Tollywood: అయ్యా బాబోయ్.. లేడీ గెటప్‏లో షాకిచ్చిన బుల్లితెర హీరో.. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..?

సాధారణంగా సినీరంగంలో కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి ఏమాత్రం మొహమాట పడకుండా లేడీ గెటప్స్ వేస్తున్నారు కొందరు స్టార్స్. వెండితెరపై ఇదివరకు చాలా మంది హీరోలు తమ సినిమాల్లో లేడీ గెటప్స్ వేసి అలరించారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మెప్పించిన నటులు సైతం ఫీమేల్ గెటప్స్ ద్వారా మెప్పిస్తున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: అయ్యా బాబోయ్.. లేడీ గెటప్‏లో షాకిచ్చిన బుల్లితెర హీరో.. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..?
Ambati Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 05, 2025 | 5:06 PM

సినిమా, పాత్ర ప్రాధాన్యతను బట్టి చాలా మంది హీరోలు లేడీ గెటప్స్ వేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ వస్తే ఆడవేషంలో అదరగొడుతున్నారు. స్టార్ హీరోలు ఏమాత్రం మొహమాటపడకుండా లేడీ గెటప్స్ లో తమదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ బుల్లితెర స్టార్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది పాపులర్ నటులు తమ పాత్రల కోసం ఎలాంటి గెటప్స్ వేయడానికైనా సిద్ధపడుతున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో లేడీ గెటప్ లో కోపంగా కనిపిస్తున్న ఆ నటుడిని గుర్తుపట్టారా..? బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ఈ మధ్య కాలంలో మరింత పాపులర్ అయ్యాడు. సీరియల్లో హీరోగా నటించిన అతడికి బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. ఈ రియాల్టీ షోలో తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

పైన ఫోటోలో ఉన్న నటుడు మరెవరో కాదు.. బుల్లితెర స్టార్ అర్జున్ అంబటి. అగ్నిసాక్షి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సీరియల్లో తనదైన నటనతో తెలుగువారికి దగ్గరైన అర్జున్..ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యాడు. ఇందులో తన ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. టాప్ 5లో ఒకడిగా నిలిచాడు.

ఇక సీరియల్స్, బిగ్ బాస్ రియాల్టీ షో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్ కూడా కొట్టేశాడు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 8 బజ్ షోకు హోస్టింగ్ చేసి తెలుగులో ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు. ఇక ఇంతకు ముందు పలు వెబ్ సిరీస్ చేశాడు అర్జున్. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటో అర్దనారి అనే సినిమాలోనిది. ఇందులో ట్రాన్స్ జెండర్ పాత్రలో అదరగొట్టారు అర్జున్.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.