Rocking Rakesh: తన మొదటి సినిమా టికెట్స్ తానే అమ్మిన రాకింగ్ రాకేష్.. వీడియో ఇదిగో

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన మొదటి చిత్రం కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) శుక్రవారం (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు నిర్మాత బాధ్యతలను భుజానకెత్తుకున్నాడీ స్టార్ కమెడియన్.

Rocking Rakesh: తన మొదటి సినిమా టికెట్స్ తానే అమ్మిన రాకింగ్ రాకేష్.. వీడియో ఇదిగో
Rocking Rakesh
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2024 | 4:16 PM

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన మొదటి చిత్రం కేశవ (కేశవ చంద్ర రమావత్). గరుడవేగ అంజి తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటి సత్య కృష్ణన్ కూతురు అన్నన్య కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. . గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాకింగ్ రాకేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పలు సార్లు వాయిదా పడిన కేసీఆర్ సినిమా ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇది తన మొదటి సినిమా కావడంతో రాకింగ్ రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ కు వెళ్లి తన మొదటి సినిమా మొదటి టికెట్ తానే స్వయంగా అమ్మారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో టికెట్ కౌంటర్ లోకి వెళ్లి తనే స్వయంగా టికెట్ అమ్మాడు రాకేష్. టికెట్స్ తీసుకుంటున్నప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రాకింగ్ రాకేష్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా కేసీఆర్ సినిమా కోసం తన ఇంటిని తాకట్టు పెట్టినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాకింగ్ రాకేష్. ఇక ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుజాత, అతని భార్య జోర్దార్ సుజాతలే యాంకర్లుగా వ్యవహరించారు. అలాగే ఈ సినిమా పోస్టర్లను కూడా స్వయంగా తనే రోడ్లపై అంటించాడు. ఆ వీడియో సైతం నెట్టింట వైరల్ గా మారింది. మరి రాకింగ్ రాకేష్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

సంధ్యా థియేటర్ లో రాకింగ్ రాకేష్..

ఇక  తన సినిమా ఆడియెన్స్ కు  బాగా రీచ్ కావాలనే ఉద్దేశంతో టికెట్ రేట్స్ కూడా భారీగా తగ్గించామని  రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చారు.  ‘ కేసీఆర్ సినిమా టికెట్ వందరూపాయిలే. సంధ్యా లాంటి థియేటర్స్ లో టికెట్ 80, 50 రూపాయలకే దొరుకుతుంది’ అని  సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు రాకేష్.

తన సినిమా పోస్టర్లు తనే గోడపై అతికిస్తూ..

View this post on Instagram

A post shared by Tag Telugu (@tag.telugu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు