Brahmamudi, December 5th Episode: ఉరి వేసుకున్న ధాన్యలక్ష్మి.. కుప్పకూలిపోయిన సీతా రామయ్య!
కావ్యని అపర్ణ వాళ్లు ఇంటికి తీసుకొచ్చే సరికి ధాన్యలక్ష్మి ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది చూసి వాళ్లు షాక్ అవుతారు. ఎంత నచ్చ చెప్పినా వినదు. ఆస్తిలో కళ్యాణ్‌కు వాటా రాయాల్సిందేనని పట్టు పడుతుంది. దీంతో సీతా రామయ్యకు ఒక్కసారిగా గుండె పోటు వస్తుంది..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నువ్వు రోజూ ఇలాగే మంచి పాటలు రాసి.. కళ్యాణ్ మా వాడు అనే స్థాయికి దుగ్గిరాల కుటుంబం చెప్పుకునే స్థాయికి రావాలని అప్పూ అంటుంది. కళ్యాణ్ నా భర్త అని నువ్వు చెప్పుకోవా అని అడుగుతాడు కళ్యాణ్. అది ఎప్పుడూ ఉంటుంది రా భయ్.. నువ్వు వెళ్లు లేటు అవుతుందని అప్పూ అంటుంది. అప్పుడే అనామిక చప్పట్లు కొడుతూ ఎంట్రీ ఇస్తుంది. వెళ్లు వెళ్లు అక్కడ నువ్వు టీ ఇవ్వలేదని తిడతారని అంటుంది. ఏయ్ ఏం మాట్లడుతున్నావ్? అని అప్పూ అంటే.. నిజాలు నీ కళ్యాణ్ అక్కడ గురువు గారికి కాఫీలు, టీలు అందిస్తున్నాడని అంటుంది. నీకు వేరే పనేం లేదా.. ఇక్కడికి వచ్చావు అని అప్పూ అంటే.. అందుకే నిన్ను నీ కూచి తిక్కదాన్ని చేసి ఆడిస్తున్నాడని అనామిక అంటే.. తిక్క గిక్క అన్నావంటే మూతి పళ్లు రాలతాయని అప్పూ అంటుంది. అవునా కళ్యాణ్.. నువ్వు నీ పొట్టి దగ్గర ఏమీ దాచడం లేదా అని అనామిక అడిగితే.. అది దాల్చాల్సినంత పెద్ద విషయం కాదని కళ్యాణ్ అంటాడు. ఏంటి కళ్యాణ్ తను చెప్పేది నిజమా.. నువ్వు ఏమన్నా నా దగ్గర దాచావా అని అప్పూ అంటే.. తనేం చెప్తాడు? నేను చెప్తాను విను.. ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి ఓ పది వేలు ఉన్న చెక్ తీసుకొచ్చి.. పెద్ద గొప్పలు చెప్పావు కదా.. కానీ అంత లేదు.. ఓ పెద్ద లిరిక్ రైటర్ దగ్గర.. కాళ్లు పట్టి.. చేతులు పట్టి.. టీలు సర్వ్ చేస్తే వచ్చిన కూలి.. అసిస్టెంట్‌గా.. మూడేళ్లు ఊడిగం చేస్తానని అగ్రిమెంట్ రాసిచ్చాడు అందుకే ఈ అవకాశం వచ్చిందని అంటూ అనామిక ఇష్టమొచ్చినట్టు మాట్లాడి వెళ్తుంది.
నా దగ్గర ఏమీ దాచకు కూచి..
ఏంటి కూచి నా దగ్గర ఎందుకు నిజం దాచడం ఎందుకు? నాకు ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు? అదేంటి నువ్వు ఊడిగం చేస్తున్నావని చెబుతుంది. అసలు మన గురించి ఒకరు అంత చులకనగా మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి? చెప్పు అని అప్పూ అడిగితే.. అది కాదు పొట్టి.. మా అమ్మకు చిన్నతనంగా ఉంది. నచ్చిన పని మాత్రమే చేయి అన్నావు. కానీ లక్ష్మీ కాంత్ గారు అగ్రిమెంట్ చేస్తేనే తప్ప అసిస్టెంట్‌గా చేయడం కుదరదని అన్నారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని కళ్యాణ్ అంటే.. కష్టమైనా సుఖమైనా ఏదన్నా నాకు చెప్పావు అనుకున్నాను. ఇలా ఎప్పుడూ నిజాలు దాచకు అని అప్పూ అంటుంది. సరే అంటాడు కళ్యాణ్.
ఉరి వేసుకుంటున్న ధాన్యలక్ష్మి..
