Brahmamudi, December 9th Episode: ముక్కలైపోయిన ఇందిరా దేవి మనసు.. వంటగదిలో పడుకున్న కావ్య!
రుద్రాణి, ధాన్యలక్ష్మిలు కలిసి ఆస్తి గురించి గొడవ చేస్తే.. ఇందిరా దేవి అన్నం కూడా తినకుండా కోపంగా అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పెద్దావిడ కోసం కావ్య భోజనం తీసుకెళ్తుంది..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఆస్తి గురించి అందరూ గొడవ పడుతూ ఉంటారు. ఇక ఓపిక నశించిన ఇందిరా దేవి.. అసలు మీరు మనుషులేనా? ఇంటి పెద్దకు ఆపద వస్తే అందరూ కలిసి ఎలా బతికించుకోవాలా అని ఆరాట పడుతూ ఉంటారు. ఆయనకు ఏదన్నా అయితే ఆస్తులు ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నారా? ఉమ్మడి కుటుంబంలో ఉండాల్సిన వాల్లేనా మీరు? నేను ఎప్పుడూ ఎదురు మాట్లాడలేదు. బావగారికి ఎదురు చెప్పలేదు. తోడి కోడలు ఎప్పుడు ఏ పని చెప్పినా చేసేదాన్ని.. మరదుల ముందు కుర్చీలో కూడా కూర్చోలేదు. ఆడపడుచు వస్తే కాలికి నీళ్లిచ్చి.. ప్రేమగా పలకరించేదాన్ని. అత్తగారు నిద్రపోయే ముందు కాళ్లు పట్టేదాన్ని.. ఇంటికి బంధువులు వస్తే ఇంకో నాలుగు రోజులు ఉండమనేదాన్ని.. నా ఇద్దరి కోడళ్లని కూతుర్లగానే చూసుకున్నా. ఇప్పుడు నాకు ఇంత కష్టం వస్తే ఓదార్చడం పోయి.. కడుపుకు ఇంత అన్నం కూడా తిననివ్వకుండా చేస్తున్నారే.. మీరు అసలు మనుషులేనా? పండంటి సంసారం నాది అంటూ చూసుకున్నా.. ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్లకు ఇచ్చాను. కానీ వీటిల్లో ఏ ఒక్కటి అయినా నీకు తెలుసా? ధాన్యలక్ష్మి.. నువ్వు ఆస్తుల గురించి మాట్లాడుతున్నావా.. ఛీ నీ కంటే పిశాచులు నయ్యం అంటూ ఇందిరా దేవి వెళ్లిపోతుంది.
ఆస్పత్రికి వచ్చేసిన ఇందిరా దేవి..
ఆ తర్వాత కావ్య ఇందిరా దేవికి భోజనం వడ్డిస్తుంది. అప్పుడే వచ్చిన అపర్ణ.. కావ్య ఎవరి కోసం భోజనం తీసుకెళ్తున్నావ్? అని అడుగుతుంది. అమ్మమ్మ గారి కోసం అత్తయ్యా.. పొద్దున్న నుంచి ఆవిడ ఏమీ తినలేదు. ఇప్పుడు కూడా తిని ట్యాబ్లెట్స్ వేసుకోపోతే.. ఆవిడ బీపీ తగ్గిపోతుందని కావ్య అంటుంది. నువ్వు చెప్పింది నిజమే.. పదా నేను కూడా వస్తానని అపర్ణ వెళ్తుంది. కానీ అక్కడ ఇందిరా దేవి ఉండదు. అత్తయ్య గారు గదిలో లేరా.. ఇక్కడే ఉన్నాను అనుకున్నానే.. ఎక్కడికి వెళ్లారని అపర్ణ అంటే.. ఆవిడ ఎక్కడకు వెళ్లారో నాకు తెలుసని కావ్య అంటుంది. కట్ చేస్తే.. ఆస్పత్రిలో సీతా రామయ్య దగ్గర ఉంటుంది ఇందిరా దేవి. ఏంటి బావా ఇది ఉలుకు పలుకు లేకుండా ఇలా పడుకుని ఉన్నావ్.. లే బావా కళ్లు తెరువు.. నీ చిట్టీతో మాట్లాడు.. నువ్వు బాగున్నానని చెప్పు బావా అని అంటుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి.. తాతయ్యకు ఏమీ కాదు నాన్నమ్మా.. త్వరగానే ఆయన మనతో పాటు వస్తారని కళ్యాణ్ అంటాడు. నాకు ఆ ఆశలు చచ్చిపోయాయి కళ్యాణ్.. ఆ ఇంట్లో ఆనందం అనే ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారని బాధ పడుతుంది. ఇన్నాళ్లూ ఆ ఇంటి ప్రతిష్టలు, పరువు మర్యాదలను కాపాడుకుంటూ వచ్చాను. ఆ తర్వాత తరం వాళ్లు కూడా అలాగే ఉంటారని ఆశపడ్డాను. కానీ పచ్చగా పెరిగిన చెట్టుకు.. చెదలు పట్టినట్టు.. స్వార్థం పెరిగిపోయింది. అందుకే ఈయన ఇలా కూలిపోయాడు. పిల్లలకు బాధ్యతలు అప్పగించాక.. ప్రపంచాన్ని చుట్టేద్దాం అనుకున్నారు. కానీ చివరి రోజుల్లో కూడా ఆయనకు ప్రశాంతత లేకుండా చేశారని ఇందిరా దేవి బాధ పడుతుంది.
నేను కూడా ఆస్పత్రిలో జాయిన్ అవుతా..
అప్పుడే కావ్య వచ్చి.. ఎవరికీ చెప్పకుండా ఇలా వచ్చేస్తే ఎలా? తాతయ్యను చూడాలి అనుకున్నారు సరే.. చెప్తే నేను కూడా మీతో పాటు వచ్చేదాన్ని కదా.. మీ పాటికి మీరు వచ్చేస్తే.. ఎక్కడికి వెళ్లారు అనుకోవాలి? మీరు కనిపించకపోయే సరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా అని కావ్య అంటే.. నేను కనిపించకపోతే.. ఆ ఇంట్లో బాధ పడేవారు ఎవరూ లేరని పెద్దావిడ అంటే.. నేను లేనా అని కావ్య అడుగుతుంది. నువ్వు ఉన్నావు కాబట్టే కాస్త అయినా బ్రతుకుతుందని ఇందిరా దేవి అంటుంది. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు.. ఇప్పుడైనా తినకపోతే నీరసం వస్తుంది. మీరు తినలేదని నేను కూడా నిన్నటి నుంచి ఏమీ తినలేదని అంటుంది కావ్య. ఇప్పుడు కళ్లు తిరుగుతున్నాయి.. నేను కూడా తాతయ్య గారి దగ్గర ఇంకో బెడ్ వేసుకుని ఆస్పత్రిలో జాయిన్ అవుతాను. కళ్యాణ్ గారు డాక్టర్‌కి చెప్పి మరో బెడ్ ఏర్పాటు చేయమని కావ్య అంటుంది. వద్దులే తింటానని ఇందిరా దేవి.
కావ్యకు గుడ్ న్యూస్..
