Brahmamudi, December 2nd Episode: స్టెల్లాకు అసిస్టెంట్స్‌గా మారిన రాజ్ గ్యాంగ్.. నవ్వులే నవ్వులు..

వంట చేయడానికి స్టెల్లా ఇంటికి వస్తుంది. స్టెల్లాను చూసిన రాహుల్, ప్రకాశంలు పులిహోర కలుపుతారు. ఆ తర్వాత రాజ్, ప్రకాశం, రాహుల్‌లను అసిస్టెంట్స్‌గా మార్చేస్తుంది. వాళ్ల చేతనే వంట చేయిస్తుంది..

Brahmamudi, December 2nd Episode: స్టెల్లాకు అసిస్టెంట్స్‌గా మారిన రాజ్ గ్యాంగ్.. నవ్వులే నవ్వులు..
BrahmamudiImage Credit source: Disney hot star
Follow us
Chinni Enni

|

Updated on: Dec 02, 2024 | 11:55 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. దుగ్గిరాల ఇంటికి రాజ్ అపాయిట్మెంట్ చేసిన స్టెల్లా వస్తుంది. స్టెల్లా రాగానే రాహుల్, ప్రకాశంలు ఓవరాక్షన్ చేయడం మొదలు పెడతారు. రాజ్‌ని చూసి యువర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ అని అంటుంది. రాజ్ కూడా స్టెల్లాని పొగుడుతాడు. పోపుల పెట్టెలా రకరకాలుగా ఉందిరా అని ప్రకాశం అంటే.. ధాన్యలక్ష్మి సీరియస్ అవుతుంది. దీంతో ప్రకాశాన్ని తిడుతూ పొగుడుతుంది స్టెల్లా. ఆ తర్వాత రాహుల్‌ని చూసి ఇంత డెలిషీయస్‌గా ఉన్నాడు ఇతను ఎవరు? అని అడుగుతుంది. రాహుల్ మా అత్త కొడుకు అని రాజ్ చెప్తాడు. స్టెల్లాని చూసి తెగ సిగ్గు పడిపోతూ ఉంటాడు రాహుల్. అలాగే ప్రకాశానికి పులిహోర, రాజ్‌కి చెర్రీ అని పెడుతుంది. నీకు అన్ని వంటలు వచ్చా అని ప్రకాశం అడిగితే.. అన్ని రకాల వంటలు చేయడం వచ్చు అని స్టెల్లా అంటుంది. సూపర్ ఇక నుంచి ఎవరి ఫుడో తినాల్సిన పని లేదు. ఎవరెవరికి ఏం కావాలో చెప్పమని రాజ్ అడుగుతాడు. ఇక అందరూ లిస్ట్ చెప్తారు. మీకు ఏం కావాలో చేస్తాను. ఇంతకీ నాకు అసిస్టెంట్స్ ముగ్గురు కావాలని అంటుంది స్టెల్లా. వంటకే ముగ్గురు కావాలంటే.. బాత్రూమ్స్‌ కడగటానికి ఇంకా ఎంత మంది కావాలో అని ఇందిరా దేవి అడిగితే.. చీ చీ అలాంటి పనులు నేను ఎందుకు చేస్తాను.. కేవలం కుకింగ్ మాత్రమే చేస్తానని స్టెల్లా అంటుంది.

అసిస్టెంట్స్‌గా మారి రాజ్ అండ్ కో గ్యాంగ్..

సరే అసిస్టెంట్స్ కావాలని స్టెల్లా అడిగితే.. రేపటికి అరేంజ్ చేస్తాను.. ఇవాళ్టికి అరేంజ్ చేసుకోమని రాజ్ అంటే.. లేదు నాకు అసిస్టెంట్స్ లేకపోతే వంట చేయలేనని అంటుంది స్టెల్లా. మావయ్యా ఇటు రా అంటూ మేము ముగ్గురం ఉన్నాం కదా.. హెల్ప్ చేస్తామని రాహుల్ అంటాడు. ఇక వంట గదికి వెళ్లిన స్టెల్లా.. ఏంటి ఇది అంతా అంత మురికిగా ఉంది. నాకు ఇలా ఉంటే వంట చేసే మూడ్ అస్సలు రాద.. ఫస్ట్ ఇది క్లీన్ చేయమని అంటుంది స్టెల్లా. పులిహోర చేస్తాడని రాహుల్.. స్టెల్లా బుగ్గాల మీద రాస్తుంది. దీంతో రాహుల్.. కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడ కిచెన్ ఊడ్చి.. గిన్నెలు కడిగేస్తాడు ప్రకాశం. ఆ తర్వాత వెజిటేబుల్స్ ఎవరు కట్ చేస్తారని స్టెల్లా అడిగితే.. నేను చేస్తానులేనని రాజ్ కట్ చేస్తాడు. అది చూసిన స్టెల్లా.. నో నో ఇదేమన్నా ఆర్డరీ హోటల్ ఫుడ్ అనుకున్నావా.. స్టార్ హోటల్ లుక్ రావాలంటే.. అన్నీ రౌండ్‌గా కట్ చేయాలి.. అప్పుడే వంటలన్నీ బాగా వస్తాయి అంటుంది. దీంతో మళ్లీ కూరగాయలు కట్ చేస్తాడు రాజ్.