మరోవైపు.. హాలులో కూర్చొని ఉన్న ధాన్యలక్ష్మి మనసులో మరింత విషం ఎక్కిస్తుంది రుద్రాణి. నువ్వు ఇలా కూర్చొని ఉంటే ఏం సాధిస్తావు? మీ తోడి కోడలు, ముసలి వాళ్లు ఎలాగైనా కావ్యని ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత తనని సిఈవోగా చేస్తారు. ఇక నీకు నీ కొడక్కి చిల్లి గవ్వ కూడా దొరకదు. ఆ తర్వాత నువ్వు ఎంత గొడవ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీ మొగుడు కూడా వాళ్లకే సపోర్ట్‌గా మాట్లాడతారు. వాళ్లు కావ్యని ఇంట్లోకి తీసుకొచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి. చచ్చిపోయినట్టు డ్రామా చేయి అని రుద్రాణి సలహా ఇస్తుంది. మరోవైపు అప్పుడే కావ్య వాళ్లు ఇంటికి వస్తారు. వాళ్లు ఇంట్లోకి వచ్చే ముందే.. ధాన్యలక్ష్మి ఉరి వేసుకుంటూ కనిపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ధాన్యలక్ష్మి ఏం చేస్తున్నావ్.. దిగు అని అంటే.. అందరూ అక్కడే ఉండండి.. ఈ ఇంట్లో కాలు పెట్టినందుకు నాకు నేనే ఉరి శిక్ష వేసుకుంటున్నానని ధాన్యలక్ష్మి అంటుంది. నీకు పిచ్చి పట్టిందా? దిగు అని అపర్ణ అంటే.. అసలు నీకు ఏం కావాలి ధాన్యలక్ష్మి అని రుద్రాణి అడిగితే.. నా కొడుక్కి న్యాయం కావాలి.. ఆస్తులు వెంటనే పంచమని డిమాండ్ చేస్తుంది.
ధాన్యలక్ష్మికి ఒక్కటి ఇచ్చిన అపర్ణ..
ఈ ఇంటి పెద్దలు, ఈ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ వారికి న్యాయం చేయరని అర్థమైంది. అందుకే ఇలా చేస్తున్నానని ధాన్యలక్ష్మి అంటుంది. ఏయ్ దిగు దిగు ముంద అని అపర్ణ దింపి.. ఒక చెంప దెబ్బ ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్? నువ్వు? వాడికి అన్యాయం జరగడానికి కారణం నువ్వు.. అని అంటుంది. అవును నువ్వు నీ కోడల్ని కోడలిగా ఒప్పుకుని ఉంటే.. వాడు బయటకు ఎందుకు వెళ్తాడు? నీ అర్థం లేని షరతులు ఒప్పుకోలేదని చచ్చి ఎవర్ని సాధించాలి అని ఇందిరా దేవి అడుగుతుంది. ఇలాంటి అర్థం లేకుండా నా మీద అరిచి ఇన్నాళ్లూ అందరూ నా నోరు మూయించారు. ఇక నేను ఊరుకోనని ధాన్యలక్ష్మి అంటుంది. మధ్యలో రుద్రాణి దూరిపోయి.. కావాలని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. రుద్రాణి నువ్వు ఇంకొక్క మాట మాట్లాడితే ఇదే ఉరి నీకు వేసి చంపేస్తానని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. ఏమో నీకు ఎలాగో సొంత తెలివి లేదు.. పైగా ఇలాంటి పాము సవాసం పట్టి ఇలా చేస్తావా.. చస్తే చావవే. చచ్చి పోవాలి అనుకున్నదానివి అందరూ వచ్చేదాక ఆగడం ఎందుకు? ఎవరూ లేని సమయంలో చచ్చిపోవాలని ప్రకాశం అంటాడు.
నా కొడుక్కి న్యాయం జరగాల్సిందే..
నీకూ నీ కొడుక్కి అన్యాయం చేయాలని కాదు.. నా కొడుకు మనసు మార్చాలని కావ్యని ఆఫీసులో కూర్చోబెట్టాం. అంతే కానీ వాళ్లకు ఆస్తులు దోచి పెట్టడానికి కాదు. ఉమ్మడి ఆస్తిని ముక్కలు చేయడం ఇష్టం లేక ఆలోచిస్తున్నారు తప్ప.. మా మాట లెక్క చేయకపోవడం కాదు.. నీ కొడుక్కి నువ్వు ఏం న్యాయం చేశావు చెప్పు? అదే తప్పు నేను కూడా చేశాను.. ఆ తప్పు నువ్వు చేయవద్దని ఎన్ని సార్లు చెప్పాను నీకు? ఏ రోజు నీ కోడల్ని ఒప్పుకుంటావో.. ఆరోజే నీ కొడుకు ఇంటికి తిరిగి వస్తాడని అపర్ణ అంటుంది. కళ్యాణ్‌కి ఎప్పటికీ అన్యాయం జరగదు.. వాడే జీవితంలో గెలవాలని పోరాడుతున్నాడు. వాడి ఆస్తి ఎప్పటికీ పోదు.. ఎవరీ తీసుకోరని ఇందిరా దేవి అంటుంది.
కుప్పకూలిపోయిన సీతారామయ్య..
చాలు.. మీకు ఓ నమస్కారం.. ఇల్లు ముక్కలు కాకూడదన్న ఆలోచన అడ్డం పెట్టి.. మీరంతా ఒక్కటై పోయి నన్ను మాత్రమే వేరు చేస్తున్నారు. ఇంత దూరం వచ్చాక నేను ఇక సహించ లేను. డిమాండ్ చేసి అడుగుతున్నా.. మర్యాదగా నా కొడుక్కి సగ భాగం రాసి ఇస్తారా లేదా? ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రాణం తీసుకుంటానని ఉరి వేసుకోబోతుంది ధాన్యలక్ష్మి. తనని ఆపే ప్రయత్నంలో అందరూ ఉంటారు. అదంతా చూసి సీతా రామయ్యకు గుండె పోటు వస్తుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తారు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..