Brahmamudi, August 28th Episode: రుద్రాణీకి ఒక్కటి ఇచ్చిన ధాన్యలక్ష్మి.. ఏడిపించిన అప్పూ.. కళ్యాణ్‌లు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. స్వప్న పన్నిన వలలో రాహుల్, రుద్రాణిలు చిక్కుకుంటారు. బలూన్‌లో ఉన్న లాఫింగ్ గ్యాస్ బయటకు వస్తుంది. దీంతో పడి పడి నవ్వుతారు రుద్రాణిలు వాళ్లు. పక్క నుంచి అదంతా చూస్త నవ్వుతుంది స్వప్న. ఇక ధాన్య లక్ష్మిలు పడి పడి నవ్వుతూనే ఉంటారు. ఈ సీన్ నిజంగానే కామెడీగా ఉంటుంది. రాహుల్, రుద్రాణిలు ఇద్దరూ కిందకు వస్తారు. అక్కడ ధాన్య లక్ష్మి బాధ పడుతూ ఉంటుంది. వీళ్లిద్దరూ ధాన్య లక్ష్మి దగ్గరకు వెళ్తారు. రుద్రాణి, రాహుల్‌లను చూసిన ధాన్య లక్ష్మి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. స్వప్న పన్నిన వలలో రాహుల్, రుద్రాణిలు చిక్కుకుంటారు. బలూన్‌లో ఉన్న లాఫింగ్ గ్యాస్ బయటకు వస్తుంది. దీంతో పడి పడి నవ్వుతారు రుద్రాణిలు వాళ్లు. పక్క నుంచి అదంతా చూస్త నవ్వుతుంది స్వప్న. ఇక ధాన్య లక్ష్మిలు పడి పడి నవ్వుతూనే ఉంటారు. ఈ సీన్ నిజంగానే కామెడీగా ఉంటుంది. రాహుల్, రుద్రాణిలు ఇద్దరూ కిందకు వస్తారు. అక్కడ ధాన్య లక్ష్మి బాధ పడుతూ ఉంటుంది. వీళ్లిద్దరూ ధాన్య లక్ష్మి దగ్గరకు వెళ్తారు. రుద్రాణి, రాహుల్‌లను చూసిన ధాన్య లక్ష్మి వాళ్లపై సీరియస్ అవుతుంది. నా పరిస్థితి చూస్తుంటే నవ్వు వస్తుందా? అని అడుగుతుంది ధాన్యం. నీ పరిస్థితి చూస్తుంటే మాకు కూడా అలాగే ఉందని చెబుతూ రుద్రాణి, రాహుల్‌లు నవ్వుతారు. వాళ్లను చూసి ధాన్య లక్ష్మి మరింత సీరియస్ అవుతూ.. రుద్రాణి చెంప మీద ఒక్కటి పీకుతుంది. అయినా రుద్రాణి, రాహుల్‌లు నవ్వుతూనే ఉంటారు. ఛీ అంటూ అక్కడి నుంచి ధాన్య లక్ష్మి వెళ్లిపోతుంది.
నవ్వి నవ్వి చావండి..
ఇంత నవ్వు ఎలా వస్తుందని రుద్రాణి అంటుంది. అప్పుడే స్వప్న వచ్చి.. నేను చెబుతాను అని అంటుంది. ఏంటి చెప్పు అని అడిగితే.. నేనే మీ గదిలో లాఫింగ్ గ్యాస్ వదిలాను. అప్పూ ఈ ఇంటికి వస్తే అవమానించిందే కాకుండా.. కావ్య, రాజ్‌ని ఇంట్లోంచి పంపించేయాలని చూస్తారా? మీ ప్లాన్ తెలిసే నేను ఇలా పగ తీర్చుకున్నాను. తెల్లార్లూ నవ్వి నవ్వి పొట్ట పగిలి నవ్వి చావమని అనేసి స్వప్న వెళ్లిపోతుంది. ఇక పొట్ట పట్టుకుని రాహుల్, రుద్రాణిల నవ్వుతూనే ఉంటారు.
