Brahmamudi, November 28th Episode: అనామికకు ఝలక్ ఇచ్చిన రౌడీ బేబీ.. అపర్ణ మాటను లెక్కచేయని కావ్య!
ఈ రోజు ఎపిసోడ్‌లో.. ఇందిరా దేవి వంట చేస్తూ చేయి కాల్చుకుంటుంది. అది చూసి రాజ్ మీకు కొంచెం కూడా మానవత్వం లేదా అని ప్రశ్నిస్తాడు. దీంతో ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ముందు నీ గురించి నువ్వు తెలుసుకో.. ఆ తర్వాత నా గురించి మాట్లాడు అని అంటుంది. మరోవైపు కావ్య వంట చేసి ఇంటికి తీసుకెళ్తుంది.
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఇందిరా దేవి వంట చేస్తూ ఉండగా చేయి కాలుతుంది. అది చూసిన రాజ్ వెంటనే హాలులోకి తీసుకొచ్చి ఆయింట్మెంట్ రాస్తాడు. అయినా నువ్వెందుకు వండుతున్నావ్? బయట నుంచి తెప్పిస్తాను అన్నాను కదా అని అంటాడు. నువ్వు తెప్పించినా మీ తాతయ్య తినాలి కదా.. ఆయనకు బయట ఫుడ్ పడటం లేదు ఇంటి ఫుడ్ మాత్రమే తింటున్నారు. అందుకే వండాల్సి వచ్చిందని ఇందిరా దేవి చెబుతుంది. దీంతో రాజ్ మాట్లాడుతూ ఇంట్లో ఇంత మంది ఉన్నారు? నాన్నమ్మ కష్టపడుతూ ఉంటే సహాయం చేయకుండా ఉంటారేంటి? నీకు కూడా ఏమాత్రం జాలిగా లేదా పిన్ని.. జాలి వేయడం లేదా అని రాజ్ అంటాడు. మానవత్వం లేదా రాజ్.. ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి మనుషులు, మానవత్వాల గురించి గుర్తుకు వస్తున్నాయి ఏంటి? ఒకప్పుడు నేను ఈ పనులన్నీ చేసినదాన్ని.. నా కొడుకు కోసం కూడా ఏడుస్తూ ఉన్నాను. నా ఏడుపును ఎవరన్నా గుర్తించారా? అని ధాన్యలక్ష్మి ప్రశ్నిస్తుంది.
రాజ్‌కి గడ్డి పెట్టిన ధాన్యలక్ష్మి..
ఇన్ని రోజులూ నీకు ఏ కష్టం లేకుండా మీ అమ్మ, కావ్య బాగా చూసుకున్నారు. ఇప్పడు సడెన్‌గా వాళ్లిద్దరూ ఇంట్లో లేకపోయే సరికి సడెన్‌గా అన్నీ గుర్తుకు వచ్చేస్తున్నాయి. మాకు నీతులు చెప్పడం కాదు.. ముందు నువ్వు ఏం చేస్తున్నావో అది ఆలోచించుకోమని ధాన్యలక్ష్మి అని వెళ్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇంటికి ఆడ దిక్కు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అని సుభాష్ కూడా అంటాడు. దీంతో ఈ లోపు రుద్రాణి ఆలోచనలో పడుతుంది. వెంటనే రాజ్ ఫ్రస్ట్రేట్ అవుతూ.. కావ్యకి ఫోన్ చేస్తాడు. అది చూసి కావ్య షాక్ అవుతుంది. ఫోన్ ఎత్తి.. స్పీకర్ ఆన్ చేస్తుంది. తిన్నావా.. అని అడుగుతాడు రాజ్. అది విని కావ్య షాక్ అవుతుంది. మీరు తింటే సరిపోతుందా.. ఇక్కడ ఉన్నవాళ్లు తిన్నారో లేదో తెలుసా? ఎలా తింటారు అనుకున్నావ్? అని రాజ్ అరుస్తాడు. దీంతో కావ్య ఎక్స్‌ప్లైన్ చేస్తుంది. ఏయ్ నోర్ముయ్ అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? కోట్ల ఆస్తి ఉన్నా.. టైమ్‌కి తిండి పెట్టేవాళ్లు లేరని తెలుసా? నీతో పాటు మా అమ్మని కూడా తీసుకెళ్లావ్? దాంతో తాతయ్య వాళ్లను తీసుకెళ్లేవారు ఎవరో తెలుసా? నువ్వు ఉన్న రోజులు అందరికీ పెట్టావు.
మా అమ్మని పంపించు..
