర్వాత.. సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నారు. తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో ఈ డైరెక్టర్ అదరగొడుతున్నాడు. ఇక ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా కింగ్ నాగార్జున విశాఖపట్నంలో షూటింగ్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. వీడియో లీక్ కావడంతో లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్‌’ బ్లాక్ బస్టర్ తర్వాత.. సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నారు. తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో ఈ డైరెక్టర్ అదరగొడుతున్నాడు. ఇక ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా కింగ్ నాగార్జున విశాఖపట్నంలో షూటింగ్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. వీడియో లీక్ కావడంతో లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.

ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ కూలీ సినిమా నిర్మాణంలో ఉంది. 2025లో విడుదల కానున్న ఈ సినిమా ఈ వారం వార్తల్లో నిలిచింది. నాగార్జున నటించిన సీన్ లీక్ కావడంతో.. ఒక్కసారిగా యూనిట్ అలెర్ట్ అయింది.ఈ వీడియో దర్శకుడి దృష్టిని ఆకర్షించింది, ఇలాంటి పనులు చెయ్యొద్దని అభిమానులను రిక్వెస్ట్ చేశాడు. లోకేష్ X లో ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు. ‘‘ఒక్క వీడియో రికార్డ్‌తో ఎంతో మంది రెండు నెలలుగా పడిన కష్టం వృథా అయింది. దయచేసి లీక్‌ సీన్‌ను ఎవరూ ప్రోత్సహించొద్దు… నేను ప్రతి ఒక్కరినీ వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు.”అని విజ్ఞప్తి చేశారు.

నటుడు నాగార్జున విశాఖపట్నంలో షూటింగ్ చేస్తున్న వీడియోలో, నాగార్జున తెల్లటి సూట్ ధరించి ఒక వ్యక్తిని కొట్టడం కనిపించింది. మరొక క్లిప్ దూరం నుంచి తీసిన ఒక dramatic యాక్షన్ సీన్. ఓ వ్యక్తిని సుత్తితో బెదిరించడం కూడా కనిపించింది. లీకైన క్లిప్‌లలో సిబ్బంది ఒకరు.. నాగార్జునకు తమిళ డైలాగ్‌లు చెప్పిన ఆడియో రికార్డింగ్ కూడా యాడ్ చేశారు. ఓ భారీ ఫైట్ సీన్‌కు సంబంధించిన వీడియోని సెట్‌లోని వారు లీక్ చేశారు. ఆ విషయం ఆ లీక్డ్ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. గుంపులో నుంచి వీడియోని ఫోన్‌తో షూట్ చేసినట్లుగా తెలియడంతో.. లోకేష్ కనగరాజ్ టీమ్‌పై కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.

రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కూలీ చిత్రం నుండి సెప్టెంబర్ 2న, మేకర్స్ రజనీకాంత్ మొదటి క్యారెక్టర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. లోకేశ్ కనగరాజ్ ఎక్స్‌లో పోస్టర్‌ను షేర్ చేస్తూ, “#కూలీలో #దేవగా సూపర్ స్టార్ రజనీకాంత్ సార్. ఇందుకు రజనీకాంత్‌కి చాలా ధన్యవాదాలు సార్. ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు.

ఈ ఏడాది ఆగస్ట్ 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా టీమ్‌కి అధికారికంగా స్వాగతం పలికారు. అతన్ని సైమన్‌గా పరిచయం చేస్తూ, లోకేష్ ఎక్స్‌లో ఇలా వ్రాశాడు, “కింగ్ నాగార్జున సార్ #కూలీ తారాగణంలో #సైమన్‌గా చేరడం నాకు సంతోషం కలిగించింది. వెల్‌కమ్ ఆన్ బోర్డ్.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్.” అని అందులో రాసుకొచ్చాడు.

రజనీకాంత్, నాగార్జునతో పాటు కూలీలో శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, మహేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ తమిళ పాన్-ఇండియా చిత్రాన్ని కళానిధి మారన్ ,సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా 2025లో విడుదల కానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.