Bigg Boss 8 Telugu : నిఖిల్ దెబ్బకు సోనియా అవుట్.. మరోసారి చీఫ్‌గా.. కాంతార టీంకు షాకిచ్చిన బిగ్‌బాస్..
నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో చూసుకో అంటూ ఏడవడంతో వీడేంట్రా అన్నట్లు నిఖిల్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక మరోసారి బిగ్‌బాస్ ను బూతులు తిట్టాడు అభయ్. నువ్వు బిగ్‌బాస్ కాదు.. బయాస్డ్ బాస్.. నేను మాట్లాడేది కట్ చేస్తారేమో..కానీ బయటకెళ్లాక కూడా ఇదే చెప్తా. నిజంగా ధమాక్ లేదు.. ఒకడికి రూల్ ఇచ్చి మరొకరికి ఇవ్వకుండా ఇదే పనికిమాలిన గేమ్ నాకు అర్థం కాలేదు
బిగ్‌బాస్ హౌస్‌లో గత రెండు రోజులుగా సాగిన పద్మావతి 2.0 టాస్కు ఎట్టకేలకు ముగిసింది. ఎగ్స్ సంపాదించే టాస్కులో శక్తి టీమ్ విజయం సాధించింది. ఈ గేమ్ తర్వాత తన టీమ్ సభ్యులకు సారీ చెబుతూ ధైర్యం చెప్పాడు అభయ్. ఆ తర్వాత సోనియా గురించి యష్మీ కామెంట్స్ చేసింది. టీమ్ అందరిని ట్రిగర్ అయ్యేటట్లు మాట్లాడుతుంది.. ఎంత చీప్ ట్రిక్స్ వాడుతుంది అంటూ సోనియా గురించి చెప్పడంతో.. మీరు అసలు పదేళ్లుగా ఎలా ఫ్రెండ్ షిప్ చేస్తున్నారు అభయ్ అన్నా అంటూ ప్రేరణ అడిగేసింది. దీంతో అభయ్, సోనియా బయట నుంచే ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిపోయింది. నీలో కొన్ని నెగిటివ్ అనిపించాయ్ అంటూ నిఖిల్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్నాడు మణికంఠ. నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో చూసుకో అంటూ ఏడవడంతో వీడేంట్రా అన్నట్లు నిఖిల్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక మరోసారి బిగ్‌బాస్ ను బూతులు తిట్టాడు అభయ్. నువ్వు బిగ్‌బాస్ కాదు.. బయాస్డ్ బాస్.. నేను మాట్లాడేది కట్ చేస్తారేమో..కానీ బయటకెళ్లాక కూడా ఇదే చెప్తా. నిజంగా ధమాక్ లేదు.. ఒకడికి రూల్ ఇచ్చి మరొకరికి ఇవ్వకుండా ఇదే పనికిమాలిన గేమ్ నాకు అర్థం కాలేదు..నిద్రపోయిండా.. గతం మర్చిపోయిండా అంటూ తిట్టాడు అభయ్.
ఇక ఎగ్స్ టాస్కులో ఓడిపోవడంతో చీఫ్ పదవి నుంచి అభయ్ ను తప్పించాడు బిగ్‌బాస్. ఆ తర్వాత రెడ్ దగ్గర ఉన్న నిఖిల్ టీంకు మరో ఆఫర్ ఇచ్చాడు. రెడ్ ఎగ్ ఉన్న టీం నుంచి కంటెండర్ గా వాళ్లతో తలపడదామనుకుంటున్నారో చెప్పండి అని అడిగాడు. అలాగే కాంతార టీం నుంచి కూడా క్లాన్ చీఫ్ కంటెండర్లు అయ్యేందుకు ముగ్గురిని సెలక్ట్ చేసుకోవాలని చెప్పాడు. ఇక రెడ్ ఎగ్ కోసం ఒక్కొక్కరు నిఖిల్‌తో మాటలు కలుపగా.. తనకు చీఫ్ కావాలనే ఆలోచన లేదని చెప్పేసింది విష్ణుప్రియ. ఇక ఆ తర్వాత నిఖిల్, సోనియా, పృథ్వీ, అభయ్ ముచ్చట పెట్టుకున్నారు. నువ్వు సిగరెట్ తాగద్దంటే తాగను.. ఇంతకు ముందు చెప్పలేదు కదా.. ఇప్పుడు చెప్తున్నా అంటూ సోనియాకు సారీ చెప్పాడు పృథ్వీ. ఉదయం తిన్నావా అంటూ మాట్లాడించగా.. నాకు ఆకలేస్తే నేను తింటా.. నీకు అంతున్నప్పుడు నువ్వు తినేటప్పుడు అడాగాల్సింది కదా.. ఇప్పుడెందుకు వచ్చినవ్ అంటూ అలిగి వెళ్లిపోయింది సోనియా. సిగరెట్ విషయానికి అందరి ముందు అలా బిహేవ్ చేస్తే బాగోదు అన్నాడు నిఖిల్. సోనియా తన పర్సనల్ లైఫ్ ను జడ్జ్ చేయడం.. నన్ను ఒకరు కంట్రోల్ చేయడానికి చూస్తే నచ్చదు అంటూ అభయ్ తో చెప్పుకున్నాడు నిఖిల్.
ఆ తర్వాత సోనియా కూడా అభయ్ దగ్గర తన వెర్షన్ చెప్పింది. బిగ్‌బాస్ హౌస్ లో ఇంతకుముందెన్నడూ జరగని ఓ సంఘటన జరిగింది.. మీలో కొంతమంది నేరుగా బిగ్‌బాస్ నిర్ణయాలను సవాల్ చేయడంతోపాటు పదే పదే అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. ఓడిపోయిన క్లాన్ చీఫ్ అభయ్.. రాజే అలా ప్రవర్తిస్తే ప్రజల నుంచి ఆశించగలం. అతడి చర్యలకు పర్యవసానం సభ్యులందరూ ఎదుర్కొవాల్సిందే.. మీ క్లాన్ నుంచి అందరూ చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు అంటూ షాకిచ్చాడు బిగ్‌బాస్. ఇక ఆ తర్వాత తన దగ్గరున్న రెడ్ ఎగ్ సోనియాకు ఇచ్చాడు నిఖిల్. దీంతో వీరిద్దరి చీఫ్ పదవి కోసం తలపడ్డారు. నిదానమే ప్రదానం అంటూ ఓ టాస్కు పెట్టగా.. మోకాళ్లు చేతుల సాయంతో పాకుతూ నడుముకున్న ప్లేట్స్ మీద ఎక్కువ బాల్స్ అటువైపు తీసుకెళ్లాలి అని చెప్పాడు బిగ్‌బాస్. ఇందులో సోనియా మీద నిఖిల్ గెలిచి మరోసారి చీఫ్ అయ్యాడు. దీంతో సోనియా కాస్త ఎక్కువగానే ఫీల్ అయ్యింది. విష్ణుప్రియ, నైనికలతో నిఖిల్ మాట్లాడుతూ.. అందరూ ఏమనుకున్నారంటే గుడ్డు ఇచ్చి కావాలనే ఓడిపోతాననుకున్నారు.. కానీ నా పర్సనాలిటీ ఉంది కదా.. అవకాశం ఇచ్చాను.. వదులుకుంటే అది మీ ఇష్టం అంటూ ఇండైరెక్టర్ గా తాను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.