Brahmamudi, November 23rd Episode: కావ్య కోసం కనకం ఇంటికి వచ్చిన అపర్ణ.. రాజ్‌కు ఇక్కట్లు స్టార్ట్!

కావ్య కోసం దుగ్గిరాల ఇంటిని వదిలి పెట్టి కనకం ఇంటికి వస్తుంది అపర్ణ.. రాజ్ వచ్చి నిన్ను తీసుకెళ్లేదాకా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని అపర్ణ ఫిక్స్ అవుతుంది. అపర్ణ చేసిన పనికి దుగ్గిరాల ఇంటి సభ్యులు భయ పడతారు..

Brahmamudi, November 23rd Episode: కావ్య కోసం కనకం ఇంటికి వచ్చిన అపర్ణ.. రాజ్‌కు ఇక్కట్లు స్టార్ట్!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Nov 23, 2024 | 12:10 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి రాజ్‌ని తిడుతుంది. ఇన్నాళ్లు నాకు ఒక రెస్పెక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం పోయిందని అంటుంది. హలో ఆ కంపెనీ నాదని రాజ్ అంటే.. కానీ తాతయ్య ఆ కళావతే వారసురాలు అనుకుంటున్నాడని అంతరాత్మ అంటే.. అందుకే కదా మోసం చేసి గెలిచానని రాజ్ అంటాటు. ఛీ చింత కూడా సిగ్గుగా, బాధగా అనిపించడం లేదా అని అంతరాత్మ తిడుతుంది. బాధ ఎందుకు.. చాలా ఆనందంగా ఉంది. పార్టీ చేసుకోవాలని ఉందని రాజ్ అంటాడు. పెళ్లాన్ని మోసం చేసి మొగుడు బాగు పడినట్టు చరిత్రలో లేదు.. నన్నూ, కళావతిని దూరం చేసిన పాపం నీకు ఊరికనే పోదురా.. ఇదే నా శాపం అంటూ అంతరాత్మ వెళ్లిపోతుంది. కానీ రాజ్ పట్టించుకోడు.

కావ్య కోసం భోజనం మానేసిన దుగ్గిరాల ఫ్యామిలీ..

ఆ తర్వాత రుద్రాణి, ధాన్యలక్ష్మి, రాహుల్‌లు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కావ్య కోసం బాధ పడుతూ మిగిలినవాళ్లు ఎవరూ భోజనం చేయరు. అప్పుడే రాజ్ వచ్చి.. శాంతా అందరికీ భోజనం వడ్డించమని అంటాడు. నువ్వేమన్నా రాజువా.. రాగానే సామంతులు అంతా వచ్చి తినడానికి.. చక్రవర్తిని పీకేస్తే.. రాజు కూడా బంటుగా మారతాడని ఇంట్లో వాళ్లు తిడతారు. వాళ్లు ఆమరణ నిరాహారణ దీక్ష చేస్తున్నారని రుద్రాణి అంటే.. రేపటి నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం కూడా చేస్తారా అని రాజ్ అంటాడు. ఇదంతా నువ్వు కావ్యని తీసుకు రానందుకు కక్ష సాధింపు చర్య నాన్నా అని రుద్రాణి అంటుంది. ఏంటి మమ్మీ ఇది.. నాకు ఆకలి వేస్తుంది. రండి భోజనం చేద్దామని రాజ్ పిలిస్తే.. రామని ఇంట్లో వాళ్లు అంటారు. నువ్వు కావ్యకి చేసిన అన్యాయం తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. నువ్వు కావ్యని ఇంటికి తీసుకొస్తావా లేదా? అని అపర్ణ నిలదీస్తుంది. మధ్యలో రుద్రాణి దూరిపోయి.. పుల్లలు పెడుతుంది. దీంతో రుద్రాణికి ఇచ్చి పడేస్తుంది అపర్ణ.

నా కోడలికే సపోర్ట్ చేస్తా..

ధాన్యలక్ష్మి ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించినా.. తన కొడుకు మాత్రం భార్య వైపే నిలబడ్డాడు. అలాంటి మూర్ఖత్వం, మొండి తనం నా కొడుకులో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి నేను నా కోడలి వైపు నిలబడ్డానని అపర్ణ అంటుంది. రాజ్ నువ్వు కావ్యని తీసుకు వస్తావా లేదా? అని ఇందిరా దేవి అడిగితే.. నాన్నామ్మా నేను ముందే చెప్పాను.. నేను తీసుకు రానని రాజ్ వెళ్లిపోతాడు. ఇక తెల్లవారుతుంది. అమ్మా అపర్ణను చూశావా అని సుభాష్ వచ్చి అడుగుతాడు. లేదురా ఇంకా గదిలోనే ఉందని పెద్దావిడ అంటుంది. గదిలోనే కాదు.. అసలు ఇంట్లోనే లేదని సుభాష్ అంటాడు. అప్పుడే రాజ్ వచ్చి ఎందుకు డాడీ మమ్మీ ఏమన్నా చిన్న పిల్లనా.. ఏ గుడికో వెళ్లి ఉంటుందని రాజ్ అంటే.. నాకు చెప్పకుండా గుడికి వెళ్లదు కదా అని పెద్దావిడ అంటుంది. నాకు తెలిసి రాజ్ మీద అలిగి ఎక్కడికో వెళ్లిపోయారేమోనని స్వప్న అంటుంది. అయినా కొడుకు తల్లి మాటలు లెక్క చేయకుండా నేను చేయను అని లెక్క చేయకపోతే.. ఏ తల్లి మాత్రం ఇంట్లో ఉంటుంది? ముందు ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోండి.. అసలే అక్క మనసు సున్నితమైందని ధాన్యలక్ష్మి అంటుంది.

