Brahmamudi, August 6th Episode: నీచంగా మాట్లాడి వెళ్లిపోయిన పెళ్లికొడుకు.. చచ్చిపోయే పరిస్థితి తీసుకొస్తా..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూని కిడ్నాప్ చేసి బెదిరిస్తుంది అనామిక. నీ పెళ్లి ఆగిపోయి.. నీ క్యారెక్టర్ మీద నేను వేసిన ముద్ర ఇంకా బలంగా పడుతుంది. పెళ్లికి వచ్చిన వాళ్లు అంతా నీకు నచ్చిన వాడితోనే లేచి పోయావ్ అనుకుంటారని అప్పూని భయానికి గురి చేస్తుంది అనామిక. మరోవైపు రుద్రాణి దొరికిందే ఛాన్స్ కదా అని.. రెచ్చిపోయి మాట్లాడుతుంది. పెళ్లి కూతురు కనిపించక పోవడం ఏంటి? ఇదెక్కడి విడ్డూరం.. పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయింది అంటే..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూని కిడ్నాప్ చేసి బెదిరిస్తుంది అనామిక. నీ పెళ్లి ఆగిపోయి.. నీ క్యారెక్టర్ మీద నేను వేసిన ముద్ర ఇంకా బలంగా పడుతుంది. పెళ్లికి వచ్చిన వాళ్లు అంతా నీకు నచ్చిన వాడితోనే లేచి పోయావ్ అనుకుంటారని అప్పూని భయానికి గురి చేస్తుంది అనామిక. మరోవైపు రుద్రాణి దొరికిందే ఛాన్స్ కదా అని.. రెచ్చిపోయి మాట్లాడుతుంది. పెళ్లి కూతురు కనిపించక పోవడం ఏంటి? ఇదెక్కడి విడ్డూరం.. పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయింది అంటే.. అందరూ లేచిపోయిందనే అనుకుంటున్నారు అని అంటుంది. కళ్యాణ్, అప్పూ ఇద్దరూ కూడా పెళ్లీ పెటాకులు లేకుండా ఏడవాలని అంటుంది అనామిక. నువ్వు మాట్లాడుతుంటే.. పాత సినిమాల్లో శిఖండిలా ఉందని అప్పూ అంటుంది. నాకు లాభం జరగక పోయినా.. నీకు నష్టం జరిగితే చాలు. ఎంత మగరాయుడులా పెరిగినా.. నువ్వు కూడా ఒక ఆడ పిల్లవే కదా.. నీ శీలం మీద మచ్చ పడితే.. ఇప్పటికే నిన్ను బజారు దాన్ని పిలిచినట్టు పిలుస్తున్నారు.
నీ ఫ్యామిలీకి చచ్చిపోయే పరిస్థితి తీసుకొస్తా..
ఇప్పుడు ఈ పెళ్లి కూడా ఆగిపోతే.. దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్లు నీలా చెడిపోయిన ఆడదాన్ని ఇంట్లోకి కూడా రానివ్వరు. నీ కోసం నన్ను కాదనుకున్న ఆ కళ్యాణ్ చచ్చేదాకా ఒంటరిగానే మిగిలి పోతాడని అనామిక అంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందని నువ్వు సంతోష పడొచ్చు. కానీ ఈ నిజం బయట పడితే చట్టం నిన్ను ఊరికే వదిలి పెట్టదని అప్పూ అంటుంది. పిచ్చిదానా.. ఈ పెళ్లి ఆగిపోతే.. నిన్నూ, నీ ఫ్యామిలీని అందరూ వెలి వేస్తారు. ఆ అవమానం భరించలేక నువ్వూ మీ అమ్మా విషం తాగి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అదీ నా టార్గెట్. నాకు పడ్డ శిక్షకు బదులుగా నీకు వేసే శిక్ష ఇది. ఇక నిన్ను ఎవరూ కాపాడలేరని అనామిక అంటుంది. కట్ చేస్తే.. కళ్యాణ్ పెళ్లి మండపానికి వస్తూ ఉంటాడు.
కావ్య బాధ..
