Ram Charan: ఎంతైనా రామ్ చరణ్ గ్రేట్ అబ్బా! ఆలయ పురోహితుడికి దక్షిణగా రూ. 500 నోట్ల కట్ట.. వీడియో ఇదిగో

ఎంత డబ్బు ఉన్నా ఇతరులకు దానం చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ కాస్త ముందుంటుంది. ఆ కుటుంబంలోని హీరోలందరూ ఇతరులకు సాయం చేయడంలో చాలా ముందుంటారు.

Ram Charan: ఎంతైనా రామ్ చరణ్ గ్రేట్ అబ్బా! ఆలయ పురోహితుడికి దక్షిణగా రూ. 500 నోట్ల కట్ట.. వీడియో ఇదిగో
Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2024 | 3:33 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాను దర్శించుకోవడంపై కొందరి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రామ్ చరణ్ తప్పేం చేయలేదంటూ మరికొందరు స్వామిజీలు మెగా హీరోకు అండగా నిలుస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే దర్గా సందర్శనకు ముందే కడప బిల్డప్ సర్కిల్ లోని విజయ దుర్గా దేవీ ఆలయాన్ని సందర్శించారు రామ్ చరణ్. అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ దుర్గా దేవి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తన తదుపరి సినిమా ‘ఆర్‌సి16’ స్క్రిప్ట్ ను అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు.

ఇవి కూడా చదవండి

అయితే రామ్ చరణ్ ఈ ఆలయ సందర్శనకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరలవుతోంది. సాధారణంగా ఏవైనా టెంపుల్స్ కు వెళ్లినప్పుడు పురోహితులకు దక్షిణ సమర్పిస్తాం. రామ్ చరణ్ కూడా దుర్గాదేవి ఆలయంలోని పురోహితులకు దక్షిణ ఇచ్చాడు. అయితే అది రూ.500 నోట్ల కట్ట. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎంత డబ్బున్నా దానం చేయడానికి చాలా గొప్ప మనసుండాలి’.. ‘రామ్ చరణ్ గ్రేట్ ‘ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వీడియో ఇదిగో..

ఈ పర్యటనలో రామ్ చరణ్ వెంట ఆర్ సీ 16 దర్శకుడు, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మెగా హీరోను చూడ్డానికి అభిమానులు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణానికి తరలి వచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

విజయ దుర్గ ఆలయంలో రామ్ చరణ్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.