Brahmamudi, January 7th Episode: అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
హడావిడిగా రాజ్ ఆఫీస్‌కి చేరుకుంటాడు. కావ్య మధ్యలోనే దిగిప మర్చిపోయిన ఫైల్స్ తీసుకు రావడానికి వెళ్తుంది. ఈలోపు బంగారు ఆభరణాలను చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే కిరీటం అసలు కాదు.. నకిలీదని తేలుతుంది. అది విని సెక్యూరిటీ సంతోష పడతాడు. రాజ్‌ని అవమానిస్తాడు జగదీష్.. అప్పుడే కావ్య వచ్చి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ లేవగానిక బద్ధకిస్తాడు. రాజ్‌ని లేపేందుకు ప్రయత్నిస్తుంది కావ్య. కానీ రాజ్ లేవడు. దీంతో కితకితలు పెట్టి లేపుతుంది కావ్య. ఇక రాజ్ ముద్దు పెట్టేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. సరే ముద్దు పెట్టుకుంటే.. జీవితాంతం నా చేయి పట్టుకోవాలని కావ్య అంటే.. రాజ్ ఆలోచిస్తాడు. టైమ్ అవుతుంది పదా.. వెళ్లాలి అంటూ కారు ఎంతో స్పీడుగా పోనిస్తాడు రాజ్. ఏవండీ ఏంటి ఆ స్పీడు మెల్లగా వెల్లమని కావ్య అంటే.. టైమ్ అవుతుందని రాజ్ అంటే.. ఇలానే వెళ్తే మనం లేటు కావ్య, రాజ్ అవుతాం. ఇలా లేటుగా లేచి.. ఇంత తొందరగా వెళ్లడం అవసరమా అని కావ్య అంటే.. నీ గోలతో ఉన్న ఆనందం పోయేలా ఉందని రాజ్ అంటే.. మీకు ఇంకా ఆనందాన్ని దూరం చేసే విషయం చెప్పనా అని కావ్య అంటే.. ఏంటది అని రాజ్ షాక్ అవుతాడు. మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఫైల్ ఉండాలి కదా ఏది? అని కావ్య అంటుంది. ఇక రాజ్ సైడ్‌కి కారు ఆపి తల పట్టుకుంటాడు. ఏంటండీ మీరు? లేటుగా లేచి హడావిడిగా వచ్చేసి ఇంటి దగ్గరే ఫైల్ వదిలేశారు. నా డిజైన్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. నేను కారు తీసుకుని ఆఫీస్‌కి వెళ్లిపోండి. నేను ఇంటికి వెళ్లి డిజైన్స్ తీసుకొస్తానని కావ్య అంటుంది.
ఇప్పుడు నా టైమ్ నడుస్తుంది..
రాజ్ హడావిడిగా ఆఫీస్‌కి వస్తాడు. మరోవైపు కావ్య ఆటోలో ఇంటికి వెళ్లి ఫైల్స్ తీసుకొస్తుంది. ఈలోపు సెక్యూరిటీ అనామికకు ఫోన్ చేస్తాడు. చిన్న కన్ఫ్యూజన్ మేడమ్.. కావ్య మేడమ్ ఆఫీస్‌కి రాలేదని చెప్తాడు. ఏంటి అని అనామిక షాక్ అవుతుంది. సరేలే మనం చేసిన పని చేశాం కదా.. రాజ్ పరువు ఎలాగైన పోతుందని సామంత్ అంటాడు. సరిపోదు.. ఆ జగదీష్ గాడు నాకు నకిలీ బంగారం అమ్ముతావా అని వాళ్లను తిడుతూ ఉంటే.. ఆ మాటలు పడలేక కావ్య ఏడుస్తూ ఉంటే.. ఆ విజువల్స్ చూడ ముచ్చటగా ఉంటుంది. అది నేను చూడాలి. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుందని అనామిక అంటుంది. ఆ తర్వాత కావ్యకి ఫోన్ చేసి.. పాటలు పాడుతుంది. వేస్ట్ ఫెలో అని కావ్య ఫోన్ పెట్టేస్తుంటే.. అయినా నువ్వేంటి అక్కడ ఆఫీస్‌లో జగదీష్ గారితో అక్షింతలు వేయించుకోకుండా.. ఇలా బయట ఉంటే ఎలా? అని అనామిక అంటే.. ఇంకాసేపటిలో నేను గెలవబోతున్నా అని కావ్య అంటే.. నేను మీకు జరగబోయే అవమానం గురించి మాట్లాడబోతున్నా. నన్ను అవమానించి మీరంతా సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఉరుకుంటానా.. ఇప్పుడు నా టైమ్ నడుస్తుందని తెగ గర్వ పడుతుంది అనామిక.
కిరీటం అసలిది కాదు.. నకిలీ..
అనామిక మాటలతో కావ్య ఆలోచనలో పడుతుంది. మరోవైపు ఆఫీస్‌కి జగదీష్ గారు రావడంతో.. రాజ్ వెళ్తాడు. కావ్య ఫోన్ చేస్తుంటే టేబుల్ మీద పెట్టేసి వెళ్తాడు రాజ్. రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే.. కావ్య మరింత టెన్షన్ పడుతుంది. ఇక రాజ్ నగలన్నీ చూపిస్తాడు. నగలన్నీ చాలా బావున్నాయని చూసి తెగ పొగిడేస్తాడు జగదీష్. ఇక అప్పుడే అప్రైజర్ నగలన్నీ చెక్ చేస్తాడు. అన్నీ సరిగ్గానే ఉన్నా.. ఒక్క కిరీటం మాత్రం నకిలీది ఉంటుంది. ఈ కిరీటం నకిలీది సర్ అని అప్రైజర్ అంటే.. ఏంటి మరోసారి చెక్ చేయమని జగదీష్ అంటాడు. మళ్లీ చెక్ చేసి.. సారీ సర్ ఇది నకిలీదే అని అప్రైజర్ అంటాడు. ఏంటి రాజ్ ఇది? మీ సంస్థను, తాతయ్యను నమ్మి ఇంత పెద్ద డీల్ ఇస్తే.. ఇలాగేనా చేసేది అంటూ జగదీష్ నోరు పారేసుకుంటాడు. దీంతో రాజ్ అయోమయంలో పడతాడు. ఏం అంటున్నారు సర్.. మేము ఎందుకు ఫ్రాడ్ చేయాలి అనుకుంటాం.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఫుల్ సెక్యూరిటీ పెట్టామని రాజ్ అంటే.. అంత పెద్ద కిరీటాన్ని మాయం చేసి ఆ ప్లేస్‌లో డమ్మీ పెడతారా? మరి ఒరిజినల్ కిరీటం ఏమైంది చూపించు అంటూ జగదీష్ నోరు పారేసుకుంటాడు. అప్పుడే కావ్య ఆఫీస్‌కి వస్తుంది.
అనామిక ప్లాన్‌కి చెక్ పెట్టిన కావ్య..
మిమ్మల్ని నమ్మి కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ చెడగొడతారా.. బిజినెస్ చేసే అలవాటు ఇదేనా? చాలా పెద్ద ఫ్రాడ్ జరిగింది. ఇది నీకు తెలియకుండా జరిగిందని నేను అనుకోవడం లేదు. మీ సంస్థ ఇప్పటిది కాదని.. మిమ్మల్ని నమ్మి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇస్తే.. నకిలీ కిరీటం ఇచ్చి మోసం చేస్తారా? అని జగదీష్ సీరియస్ అవుతాడు. పక్క నుంచి ఇదంతా సెక్యూరిటీ చూస్తాడు. అయినా ఇంత పెద్ద విషయం ఎలా మర్చిపోయారు? ఇది ఒరిజినల్ కిరీటం కాదు.. మోడల్ డిజైన్.. ఒరిజినల్ డిజైన్ లోపల భద్రంగా ఉందని కావ్య అనగానే.. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. సెక్యూరిటీ పర్పస్ కింద నకిలీదే కదా పెడతాం.. అది క్వాలిటీ చెకింగ్ పెట్టారా అని కావ్య అనగానే.. అయిపోయింది.. అంతా అయిపోయిందని సెక్యూరిటీ బాధ పడతాడు. రండి మీ చేతుల మీదగానే ఆ కిరీటం తీసుకొచ్చి పెట్టండి. ఇదే అసలైన మేలిమి బంగారంతో చేసిన కిరీటం. చెక్ చేసుకోమని కావ్య అంటే.. అప్రైజర్ చెక్ చేసి.. ఇది అసలైన కిరీటమని అంటాడు.
మనల్ని జైలుకి పంపించేలా ఉన్నారు..
ఏంటి సర్.. కనీసం ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా దుగ్గిరాల సీతారామయ్య మనవడినే అనుమానించారా? అలాంటి అలవాట్లు ఈయన రక్తంలోనే లేవు సర్ అని కావ్య అంటే.. ఐ యామ్ సారీ అంటాడు జగదీష్. సర్ నేను సారీ ఎక్సెప్ట్ చేయడం లేదని రాజ్ అంటే.. అది నీ సంస్కారం. నిజంగా మీ కంపెనీ హిస్టరీ తెలిసి ఉండి.. మీ స్టాఫ్ ముందు నిన్ను అనుమానించి.. అవమానించానని జగదీష్ అంటాడు. నీతికి నిజాయితీకి విలువలకు పెట్టింది పేరు అయిన ఈ కంపెనీలో ఎప్పటికీ ఎలాంటి తప్పు జరగదని కావ్య అంటుంది. ఇదంతా విన్న సెక్యూరిటీ.. వెంటనే అనామికకు ఫోన్ చేస్తాడు. ఏంటి ఏమైంది.. మీ బాస్ ఆ కావ్య మీద కేసు పెడతానని బెదిరిస్తున్నాడా? అని అనామిక అంటే.. కేసుకు ఎందుకు పెడతాడు మేడమ్.. ఇంకాసేపటిలో ఈ విషయం బయట పెడితే నన్ను కుమ్మేసి లోపల వేసి.. మీపై కూడా కేసు పెట్టేలా ఉన్నారు. కావ్య మేడమ్ తెలివి తేటల ముందు మనం ఎంత మేడమ్.. మీ ముందు ఉన్న కిరీటం బంగారం కాదని అంటాడు సెక్యూరిటీ.. అది విని సామంత్, అనామిక షాక్ అవుతారు. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..