మరోవైపు అప్పూ కోసం వెతుకుతూ ఉంటారు రాజ్, కావ్యలు. ఇంకా కనిపించకపోతే వెంటనే పోలీసులతో మాట్లాడతాడు రాజ్. పోలీసలు వెంటనే రంగంలోకి దిగుతారు. ఏమన్నారు? అని కావ్య అంటే.. వెతుకుతాం అన్నారని రాజ్ చెప్తాడు. వాళ్లు వెతికేది ఎప్పుడు? తీసుకొచ్చేది ఎప్పుడు? మీరే చూస్తున్నారు కదా.. మీ పిన్ని మండపంలో ఎన్నెన్ని మాటలు అంటున్నారో.. ఇలాంటి మాటలు వస్తాయనే నా జాగ్రత్తల్లో నేను ఉన్నాను. ఒకవేళ మీరు తీసుకెళ్లినా ఇలాగే గొడవ జరిగేది. నేనే వెళ్లి ఈలోపు నా చెల్లిని వెతుక్కుంటాను అని కావ్య అంటే.. పోలీసులు ఇప్పుడే కదా ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఏ చిన్న క్లూ దొరికినా మనమే వెళ్లి తీసుకొద్దాం రాజ్ అంటాడు. ఆ రుద్రాణి గారు కాస్త సమయం కూడా మా ఫ్యామిలీకి ఇవ్వడం లేదు. సూటి పోటి మాటలతో హింసిస్తున్నారని కావ్య మాట్లాడుతుంది. ఎన్ని గొడవలు జరిగినా.. ఆ పెళ్లి కొడుకు నమ్మకుండా పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మీ పిన్ని గారు పెళ్లి కూతురు వెళ్లిపోయిందని ప్రచారం చేస్తుంటే.. వాళ్లు ఏం అనుకుంటారు? అని కావ్య బాధ పడుతుంది.
నోరు పారేసుకున్న ధాన్య లక్ష్మి..
దారిలో సడెన్‌గా ఓ చిన్న బాబు అడ్డం వస్తాడు. వెంటనే బ్రేక్ వేస్తాడు కళ్యాణ్. అలా వెళ్తుండగా.. దారిలో బంటీ పడిపోయి ఉంటాడు. ముందుకు వెళ్లి మళ్లీ వచ్చి కారు ఆపుతాడు కళ్యాణ్. బంటీ దగ్గరకు వెళ్లి పిలుస్తాడు. దీంతో బంటీ అప్పూని కిడ్నాప్ చేసిన విషయం అంతా చెప్తాడు. వెంటనే బయలు దేరతాడు కళ్యాణ్. కావ్య, రాజ్‌లు మండపంలోకి వస్తారు అప్పూ దొరికిందా? అని రుద్రాణి వెటకారంగా అడుగుతుంది. మరోవైపు ధాన్య లక్ష్మి నోరు పారేసుకుంటుంది. అవును కళ్యాణ్ కానీ ఒప్పుకుని ఉంటే ఈ పాటికి వాళ్లకు పెళ్లి చేసి హనీమూన్‌కి కూడా పంపించేసే వాడిని అని రాజ్ అంటాడు. ఇంతకీ అప్పూ ఏమైందని సుభాష్ అడిగితే.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఎక్కడున్నా వెతికి తీసుకొస్తారని రాజ్ చెప్తాడు.
వెళ్లిపోయిన పెళ్లి కొడుకు..
మరోవైపు కనకం ఎంతో బాధ పడుతూ ఉంటుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావ్ కనకం.. నా కర్మ కాలితే నా కొడుకుని పెళ్లి చేసుకునే వస్తుంది. ఇక్కడ ఏమీ తెలీని దానిలా నిల్చుని అక్కడ అంతా జరిపించేసే వస్తుందని ధాన్య లక్ష్మి అంటుంది. కళ్యాణ్, అప్పూ కలిసి లేచిపోయారని రుద్రాణి అంటుంది. ఇక అక్కడే ఉండి అదంతా చూస్తూ వింటున్న పెళ్లికొడుకు.. మీరు కాస్త మాట్లాడటం ఆపుతారా? ఇప్పటివరకూ మీ గురించే తప్పా.. నా గురించి అసలు ఆలోచించారా? అప్పూ గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. తీరా తాళి కట్టే సమయానికి అప్పూ వెళ్లి పోయింది. దాని వెనుక లేచి పోయిందని వార్తలు కూడా వినపిస్తున్నాయి. ఇంకా నేను మీ అమ్మాయిని చేసుకుంటే నా అంత వెధవ ఎవడూ ఉండడు. నానా మాటలు ఆడి పెళ్లి కొడుకు వాళ్లు వెళ్లి పోతారు.
ధాన్య లక్ష్మిని, రుద్రాణిని పట్టుకుని కడిగేసిన పెద్దావిడ..
దీంతో కనకం, కృష్ణ మూర్తిలు బాగా కృంగి పోతారు. పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా వెళ్లి పోతారు. దీంతో ధాన్య లక్ష్మి, రుద్రాణిపై సీరియస్ అవుతుంది ఇందిరా దేవి. పచ్చని పందిట్లో పెళ్లి కూతురు గురించి, వాళ్ల ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడారే వాళ్ల సంస్కారం ఇదేనా? మీరు అసలు ఆడ పుట్టుకే పట్టారా? మీ మాటల వల్ల అంత ఉన్నతంగా ఆలోచించే పెళ్లి కొడుకు కూడా వెళ్లిపోయాడు. ఇప్పుడు మీ కడుపు మంటలు చల్లా రాయా? ధాన్య లక్ష్మిని, రుద్రాణిని పట్టుకుని కడిగేస్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.