వంట చేసిన రాజ్ అండ్ కో గ్యాంగ్..

ఆ తర్వాత రాజ్, రాహుల్‌, ప్రకాశం చేతల మీదుగానే వంట చేయిస్తుంది స్టెల్లా. ఓకే వంట పూర్తి అయింది. ఇప్పుడు ఈ డిషెస్ తీసుకెళ్లి.. డైనింగ్ టేబుల్ మీద పెట్టి వడ్డించుకుని తినేయమని అంటుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. దానికి కావ్య, ఇంట్లోని సభ్యులందరూ నవ్వుతారు. అదేంటి.. నువ్వే వడ్డిస్తావని మా రాజ్ చెప్పాడని ప్రకాశం అంటాడు. కుకింగ్ సెషన్ మాత్రమే నేను చూసుకుంటాను. మిగతావన్నీ అందరూ వడ్డించుకుంటారు.. నాకు సంబంధం లేదని స్టెల్లా అంటుంది. ఏంటి ఇలా అసిస్టెంట్స్‌తో సర్వం చాకిరీ చేయించుకుని.. పైపైన గరిటె తిప్పినందుకు నీకు లక్ష రూపాయలు ఇవ్వాలా.. ఏడ్చినట్టు ఉంది ఇక కుదరదని రాజ్ అంటాడు. రేయ్ ఊరుకోరా అలా అంటే స్టెల్లా మానేస్తుంది. రా స్టెల్లా మనం సెల్ఫీలు తీసుకుందామని రాహుల్, ప్రకాశంలు ఫొటోలు దిగుతారు. మరోవైపు కావ్య.. పెద్దాయన, పెద్దావిడ, సుభాష్‌లకు భోజనం వడ్డిస్తుంది. అది చూసి ఏంటి మన డిషెస్ ఇంకా రాలేదా అని అడుగుతాడు. అటు చూడమని స్వప్న అంటే… మా కాపురాలు ముక్కలు చేయడానికి లక్ష రూపాయలు ఇచ్చి ఒకదాన్ని తీసుకొచ్చావా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది.

ఇవి కూడా చదవండి

అపర్ణ విడాకులు..

ఇక రాజ్ వెళ్లి.. వంటలన్నీ తీసుకెళ్తాడు. ఆ తర్వాత రాజ్ వాళ్లను తినడానికి పిలుస్తాడు. రేయ్ రాజ్ వంటలు నువ్వే చేశావా.. ఆ తిప్పులాడి చేసిందా అని ఇందిరా దేవి అడిగితే.. అదెక్కడ చేసింది.. వీళ్ల చేతనే చేయించిందని స్వప్న అంటుంది. స్టార్ హోటల్స్‌లో షెఫ్‌లు అలానే ఉంటారని రాజ్ అంటాడు. ఏంటి ఇంకా అలా ఉన్నారు.. త్వరగా తినకపోతే ఫుడ్ తినడానికి పనికి రాదని స్టెల్లా అంటే.. సరిపోయింది.. పది నమిషాల్లో పాచిపోయేదానికి లక్ష రూపాయలు ఇచ్చిందని ఇందిరా దేవి అంటుంది. ఇక ఫుడ్ అందరూ వడ్డించుకుంటారు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో అపర్ణ.. సుభాష్‌కు విడాకులు ఇస్తున్నట్టు నోటీసులు పంపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్..? మాటలకందని విషాదం
అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్..? మాటలకందని విషాదం
ఓటీటీలో ఈవారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఓటీటీలో ఈవారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఆ గ్రామంలో మందుబాబులకు నో ఎంట్రీ.. చుక్క వేస్తే..
ఆ గ్రామంలో మందుబాబులకు నో ఎంట్రీ.. చుక్క వేస్తే..
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
ప్రజలు ఏం చెప్తే అదే చేయాలి.. అధికారులకు ఏపీ సీఎం సంచలన ఆదేశాలు
ప్రజలు ఏం చెప్తే అదే చేయాలి.. అధికారులకు ఏపీ సీఎం సంచలన ఆదేశాలు
బుమ్రా బంతి పడితే వణికిపోయే బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా..?
బుమ్రా బంతి పడితే వణికిపోయే బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా..?
స్టెల్లాకు అసిస్టెంట్స్‌గా మారిన రాజ్ గ్యాంగ్.. నవ్వులే నవ్వులు..
స్టెల్లాకు అసిస్టెంట్స్‌గా మారిన రాజ్ గ్యాంగ్.. నవ్వులే నవ్వులు..
నయనతార లేకపోతే ఈ రోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు..
నయనతార లేకపోతే ఈ రోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు..
తిరుమల ఘాట్‌రోడ్డులో యువకుల హంగామా.. కారు డోర్ తెరచి విన్యాసాలు
తిరుమల ఘాట్‌రోడ్డులో యువకుల హంగామా.. కారు డోర్ తెరచి విన్యాసాలు
తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీని వీడని వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్
తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీని వీడని వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై