AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, June 8th Episode: నిస్సహాయ స్థితిలో రాజ్, కావ్యలు.. ట్విస్ట్ ఇవ్వబోతున్న అపర్ణ..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. వెళ్లిపోతున్న మాయని ఆపుతాడు రాహుల్. రుద్రాణి కూడా కన్విన్స్ చేసి ఆపుతుంది. దీంతో చిత్ర భయంగానే పెళ్లికి సిద్ధం అవుతుంది. మరోవైపు రాజ్‌, మాయల పెళ్లికి సంబంధించి.. డెకరేషన్ కూడా చేస్తారు. ఈ క్రమంలోనే రాజ్ పెళ్లికి రెడీ అవుతాడు. మరోవైపు చిత్ర కూడా ఆనందంగా రెడీ అవుతుంది. అది చూసి రాజ్, కావ్యలు ఖంగు తింటారు. వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా..

Brahmamudi, June 8th Episode: నిస్సహాయ స్థితిలో రాజ్, కావ్యలు.. ట్విస్ట్ ఇవ్వబోతున్న అపర్ణ..
Brahmamudi
Chinni Enni
|

Updated on: Jun 08, 2024 | 1:10 PM

Share

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. వెళ్లిపోతున్న మాయని ఆపుతాడు రాహుల్. రుద్రాణి కూడా కన్విన్స్ చేసి ఆపుతుంది. దీంతో చిత్ర భయంగానే పెళ్లికి సిద్ధం అవుతుంది. మరోవైపు రాజ్‌, మాయల పెళ్లికి సంబంధించి.. డెకరేషన్ కూడా చేస్తారు. ఈ క్రమంలోనే రాజ్ పెళ్లికి రెడీ అవుతాడు. మరోవైపు చిత్ర కూడా ఆనందంగా రెడీ అవుతుంది. అది చూసి రాజ్, కావ్యలు ఖంగు తింటారు. వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా.. కావ్యని ఇంట్లోంచి పంపించడానికి రుద్రాణి, రాహుల్‌లు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. కేవలం రుద్రాణి, రాహుల్‌, ధాన్య లక్ష్మి, అనామికలు తప్ప ఇంట్లోని మిగతా వారందరూ మాత్రం చాలా బాధ పడుతూ ఉంటారు. ఇక స్వప్న అయితే ఎలా ఈ పెళ్లి ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

కావ్యని సహాయం అడిగిన రాజ్..

మరోవైపు అప్పూ ఆస్పత్రిలో మాయ దగ్గర ఉంటుంది. మాయకు మెలకువ వచ్చిందా లేదా అని కావ్య అడగుతుంది. ఇంకా రాలేదు అక్కా.. రాగానే నీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్తుంది అప్పూ. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ దేవుడే నాకు హెల్ప్ చేయాలని కావ్య బాధ పడుతుంది. రాజ్ రెడీ అవుతూ ఉండగా.. నేను ఇప్పటి వరకూ ఎవర్నీ హెల్ప్ అడగ లేదు. నా జీవితానికి సంబంధించిన నిర్ణయం నేను మాత్రమే తీసుకునేవాడిని. ఈసారి మాత్రం నేను ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. నువ్వు తప్ప నన్ను గట్టెక్కించే పరిస్థితిలో ఎవరూ లేరు.. నువ్వే కాపాడాలని రాజ్ అడుగుతాడు.

ఇవి కూడా చదవండి

పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్న అపర్ణ..

మీరు ఏమీ టెన్షన్ పడకుండా.. ప్రశాంతంగా ఉండండి. ఎవరికీ ఏ అనుమానం రాకుండా మామూలుగా ఉండటానికి ప్రయత్నించండి. మిగతాది నేను చూసుకుంటాను అని కావ్య మాట ఇస్తుంది. దీంతో ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది? రాజ్, మాయల పెళ్లి జరగకుండా ఎవరు కాపాడతారు? ఎలాంటి ట్విస్టులు నెలకొంటాయో చూడాలి. మొత్తం మీద బ్రహ్మముడి సీరియల్ ట్విస్టుల మధ్య కొనసాగుతుంది. ఈ పెళ్లి ఎలాగైనా జరిపించేందుకు రుద్రాణి, రాహుల్‌లు ఏం చేస్తారో కూడా చూడాలి. సీరియల్ ప్రకారం.. పెళ్లి జరిగే సమయంలో అపర్ణ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. అపర్ణకు నిజం తెలిసినా.. తెలీనట్టు నాటకడం ఆడుతుందని.. చివరిలో కావ్య జీవితం కాపాడబోతుందని తెలుస్తుంది. సుభాష్ ఏం చేస్తాడో కూడా తెలుసుకోవాలి.