Brahmamudi, August 29th Episode: కళావతి, రాజ్‌ల మధ్య చిచ్చు పెట్టిన రుద్రాణి.. ఇరుక్కుపోయిన కావ్య..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్, అప్పూలను ఇంటికి రమ్మని కృష్ణమూర్తి పిలుస్తాడు. అందుకు అప్పూ ఒప్పుకోదు. ఇల్లరికం ఉండటం కంటే.. మేము సొంతంగా బతకడం మేలని అంటుంది. మాకు విలువ కూడా ఉండదని అప్పూ అంటుంది. సరేలేవే మీరు సంతోషంగా ఉన్నారు. అది చాలు నాకు. చాలా తృప్తిగా ఉంది. మాకు పెళ్లి అయినప్పుడు ఇంతకంటే చిన్న గదిలోనే ఉన్నామని అంటుంది. పుట్టింటి నుంచి చీర సారే..

Brahmamudi, August 29th Episode: కళావతి, రాజ్‌ల మధ్య చిచ్చు పెట్టిన రుద్రాణి.. ఇరుక్కుపోయిన కావ్య..
BrahmamudiImage Credit source: Disney Hotstar
Follow us
Chinni Enni

|

Updated on: Aug 29, 2024 | 1:06 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్, అప్పూలను ఇంటికి రమ్మని కృష్ణమూర్తి పిలుస్తాడు. అందుకు అప్పూ ఒప్పుకోదు. ఇల్లరికం ఉండటం కంటే.. మేము సొంతంగా బతకడం మేలని అంటుంది. మాకు విలువ కూడా ఉండదని అప్పూ అంటుంది. సరేలేవే మీరు సంతోషంగా ఉన్నారు. అది చాలు నాకు. చాలా తృప్తిగా ఉంది. మాకు పెళ్లి అయినప్పుడు ఇంతకంటే చిన్న గదిలోనే ఉన్నామని అంటుంది. పుట్టింటి నుంచి చీర సారే తీసుకొస్తారు. కానీ మీ పెళ్లి అనుకోకుండా జరిగింది. పెళ్లి ఖర్చులకే డబ్బు అంతా అయిపోయింది. మా దగ్గర కూడా ఏమీ లేవు. అందుకే ఏమీ తీసుకురాలేక పోయాం. ఇదిగో ఈ మూడు వేలు ఉన్నాయి. ఇవి తీసుకోమని అప్పూకి ఇస్తుంది కనకం. సరే ఇక బయలు దేరుతున్నాం.. ఏదన్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయమని బయటకు వచ్చి కనకం బాధ పడుతుంది. ఏమైంది అని కృష్ణమూర్తి అడుగుతాడు.

శనగలతోనే కడుపు నింపుకుంటున్నారు..

అసలు వాళ్ల దగ్గర ఏమీ లేదు. పూట గడవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎవరో వాయనం ఇస్తే ఆ శనగలతోనే మనకు టిఫిన్ చేసి పెట్టింది. మనం రాకపోతే ఆ గుప్పెడు శనగలతోనే కడుపు నింపుకునే వాళ్లని కనకం చాలా బాధ పడుతుంది. బాధ పడకే ఎంతో కొంత ఇచ్చాం కదా.. ఓ నాలుగు రోజులు సరిపోతాయి లే. ఈలోపు అల్లుడు ఉద్యోగం చేసుకుంటాడని కృష్ణ మూర్తి వాళ్లు బయలుదేరుతారు. ఇదిగో కవి వీటితో వెళ్లి సరుకులు తీసుకురమ్మని అప్పూ కళ్యాణ్‌కి ఇస్తుంది. ఇది మీ అమ్మా వాళ్లు ఇచ్చారు. నేను ముట్టుకోను. ఇంకా నిన్ను నేను కష్ట పెట్టలేను. ఏదన్నా ఉద్యోగం చూసుకోవాలని కళ్యాణ్ వెళ్లి పోతాడు.

ఇవాళ నీకు సెలవు..

కట్ చేస్తే.. హాలులో క్యారమ్ బోర్డు రెడీ చేస్తాడు రాజ్. కావ్య పై నుంచి వస్తూ కిచెన్‌లోకి వెళ్తుంది. అది చూసిన రాజ్ హలో కళావతి అటు ఎక్కడికి అని పిలుస్తాడు. ఎందుకు? ఏంటి? అని కావ్య అంటే.. ఇవాళ నీకు నేను సెలవు ప్రసాదిస్తున్నానని రాజ్ అంటాడు. వామ్మో అందరికీ ఏం చెప్పాలని కావ్య అంటే.. నేను ఉన్నాను కదా నీకు కొండంత అండగా అని రాజ్ అంటాడు. అప్పుడే అపర్ణ, ఇందిరా దేవిలు వచ్చి.. ఇదేంటిరా.. అని అడుగుతారు. అమ్మో కాఫీ ఇవ్వాలని కావ్య లేస్తే.. ఆగు చెప్పాను కదా నీకు సెలవు అని.. శాంతా రెండు కాఫీలు తీసుకురమ్మని రాజ్ చెప్తాడు. నెక్ట్స్ అందరూ చేరి మేము కూడా ఆడతామని చేరతారు. అందరూ సంతోషంగా నవ్వుతూ ఆడతారు. అత్తా కోడళ్లు ఇద్దరూ ఒకటి అయితే ఎవరిని అయినా ఓడగొడతామని అంటారు.

