Bigg Boss 8 Telugu: బిగ్బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కన్ఫార్మ్.. ఎవరంటే..
బిగ్బాస్ సీజన్ 8 మూడో వారం వీకెండ్ వచ్చేసింది. నిన్నటితో ఈవారం ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. అయితే గత సీజన్ మాదిరిగానే ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండనున్నాయని తెలుస్తోంది. గత సీజన్ 7లో అర్జున్ అంబటి, నయని పావని, భోలే షావలి, అశ్విని, పూజా మూర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత టాస్కులలో మిగిలిన కంటెస్టెంట్లకు గట్టిపోటీ ఇచ్చి టాప్ 5లోకి వచ్చేశాడు.
బిగ్బాస్ సీజన్ 8 మూడో వారం వీకెండ్ వచ్చేసింది. నిన్నటితో ఈవారం ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. అయితే గత సీజన్ మాదిరిగానే ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండనున్నాయని తెలుస్తోంది. గత సీజన్ 7లో అర్జున్ అంబటి, నయని పావని, భోలే షావలి, అశ్విని, పూజా మూర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత టాస్కులలో మిగిలిన కంటెస్టెంట్లకు గట్టిపోటీ ఇచ్చి టాప్ 5లోకి వచ్చేశాడు. ఇక అదే సీజన్ లో అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది అశ్విని. అలాగే ఉన్నది ఒక్క వారమే అయినా అడియన్స్ హృదయాలను గెలుచుకుంది నయని పావని. అయితే ఈసారి బిగ్బాస్ సీజన్ 8లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరో నలుగురు కంటెస్టెంట్లను తీసుకువస్తున్నారట. అయితే గత సీజన్లో చేసినట్లుగా ఐదో వారంలో హౌస్ లోకి పంపిస్తారా.. లేక ఒక్కొక్కరిగా ఒక్కో వారం పంపిస్తారా అనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పేర్లు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారట. అలాగే కొత్త వారిని కూడా తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఇందులో నలుగురు ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యారు. ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ హరితేజ. ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీజన్ కంటెస్టెంట్ రోహిణి ఎంట్రీ ఇవ్వనుంది. టాస్కుల విషయం పక్కన పెడితే హౌస్ లో కామెడీ మాత్రం గట్టిగానే చేసింది. అలాగే సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ హౌస్ లోకి రాబోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అవినాష్ ను పంపేందుకు ఇప్పటికే బిగ్బాస్ టీమ్ ఫిక్స్ అయిపోయిందట.
వీరు ముగ్గురు కాకుండా సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావనిని కూడా మరోసారి సీజన్ 8లోకి తీసుకువస్తున్నారు. నయని పావని సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఒక్కవారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే గతంలో శోభా శెట్టిని కాపాడేందుకు నయనిని బయటకు పంపించారని ఫైర్ అయ్యారు అడియన్స్. ఇక ఇప్పుడు మరోసారి నయనిని హౌస్ లోకి తీసుకువస్తున్నారట. వీరితోపాటు రీతూ చౌదరి, గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.