ఇవి కూడా చదవండి

మనల్ని కూడా ఇంట్లోంచి గెంటేస్తాడేమో..

ముందు కావ్యని ఇంట్లోంచి తరిమేశావు.. ఇప్పుడు అపర్ణ.. ఆ తర్వాత మనల్ని కూడా గెంటేస్తాడులేనని పెద్దావిడ, పెద్దాయన అంటారు. ఈలోపు పని మనిషి శాంతా వచ్చి.. బాబు గారు అమ్మగారి గది శుభ్రం చేస్తుంటే ఈ లెటర్ దొరికిందని శాంతా ఇస్తుంది. లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయింది అనుకుంటే పర్మినెంట్‌గానే వెళ్లిపోయింది అనుకుంట.. ఎక్కడికి వెళ్లిపోయిందో ఏమోనని రుద్రాణి అంటుంది. కట్ చేస్తే.. అపర్ణ కనకం వాళ్ల ఇంటికి వస్తుంది. అపర్ణను చూసి వాళ్లంతా షాక్ అవుతారు. ఏంటి ఇలా వచ్చారని అడుగుతారు? అపర్ణ ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఏంటి బయటనే నిలబెట్టి మాట్లాడతారా అని అంటుంది. సరే లోపలికి రమ్మని పిలుస్తారు. ఈలోపు లెటర్‌లో ఏం రాసిందో స్వప్న చదువుతుంది. అదంతా విని ఇంట్లో వాళ్లు భయపడతారు.

కనకం ఇంటికి వచ్చిన అపర్ణ..

వాడికి బుద్ధి వచ్చి దిగొచ్చి నిన్ను తీసుకెళ్తాననే దాకా ఓ బాంబు పడేసి వచ్చానని అపర్ణ అంటే.. మీరు ఇలా వచ్చి నిజంగానే తప్పు చేశారు. మీరు ఆ ఇంటి మహారాణి ఇలా రావడం మీకు గౌరవం కాదని కావ్య అంటే.. అప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఎందుకు ఆలోచించలేదు. అప్పుడు నువ్వు ఆలోచించి ఉంటే నాకు ఈ తిప్పలు వచ్చేవి కాదు కదా.. వాడికి బుద్ధి రావాలనే ఈ పని చేశానని అపర్ణ అంటుంది. మీరు ఇలా వచ్చి మమ్మల్ని కలపాలి అనుకుంటున్నారు. కానీ దాని వల్ల లాభం ఏంటి? దీని వల్ల నన్ను ఆయన తీసుకెళ్తారే తప్ప.. నాతో కాపురం చేస్తారా? సంతోషంగా ఉంటారా? అని కావ్య అంటుంది. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడిలో ఉన్న అహం తగ్గితే తప్ప.. వాడిలో ఉన్న ప్రేమ బయటకు రాదని అపర్ణ అంటుంది. కావ్య ఇంకా మాట్లాడుతుంటే.. హేయ్ నోరు మూయవే.. ఆవిడ ఇంత సాహసం చేసి వస్తే ఇలా మాట్లాడతావా? అని కనకం తిడుతుంది. ఆ తర్వాత అపర్ణ.. కనకం వాళ్ల ఇంటికి వెళ్తుందని గెస్ చేసిన రాజ్.. మీ ఇంటికే వెళ్లి ఉంటుంది. మీ అమ్మకి ఫోన్ చేయమని రాజ్ అంటాడు.

మళ్ల కొత్త నాటకమా..

స్వప్న కనకానికి ఫోన్ చేస్తుంది. ఆంటీ ఇంట్లోంచి వెళ్లిపోయారు.. అక్కడికి వచ్చారా? అని అడిగితే.. ఆ ఆంటీ వచ్చారని కనకం అంటుంది. నేను చెప్పాను కదా అక్కడికే వెళ్తుందని రాజ్ ఫోన్ తీసుకుని.. మా మమ్మీకి ఫోన్ ఇవ్వమని అంటాడు. అపర్ణ మాట్లాడదు.. ఏంటి మళ్లీ కొత్త నాటకమా.. తల్లీ కొడుకులను విడదీయాలి అనుకుంటున్నారా అని రాజ్ అడుగుతాడు. మాయ మాటలకు పడిపోయేంత చిన్న పిల్లలు ఎవరూ లేరు. నా ఇష్టంతోనే వచ్చానని అపర్ణ చెబుతుంది. ఇంటికి అలా ఎవరైనా అలిగి వచ్చేస్తే ఇంటికి పంపాల్సింది పోయి.. అక్కడే ఉండమంటారా అని రాజ్ అడిగితే.. వాడితో మాట్లాడాల్సిన పని నాకు లేదు. ఎవరు మాట్లాడాలన్నా ఇక్కడికే వచ్చి మాట్లాడమను అని అపర్ణ అంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..