AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Polishetty: అందుకే సామీ.! నిన్ను జాతిరత్నం అనేది..బాలయ్య షోలో నవీన్ పొలిశెట్టి.. ఏం చేశాడంటే?

నవీన్ పొలిశెట్టి.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కరలేని పేరు.. తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు నవీన్.. తాజాగా అలానే NBK అన్‌స్టాపబుల్ షోలో చేసిన ఓ ఫన్నీ సీన్ ఇప్పుడు నెటింట్లో తెగ హల్చల్ చేస్తుంది.

Naveen Polishetty: అందుకే సామీ.! నిన్ను జాతిరత్నం అనేది..బాలయ్య షోలో నవీన్ పొలిశెట్టి.. ఏం చేశాడంటే?
Velpula Bharath Rao
|

Updated on: Nov 27, 2024 | 7:57 PM

Share

నవీన్ పొలిశెట్టి తన కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే పెద్ద ప్రమాదానికి గురైన నవీన్ పొలిశెట్టి రికవరీ అయ్యాడు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి తన తదుపరి చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ యంగ్ హీరో అగ్ర నటి శ్రీ లీలతో కలిసి NBK అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. వచ్చే నెలలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అన్‌స్టాపబుల్ సెట్స్ నుండి ఒక ఫోటో ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. నవీన్ పోలిశెట్టి బాలకృష్ణ, శ్రీ లీలతో జాతి రత్నాల సినిమాలోని ఓ సీన్‌ను రిక్రియేట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జాతి రత్నాలలో నవీన్ పోలిశెట్టి పెళ్లిలో గిఫ్ట్‌ ఇచ్చే సీన్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ శ్రీలీలకు గిఫ్ట్ హ్యాంపర్‌ని అందజేసినప్పుడు అదే సీన్‌ను రీక్రియేట్ చేశాడు. నవీన్ పోలిశెట్టి సినిమాలే కాకుండా పబ్లిక్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో కూడా అదరగొడుతాడు. అతడు తన కామెడీ టైమింగ్‌‌తో ఆడియన్స్‌ను అలరిస్తూ ఉంటాడు. దీంతో అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కి సంబంధించిన ఫోటోలు నెటింట్లో చక్కర్లు కొడుతుండడంతో ఎపిసోడ్ సరదాగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన  పుష్ప 2: ది రూల్ మూవీలో శ్రీ లీల ఒక ప్రత్యేక పాటకు చిందు వేసింది. నితిన్ హిరోగా నటించిన రాబిన్‌హుడ్‌ చిత్రంలో శ్రీ లీల మెరిసింది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌ సినిమా ప్రమోషన్స్‌లో శ్రీ లీల బిజీబిజీగా ఉంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2024 క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..