కావ్య, రాజ్‌ల రొమాన్స్..
ఇక తెల్లవారుతుంది. కావ్య నిద్ర లేచి వెళ్తుండగా.. తన పైట రాజ్ కింద ఉంటుంది. అది చూసి కావ్య సిగ్గు పడుతూ చూడగా.. తన పైట రాజ్ కింద ఉంటుంది. దీంతో కోపం తెచ్చుకుంటూ పైట లాగుతున్నా రాదు. అప్పుడే రాజ్ నిద్ర లేచి.. ఏంటే ఏంటిది? అని అడుగుతాడు. ఇదేంటి? అని అడుగుతుంది కావ్య. ఇవాళ పని పాతర పెట్టు.. ఇక్కడే ఉండు.. నాతోనే ఉండమని రాజ్ ఎంతో ప్రేమగా అంటాడు. అయినా ఏమీ తెలీనట్టు కావ్య అడుగుతుంది. నాకు ఏమీ పని లేదని రాజ్ అంటే.. నాకు చాలా పనులు ఉన్నాయి.. ఉదయం టీ కోసం అందరూ ఎదురు చూస్తారు. నేను వెళ్తున్నా అని కావ్య వెళ్తుండగా.. రాజ్ కావ్య పైట చెంగు పట్టుకుని లాగుతాడు. రాజ్ రమ్మంటే.. కావ్య రానని అంటుంది. ఇక అప్పుడే రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది. ఇక వీళ్లిద్దరి రొమాన్స్ మొదలవుతుంది.
పాపం ఏడిపించిన అప్పూ.. కళ్యాణ్‌లు..
కట్ చేస్తే.. కళ్యాణ్, అప్పూలా సీన్ రెడీ అవుతుంది. మనకు కాఫీ కావాలంటే ఏం కావాలి? అని అడుగుతాడు కళ్యాణ్. కాఫీ తాగాలని ఉందా? అని అప్పూ అడిగితే.. అబ్బే ఏమీ లేదని కళ్యాణ్ అంటాడు. సరేలే కానీ ఈ పూట మనం ఏం తిందామని అప్పూ అడిగితే.. ప్రాస పాయాసం.. పదాల పరమాన్నం అని చెప్తాడు కళ్యాణ్. అది విని అప్పూ నవ్వుతుంది. అప్పుడే ఇంటి ఓనర్ వస్తుంది. నిన్న వరలక్ష్మీ వ్రతం చేశాను. నిన్ను పిలుద్దామంటే లేవు. అందుకే నీ వాయనం నీకే అప్పజెప్తున్నా అని వాయనం ఇస్తుంది. ఇదిగో ప్రాస పాయసం.. పదాల పరామాన్నం కూడా వచ్చిందని అనుకుని ఇద్దరూ తిందాం అనుకుంటారు. అప్పుడే కనకం, కృష్ణ మూర్తిలు వస్తారు.
అప్పూ ఇంటికి కనకం..
అమ్మో మా అమ్మ అని కళ్యాణ్ చేతిలో ఉన్నది లాక్కుని వెళ్తుంది అప్పూ. ఎలా ఉన్నారని కృష్ణమూర్తి అడుగుతాడు. ఇద్దరం బాగానే ఉన్నామని అంటాడు కళ్యాణ్. మీరు మాట్లాడుతూ ఉండండి.. టిఫిన్ చేస్తానని అప్పూ అంటుంది. ఇంటి ఓనర్ ఇచ్చిన శనగలు తాళింపు పెట్టి ఇస్తుంది అప్పూ. కనకం, కృష్ణమూర్తిలు ఇద్దరూ తింటారు. ఆ తర్వాత కళ్యాణ్, అప్పూలను ఇంటికి రమ్మని అంటారు. కానీ అందుకు ఒప్పుకోరు. దీంతో ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తిలు వెళ్లిపోతారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.