ఇవి కూడా చదవండి

ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టిన రుద్రాణి..

అప్పుడే పై నుంచి శంఖిని రుద్రాణి, మరోవైపు ధాన్య లక్ష్మిలు దిగతారు. ఆహా ఎంత రమణీయంగా ఉందని రుద్రాణి అంటే.. లాగి పెట్టి కొట్టినా నీకు బుద్ధి లేదా? సిగ్గు లేకుండా మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నావ్? అని ధాన్య లక్ష్మి అంటుంది. దీంతో రాత్రి స్వప్న చేసిన పని గురించి రుద్రాణి చెప్పి.. కావాలనే ధాన్యలక్ష్మిని పడేస్తుంది. మరోవైపు కింద అందరూ నవ్వుతూ ఆడుతూ ఉంటారు. వాళ్లను చూసి కావాలనే ధాన్య లక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. అటు చేరు.. అందరూ ఎలా నవ్వుతున్నారో.. నీ కొడుకుకి తినడానికి తిండి లేక.. ఇక్కడ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు.. ఏంటో ఈ పక్ష పాతం అని అంటుంది రుద్రాణి.

ఈ రోజు నా భార్యకు సెలవు..

ఇలా ఆడుకోవడమేనా.. కడుపుకు ఇంత తింటి పెట్టే ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా? అని రుద్రాణి కావాలనే రెచ్చగొడుతుంది. టిఫినే కదా అని చప్పట్లు కొడతాడు రాజ్. ఈ రోజు నా శ్రీమతికి సెలవు. టిఫిన్లు, భోజనాలు అన్నీ బయట నుంచే వస్తాయి. ఆకలి వేసిన వాళ్లు తినండి.. లేని వాళ్లు నాతో ఆడమని రాజ్ అంటాడు. రాజ్, కావ్యలను చూసిన రుద్రాణి కళ్లు కుట్టుకుంటూ గదిలోకి వచ్చి రాహుల్‌తో తన ఫస్ట్రేషన్‌ని బయట పెడుతుంది. ప్రపంచంలో వీళ్లే మంచి భార్య భర్తలు అయినట్టు ఓ మురిసి పోతున్నారు. కళ్యాణ్ దూరమైతే డిప్రెషన్‌లోకి వెళ్తాడు అనుకుంటే.. పెళ్లాంతో కలిసి ఆటలు ఆడుతున్నాడు. ఇలా అయినా మంచిదే కదా.. అప్పుడే కంపెనీ మన చేతిలో ఉంటుంది. వాళ్లిద్దరూ కలిసి పోయి ఒక్కటి అయితే.. మనకు ఆ ఛాన్స్ ఉండదని రుద్రాణి అంటుంది.

రుద్రాణి స్కెచ్..

మరి ఏం చేయాలి మామ్ అని రాహుల్ అంటాడు. ఇదే టైమ్‌లో కావ్యపై రాజ్ కు కోపం వచ్చేలా చేయాలి. దానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. ఒకప్పుడు నువ్వు కంపెనీలో ఇల్లీగల్‌గా బంగారం కొనాలి అనుకున్నావ్ కదా.. అది ఇప్పుడు చేస్తున్నట్టు స్వప్నకు తెలిసేలా చేయి. ఆ స్వప్న వెళ్లి కావ్యతో చెబుతుంది. దీంతో ఆ కావ్య గొడవ చేస్తుంది. దీంతో వాళ్లిద్దరి మధ్య గొడవలు వస్తాయి. వాళ్లిద్దరి కోసం సొంత కొడుకును దూరం చేస్తావా మామ్ అని రాహుల్ అంటే.. రేయ్ ఆ పని చేస్తున్నట్టు నటిస్తాం అంతే అని రుద్రాణి అంటుంది. సరే అని అంటాడు రాహుల్.

కళావతి, రాజ్‌ల మధ్య చిచ్చు..

ఇక రాహుల్ రంగంలోకి దిగుతాడు. స్వప్న రావడం చూసి.. ఇల్లీగల్ బంగారం కొంటున్నట్టు ఫోన్‌లో మాట్లాడతాడు. ఇప్పుడు అంతా నేనే చూసుకుంటాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏమన్నా జరిగితే కంపెనీ మూత పడుతుంది కానీ.. మనకు వచ్చే నష్టం లేదని రాహుల్ అంటాడు. అందంతా విన్న స్పప్న వెళ్లి కావ్యకు అంతా చెబుతుంది. అది అంతా విని కావ్య షాక్ అవుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.