Brahmamudi, August 27th Episode: రెచ్చిపోయిన రౌడీ బేబీ.. రాజ్‌ని వెళ్లగొట్టేందుకు రుద్రాణి స్కెచ్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రుద్రాణి, ధాన్య లక్ష్మి కలిసి అప్పూని అవమానించిన దంతా గుర్తుకు చేసుకుంటాడు రాజ్. కళ్యాణ్ ఇంటికి రావాలని కోరుకున్నాను. కానీ ఇంటికి వస్తే వాళ్లకు అవమానం జరగకుండా ఆపలేక పోయాను. ఎంత మందలించినా.. వాళ్లు ఎన్ని మాటలు అన్నారో. పాపం ఇంత అవమానం జరిగినందుకు ఎంత బాధ పడుతున్నారో అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కళ్యాణ్, అప్పూలు ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అప్పుడే ఒక అతను కావాలనే డాష్ ఇచ్చుకుంటూ..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రుద్రాణి, ధాన్య లక్ష్మి కలిసి అప్పూని అవమానించిన దంతా గుర్తుకు చేసుకుంటాడు రాజ్. కళ్యాణ్ ఇంటికి రావాలని కోరుకున్నాను. కానీ ఇంటికి వస్తే వాళ్లకు అవమానం జరగకుండా ఆపలేక పోయాను. ఎంత మందలించినా.. వాళ్లు ఎన్ని మాటలు అన్నారో. పాపం ఇంత అవమానం జరిగినందుకు ఎంత బాధ పడుతున్నారో అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కళ్యాణ్, అప్పూలు ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అప్పుడే ఒక అతను కావాలనే డాష్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. రేయ్ కళ్లు కనిపించడం లేదా? ఆగరా? అని అంటుంది. వాడే మూసుకున్నాడు నీకేమైందే? అని బైక్ నడిపిన వ్యక్తి అంటాడు. దీంతో కడుపులో ఒక్క గుద్దు ఇస్తుంది రౌడీ బేబీ. దీంతో అతను సారీ అని చెప్పి వెళ్తాడు.
కళ్యాణ్, అప్పూలపై రాజ్ ప్రేమ..
అదంతా చూసి కళ్యాణ్ నవ్వుతాడు. నువ్వేంటి కూచీ అలా చూస్తున్నావ్? అని అంటుంది అప్పూ. థాంక్స్ అని చెప్తాడు కళ్యాణ్.. ఎందుకు? అని అప్పూ అంటుంది. ఒక్క మాట కూడా పడని నువ్వు.. మా అమ్మ అంతలా అవమానించినా ఒక్క మాట కూడా మాట్లాడలేదని అంటాడు. ఏం చేయాలి మరి నీకు మాట ఇచ్చాను కదా.. మళ్లీ మీ అమ్మని అంటే నువ్వు బాధ పడతావ్ కదా.. అయినా ఇవాళ మీ అమ్మ కొత్తగా ఏం మంది.. చివరికి ఆ అనుమానం మనం నిజం చేశాము కదా అని అప్పూ అంటుంది. అప్పుడే రాజ్ కళ్యాణ్‌కి ఫోన్ చేస్తాడు. నువ్వు రానూ రానూ అంటున్నా ఇంటికి రప్పించడానికి చాలా ట్రై చేశాను. చివరికి వచ్చినా.. ఇక్కడున్న కాసేపు కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వ లేదు. ఇక్కడ జరిగిన దానికి నిజంగానే సారీ రా అని రాజ్ అంటాడు. దీంతో కళ్యాణ్ నవ్వుతూ.. ఇప్పుడే నేను మన వాళ్ల తరపున అప్పూకి సారీ చెప్తే ఏం అందో తెలుసా.. చాలు తీ నీ ఓవరాక్షన్.. మన తప్పులకు కూడా మనమే సారీ చెప్పుకుని.. పక్క వాళ్ల తప్పులకు కూడా మనమే చెప్పుకోవాలా? అని అంది. ఇలా జరుగుతుందనే అనుకున్నాను. అందుకే మేము రాను అన్నాను. నేనే ఏదో ఒకటి సాధించాకే అప్పుడే ఆ ఇంటికి వస్తానని కళ్యాణ్ అంటాడు.
రాజ్, కావ్యల సెటైర్లు..
