Pushpa The Rules: కేరళలో భారీ ఎత్తున ‘మల్లు అర్జున్’ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. వీడియో
మరో వారం రోజుల్లో పుష్ప 2 రిలీజ్ ఉండటంతో భారీ ఎత్తున జరుగుతున్నాయి.. ఇప్పటికే పాట్నా, చెన్నైలో భారీ ఈవెంట్స్ నిర్వహించగా.. ప్రస్తుతం కేరళలో పుష్ప 2 ఈవెంట్ జరుగుతుంది.. బన్నీ కు కేరళ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.. కేరళలో అల్లు అర్జున్ ప్రతి సినిమా రిలీజ్ అవుతాయి... ఐకాన్ స్టార్ ను కేరళలో మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్.
అయితే తాజాగా రిలీజ్ చేసిన పుష్ప -2 మలయాళ ట్రైలర్ కు అద్భుత స్పందన లభించింది. ఇక బన్నీతో శ్రీలీల చేసిన కిస్సీక్ స్పెషల్ సాంగ్ కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. అల్లు ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాల డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ గా ఉంది. రిలీజ్ కు ముందే దేశ వ్యాప్తంగా పుష్ప2 సంచనాలు నమోదు చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Nov 27, 2024 06:33 PM
వైరల్ వీడియోలు
Latest Videos