పెద్దావిడ తిన్న తర్వాత బయటకు వస్తారు కావ్య, కళ్యాణ్‌లు. కవి గారు డాక్టర్ గారు ఏం చెప్పారని అడుగుతుంది కావ్య. మన చేతుల్లో ఏమీ లేదని తేల్చి చెప్పేశారు వదినా అని అంటాడు కళ్యాణ్. తాతయ్య గారు త్వరగానే కోలుకుంటారు. ఇంతకీ అప్పూ ఏది కనిపించడం లేదని కావ్య అడుగుతుంది. అప్పూ.. అది.. అంటూ ఏమీ చెప్పడు కళ్యాణ్. ఏమైంది ఏదన్నా సమస్య ఎదురైందా అని కావ్య అడిగితే.. లేదు.. ఎస్‌ఐ ట్రైనింగ్‌కి వెళ్లిందని కళ్యాణ్ చెప్తే.. కావ్య ఎంతో సంతోషిస్తుంది. ఇంత మంచి న్యూస్.. బ్యాడ్ న్యూస్‌లా చెప్తారేంటి? అని అడుగుతుంది కావ్య. తాతయ్యకు ఇలా జరగడం బ్యాడ్ న్యూసే కదా వదినా.. బాధగా ఉందని కళ్యాణ్ అంటే.. తాతయ్యకు ఇలా జరిగిందని అప్పూకి చెప్పారా అని కావ్య అడిగితే.. చెప్పలేదు వదినా.. తెలిస్తే ఇక్కడికే వచ్చేస్తుందని అంటాడు కళ్యాణ్.. చాలా మంచి పని చేశారని కావ్య అంటుంది.
ధాన్యలక్ష్మి ఆస్తి పిచ్చి..
ఆ తర్వాత ధాన్యలక్ష్మి పేపర్స్ చూస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన ప్రకాశం.. ఏంటి పరీక్షలు ఏమన్నా రాస్తున్నావా అని అడిగితే.. అబ్బా మీకు అన్నీ కొత్తే.. ఆస్తి కళ్యాణ్ పేరు మీద రాయించడానికి పేపర్స్ రెడీ చేస్తున్నానని ధాన్యలక్ష్మి అంటే.. ప్రకాశం వాటిని తీసుకుని చించేస్తాడు. నీకు డబ్బు పిచ్చి పట్టిందే అని ప్రకాశం అంటే.. కాదు ఇది ముందు జాగ్రత్త.. రేపు మావయ్య గారికి ఏదన్నా అయితే ముందుగానే కళ్యాణ్ పేరు మీద ఆస్తి రాయించుకుంటే మంచిదని ధాన్యలక్ష్మి అంటే.. ఆస్తి గురించి మాట్లాడొద్దని ప్రకాశం సీరియస్‌గా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత కావ్య ఇంట్లో వంట గదిలో కింద పడుకుంటుంది. అప్పుడే వచ్చిన అపర్ణ.. షాక్ అయి కావ్యా అని పిలుస్తుంది. ఏంటి అత్తయ్యా ఏమన్నా కావాలా అని అడిగితే.. మీ అత్తగారు నీకు ఎలా కనిపిస్తుంది? అర్థరాత్రులు కూడా లేచి పని చెప్పేదానిలా ఉన్నానా? ఏంటి ఇక్కడ పడుకున్నావ్? నిన్ను ఇలా చూసి నా కడుపు తరుక్కు పోయిందని అపర్ణ అంటుంది.
రాజ్‌లో మానవత్వం..
మరి ఏం చేయమంటారు? నన్ను తాతయ్య తీసుకొచ్చారు? ఆయనేమో ఇంటికి వచ్చిన గెస్టులా చూస్తున్నాడని కావ్య అంటుంది. ఆగు ఇప్పుడే పని చెప్తా.. రేయ్ రాజ్ అంటూ రాజ్‌ని పిలుస్తుంది అపర్ణ.. ఇటు రా.. తను ఎవరు? ఈ ఇంట్లో ఎందుకు ఉంది? ఈ ఇంటికి నీ భార్య తిరిగి వచ్చింది. ఇంత రాత్రి అయినా.. నీ భార్య గదికి రాకపోతే.. ఎందుకు వెళ్లింది? ఏమైంది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటూ తిడుతుంది. నేను రమ్మని అనలేదు.. పొమ్మని చెప్పలేదని రాజ్ అంటే.. చూడు తను ఎక్కడ పడుకుందోనని అపర్ణ చెబితే.. ఇక్కడ పడుకుందా? హేయ్ ఇక్కడ మానవత్వం లేని మనుషులు ఉన్నారు అనుకున్నావా? ఈ ఇంట్లో.. నిన్ను నేల మీద పడుకోమని ఎవరు చెప్పారు అని రాజ్ అడుగుతాడు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..