పని మనిషి పని మానేసి వెళ్లిపోయింది. ఉన్నవాళ్లకు వంట రాదు.. దీంతో నాన్నమ్మ తాతయ్య కోసం వంట చేస్తూ చేయి కాల్చుకుందని రాజ్ అంటాడు. అయ్యయ్యో ఎలా ఉందని కావ్య అడిగితే.. మరీ అంత నటించకు.. నీకు మా మీద అంత గౌరవం ఉంటే మా అమ్మని వెంటనే అక్కడి నుంచి పంపించమని రాజ్ అంటాడు. ఏంట్రా ఏదో బాధ్యతగా భార్యని చూసుకున్న భర్తగా అరుస్తున్నావ్? ఇంట్లోంచి తరిమేశావ్ కదా.. మరి ఏ హక్కుతో ఆర్డర్లు వేస్తున్నావు. సమస్యలు వచ్చినవి నీ వల్ల.. అలా చేయగలను అనుకుంటే వచ్చి నీ భార్యని తీసుకెళ్లమని అపర్ణ అంటుంది. అరే మమ్మీ నీకు అర్థం కావడం లేదు.. ఇక్కడ పరిస్థితి ఏమీ బాలేదని రాజ్ అంటాడు. అరేయ్ నీకు అంత ఇబ్బందిగా ఉంటే.. వచ్చి నీ పెళ్లాన్ని తీసుకెళ్లు అని ఫోన్ పెట్టేస్తుంది అపర్ణ. ఇదిగో ఈ మాటలకు నువ్వు ఏమీ కరిగిపోమాకు అని తిడుతుంది.
అనామికకు ఝలక్ ఇచ్చిన పొట్టి..
మరోవైపు అనామిక దగ్గరకు వెళ్తారు అప్పూ, కళ్యాణ్‌లు. ఏయ్ మిమ్మల్ని ఎవరు రానిచ్చారు సెక్యూరిటీ అని అరుస్తుంది అనామిక. ఆవేశ పడకు అనామకురాలు అని అప్పూ అంటే.. నా సంగతి పక్కన పెట్టు.. మీరే ఇప్పుడు అనామకులుగా బతుకుతున్నారని అనామిక అంటుంది. ఇప్పుడు నేను చెప్పేది వింటే నీ చెవికి చీములు పడతాయి.. నీ కళ్లు కుళ్లుంటాయని చెక్ చూపిస్తుంది అప్పూ. ఏంటి.. అలా చూస్తున్నావ్? పది వేలకే ఇంత బిల్డప్ ఇస్తున్నారు అనుకుంటున్నావా.. మా శ్రీవారు తన స్వహస్తులతో సంపాదించారు. మా ఆయన పాటలకు ప్రాణం పోసి.. ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్నారు. నువ్వు అనుకుంటున్న సక్సెస్.. ఇప్పుడు నా మొగుడు గురించి మాట్లాడుకుంటారని చెప్పేసి వెళ్తారు అప్పూ వాళ్లు. వీడికి నిజంగానే అంత సీన్ ఉందా అని అనామిక అనుకుంటుంది.
దుగ్గిరాల ఇంటికి వెళ్లొద్దని చెప్పిన అపర్ణ..
మరోవైపు క్యారేజ్ సర్దుతుంది కావ్య.. ఎవరికి ఇది? అని అపర్ణ అడుగుతుంది. భోజనం.. ఆ ఇంటికి అని కావ్య అంటే.. అప్పుడే కదా తెలుస్తుందని అపర్ణ అంటుంది. నేను తీసుకెళ్లేది ఆయన కోసం కాదు.. అమ్మమ్మ, తాతయ్యల కోసమని కావ్య అంటుంది. మరి నేను చేసిన దానికి అర్థం ఏం ఉంది. నీ కోసమే కదా అంత పెద్ద ఇంటిని వదిలేసి వచ్చానని అపర్ణ అంటుంది. మీకున్నంత పెద్ద మనసు మీ అబ్బాయి లేదు.. మీరు ఏ ధైర్యంతో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు.. మీరేమో మమ్మల్ని కలపాలి అనుకుంటున్నారు.. ఆయన ఏమో విడిపోవాలి అనుకుంటున్నారని కావ్య అంటుంది. ఇంటి ఇల్లాలి అవసరం వచ్చినప్పుడే కదా దిగి వచ్చేదని కనకం అంటుంది. అమ్మ నా అవసరం కాదు.. వాళ్ల అవసరం కోసం వెళ్తున్నానని కావ్య చెబుతుంది. దీన్ని ఎలా కన్నావే తల్లీ అని అపర్ణ అంటుంది.
ఇంటికి వచ్చిన కళావతి.. అవమానించిన రాజ్..
ఇక కావ్య ఇంటికి వస్తుంది. కావ్యని చూసిన రాజ్.. ఎవరు నువ్వు అని అడుగుతాడు. దీంతో సంబంధం లేకుండా సమాధానం చెప్పి.. ఫుడ్ డెలివరీ అని కావ్య అంటుంది. నీ భోజనం నాకు అవసరం లేదని రాజ్ అంటే.. మీ కోసం ఎవరు తీసుకొచ్చారు.. అమ్మమ్మ, తాతయ్యల కోసం తీసుకొచ్చానని అంటుంది. నేను లేకుండా వాళ్లు ఎలా వచ్చారు? అని రాజ్ అంటే.. వాళ్లు లేకుండా మీరు ఎలా పుట్టుకొచ్చారని కావ్య అడుగుతుంది. శభాష్ కావ్య.. తను మా మనవరాలు ఆ హక్కుతోనే క్యారేజన్ తీసుకొచ్చిందని అని ఇందిరా దేవి అంటుంది. ఇటు రమ్మంటే ఇల్లంతా నాదే అనే రకం అని రాజ్ అంటే.. ఇల్లు తనది కాదని ఏ ఏప్రాసి అన్నారు? సన్నాసి అన్నాడని పెద్దావిడ అంటుంది. సంబంధం లేదు అనుకున్నది నువ్వు రా మేము కాదని సీతారామయ్య అంటాడు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..