Anchor Rashmi: ‘మీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ జీవితం గడిపేస్తా’.. యాంకర్ రష్మీ ఎమోషనల్

తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లోనూ మెరుస్తోందీ ముద్దుగుమ్మ. టీవీషోలు, సినిమాల సంగతి పక్కన పెడితే.. యాంకర్ రష్మీ ఇంట్లో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Anchor Rashmi: 'మీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ జీవితం గడిపేస్తా'.. యాంకర్ రష్మీ ఎమోషనల్
Anchor Rashmi Gautam
Follow us
Basha Shek

|

Updated on: Aug 28, 2024 | 3:52 PM

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టింది. జబర్దస్త్ కామెడీ షో తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లోనూ మెరుస్తోందీ ముద్దుగుమ్మ. టీవీషోలు, సినిమాల సంగతి పక్కన పెడితే.. యాంకర్ రష్మీ ఇంట్లో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తాతయ్య కన్నుమూశాడు. ఈ దుర్వార్తను రష్మీనే సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతకు ముందు ఏడాది క్రితమే నానమ్మ కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నానమ్మ, తాతయ్యలతో తనకున్న అనుబంధాన్ని తల్చుకుంటూ ఎమోషనలైంది రష్మీ. ఆమె షేర్ చేసిన పోస్ట్ పలువురిని కదిలించింది. తాజాగ రష్మీ తన తాతని తలుచుకొని మరో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘మనమే కాదు.. మూగజీవాలు కూడా మా తాతయ్య మరణాన్ని తట్టుకోలేకపోతున్నాయి. మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. గత ఏడాదిన్నర కాలంగా మీరు నాన్నమ్మను ఎంతగా మిస్ అయ్యారో నాకు తెలుసు. ఇప్పుడు మీరిద్దరూ పైన మళ్లీ కలుసుకుంటారని అనుకుంటున్నాను. నా జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను తాతయ్య. కానీ నా లైఫ్ మొత్తం నానితో, నీతో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. 17 ఆగస్టు 2024, 19 జనవరి 2023 ఒక శకం ముగిసింది’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది రష్మీ గౌతమ్.

ఈ సందర్భంగా తన తాతయ్య మృతదేహం వద్ద తన పెట్ డాగ్ నిల్చొని చూస్తున్న ఫొటోను షేర్ చేసింది రష్మీ. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి అందరినీ కదిలిస్తుంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రష్మీకి ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే మరింత స్ట్రాంగ్ గా ఉండాలంటూ ధైర్యం చెబుతున్నారు. ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Rashmi Gautam (@rashmigautam) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

రష్మీ తాతయ్య, బామ్మల వీడియో ఇదిగో..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Rashmi Gautam (@rashmigautam) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.