అప్పుడే రాజ్ గదిలోకి కావ్య వచ్చి నిల్చుంటుంది. వీళ్ల ఇద్దరూ రాజ్ అన్న పాత మాటలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇక రాజ్ డ్రామా స్టార్ట్ చేస్తాడు. వచ్చావా.. రా.. ఇక మొదలు పెట్టు. ప్రగల్భాలు పలికాను కదా.. పుడింగిలా మాట్లాడాను కదా.. కళ్యాణ్, అప్పూలను ఇంటికి రప్పిస్తాను. వచ్చాక ఇక్కడి నుంచి వెళ్ల నివ్వను.. అందర్నీ కలిపేస్తాను. చించేస్తాను.. పొడిచేస్తానని అన్నాను కదా.. ఇక ఆడుకో.. అప్పుడే అన్నారు.. ఇప్పుడే అన్నారు.. తప్పు కుంటారా? మీరు ఓడిపోయారా.. నేను ఓడిపోయానా.. నేను చెప్పిందే జరిగింది.. మీ పిన్ని మారదు.. మీ అత్త నోరు ఆగదు.. ఇవేగా నువ్వు అనే మాటలు.. ఇప్పుడు నీకు అడ్డంగా దొరికిపోయాను కదా.. మ్యూజిక్ స్టార్ట్ చేయమని రాజ్ అంటాడు. నేనేమీ అనలేదు.. అన్నీ మీరే అనేసుకున్నారని కావ్య అంటుంది. పోనీలే.. ఇంత కాలానికి అయినా మీరు ఎంత ఫూలిష్‌గా ఆలోచిస్తున్నారో తెలుసుకున్నారని కావ్య అంటుంది. ఏంటే ఇన్ని మాటు అన్నా కూడా.. ఇంకా ఈ సెటైర్లు ఏంటని రాజ్ అంటాడు. అది కళావతి అంటే.. కొడుకును చూడగానే అన్నీ మర్చిపోయి.. మీ పిన్ని ఇంట్లోనే వాళ్లను ఉండనిస్తుందని అనుకుని పప్పులో కాలు వేశారు. మాకు ఎంతైనా మ్యాటర్ దొరుకుతుందని కావ్య అంటుంది.
ఈ ఇంటినే మార్చాలి..
ఇన్ని రోజులూ కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోయి తప్పు చేశాడు అనుకున్నా.. కానీ ఈ ఆడ మేళంతో వాడేం గెలుస్తాడు. మీద పడిపోతారని ఇప్పుడే తెలుసుకున్నాను. సమస్య వాడి దగ్గర లేదు. ఈ ఇంట్లోనే ఉంది. వీళ్లు మారితేనే వాడు ఇంటికి రావాలి అనుకుంటాడు. ఎలా ఇప్పుడు ఏం చేయాలని రాజ్ అంటే.. కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది. అప్పుటి వరకూ మనం ఓపికగా ఉండాలి. మీకంటూ ఒక జీవితం ఉంది. మిమ్మల్ని నమ్ముకుని ఒక జీవి బ్రతుకుతుందని కావ్య అంటుంది.
రాజ్‌ని బయటకు పంపించేందుకు రుద్రాణి స్కెచ్..
ఆ తర్వాత రుద్రాణి, రాహుల్‌లు కలిసి ఆనందంతో మందు కొడతారు. కళ్యాణ్, అప్పూలను బయటకు పంపించినందుకు ఆనందంగా ఉంటారు. ఇన్ని రోజులకు మనకు విజయం దక్కింది. ఆ ధాన్య లక్ష్మి పిచ్చిది కాకపోతే.. సొంత కొడుకునే ఇంట్లోకి రానివ్వకుండా చేసుకుందని అనుకుంటారు. ఇక ఆస్తి గురించి అస్సలు పట్టించుకోరు. కానీ రాజ్ ఆస్తి గురించి పట్టించుకుంటాడు కదా.. కళ్యాణ్ ఎప్పటి వస్తాడు.. వాడు ఎప్పుడు పట్టించుకుంటాడు. ఇలా రాజ్ పట్టించుకోకుండా ఉంటే కావ్య ఊరుకుంటుందా.. అలా రాజ్ ఉండాలంటే.. రాజ్‌ని కావ్య వదిలేయాలి. దీంతో పిచ్చి ఎక్కి ఇంట్లోంచి వెళ్లిపోవాలి. అప్పుడే ఆస్తి అంతా మన చేతుల్లోకి వస్తుందని ప్లాన్ వేస్తారు. ఇక అప్పుడే వచ్చి స్వప్న వీళ్లు మందు తాగడం చూసి.. నా చెల్లెలు ఇంటికి వస్తే అవమానించి పంపించేస్తారా.. చెప్తా మీ సంగతి అని ఓ ప్లాన్ వేస్తుంది.
రుద్రాణి, రాహుల్‌ని ఏడిపించిన స్వప్న..
రుద్రాణి గదిలో బెలూన్స్ అన్నీ ఏర్పాటు చేస్తుంది. వాళ్లు ఈ గదికి రాగానే గదిలో బెలూన్స్ చూసి షాక్ అవుతారు. ఏదో ఒక్క బెలూన్ అన్నా పగిలి.. ఇక రాత్రంతా నవ్వి నవ్వి చచ్చిపోతారని చెబుతూ నవ్వుకుంటుంది. రుద్రాణి వాళ్లు రావడంతో సైడ్ అవుతుంది. ఇక రుద్రాణి, రాహుల్‌లు గదికి వస్తారు. రాహుల్ ఓ బెలూన్ పగలకొట్టి హ్యాపీ బర్త్ డే అని అంటాడు. ఇక అందులో లాఫింగ్ గ్యాస్ రిలీజ్ అయ్యి.. నవ్వుతూనే ఉంటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.