Brahmamudi, April 10th episode: వెన్నెలను రప్పించేందుకు శ్వేత, కావ్యల మాస్టర్ ప్లాన్..

ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో కిచెన్‌లో స్వప్న, అనామికలు కలిసి క్యారేజ్‌లు పెడుతూ ఉంటారు. అప్పుడే అటుగా వచ్చిన కావ్య.. ఏంటక్కా ఆ క్యారేజ్.. ఎవరికి? అని అడుగుతుంది. ఇది రాహుల్‌కి అని అంటుంది స్వప్న. ఇదేమో కళ్యాణ్‌కి అని అనామిక చెప్తుంది. మిగిలింది అన్నదానానికా? మిగిలింది అన్నదానానికా? అని కావ్య అడుగుతుంది. జనరల్ మేనేజర్ భార్యే అంత పెద్ద క్యారేజ్ తీసుకెళ్తే.. ఎండీ భార్యను నేనెంత క్యారేజ్ తీసుకెళ్లాలి? అని అనామిక అంటుంది. ఎంత పెద్ద క్యారేజులు..

Brahmamudi, April 10th episode: వెన్నెలను రప్పించేందుకు శ్వేత, కావ్యల మాస్టర్ ప్లాన్..
Brahmamudi
Follow us

|

Updated on: Apr 10, 2024 | 12:36 PM

ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో కిచెన్‌లో స్వప్న, అనామికలు కలిసి క్యారేజ్‌లు పెడుతూ ఉంటారు. అప్పుడే అటుగా వచ్చిన కావ్య.. ఏంటక్కా ఆ క్యారేజ్.. ఎవరికి? అని అడుగుతుంది. ఇది రాహుల్‌కి అని అంటుంది స్వప్న. ఇదేమో కళ్యాణ్‌కి అని అనామిక చెప్తుంది. మిగిలింది అన్నదానానికా? మిగిలింది అన్నదానానికా? అని కావ్య అడుగుతుంది. జనరల్ మేనేజర్ భార్యే అంత పెద్ద క్యారేజ్ తీసుకెళ్తే.. ఎండీ భార్యను నేనెంత క్యారేజ్ తీసుకెళ్లాలి? అని అనామిక అంటుంది. ఎంత పెద్ద క్యారేజులు తీసుకెళ్తే.. తినేది ఒక్కరే కదా.. అయినా నువ్వు కూడా ఏంటక్కా అని కావ్య అడుగుతుంది. ఆ ముక్క నాతో పోటీ మరీ బాక్సుల్లో కుక్కేసిన ఆ అనామికతో చెప్పు అంటుంది. సరే సరేలే లంచ్ టైమ్ అయింది. వాళ్లు బయట నుంచి తెప్పించుకుని తినేలోపే మీరు వెళ్లండి అని కావ్య చెప్తే.. ఇక ఇద్దరూ ఆఫీస్‌కి బయలు దేరతారు. అప్పుడే రుద్రాణి పై నుంచి వచ్చి క్యారేజీలు తీసుకెళ్లడం చూస్తుంది. అక్కడే ఉన్న కావ్య దగ్గరకు వెళ్లి..

రుద్రాణికి కావ్య చురకలు.. రాహుల్‌కి శ్రుతి కౌంటర్స్..

అయ్యో ఏంటి అంతా తీసుకెళ్లిపోయారా? ఇప్పుడు నువ్వు మళ్లీ వంట చేయాలా? ఏంటో నీకు ఈ కర్మా అని రుద్రాణి అంటుంది. పై నుంచి అప్పుడే రాజ్ వస్తాడు. కావాలనే వెటకారంగా.. కావ్యకు చురకలు వేస్తుంది. అదే విధంగా రుద్రాణికి కూడా కౌంటర్ ఇస్తుంది కావ్య. ఆ తర్వాత శ్రుతి.. రాహుల్ క్యాబిన్‌లోకి వస్తుంది. రాహుల్‌కి ఫైల్ ఇస్తుంది. ఏంటి ఇందులో అన్నీ మిస్టేక్స్ ఉన్నాయి అని రాహుల్ అంటే.. ఎక్కడ సర్.. అని శ్రుతి అంటుంది. కమ్ దిస్ సైడ్.. అని పిలిచి.. పర్ఫ్యూమ్ పేరేంటో అని అడుగుతాడు. మనం పర్ఫ్యూమ్స్ అమ్మము సర్ అని చెబుతుంది. నేను అడిగింది మనం అమ్మే నగల గురించి కాదు.. నీ ఒంటికి ఉన్న పర్ఫ్యూమ్ గురించి అని చెప్తాడు రాహుల్. మీకెందుకు సర్? అని శ్రుతి అంటే.. మా ఆవిడకు కొని ఇద్దామని రాహుల్ చెప్తాడు. వద్దు సర్.. మీలానే మేడమ్‌ని కూడా పర్ఫ్యూమ్ పేరు అడుగుతారు. మీరు ఫైల్ చూస్తూ ఉండండి.. నేను క్లయింట్‌కి మెయిల్ చేయాలి అని చెప్పి శ్రుతి వెళ్లిపోతుంది. వారం తిరిగేసరికి నువ్వే నా ఒళ్లో వచ్చి వాలిపోయేలా చేసుకుంటాను అని రాహుల్ అనుకుంటాడు.

మొగుళ్ల గురించి పెళ్లాల ఆరాలు..

సరిగ్గా అప్పుడే స్వప్న, అనామికలు ఆఫీస్‌కి క్యారేజ్ పట్టుకుని వస్తారు. వాళ్లను చూసిన శ్రుతి గుడ్ మార్నింగ్ మేడమ్ అని స్వప్నతో అంటుంది. తను మేనేజర్ భార్య.. నేను ఎండీ భార్యను అని అనామిక అంటే.. ఫేస్ వాల్యూ అనామిక.. కొంత మంది రిచ్‌గా బట్టలు వేసుకున్నా అలానే ఉంటారు అని అంటుంది స్వప్న. బాబయ్.. వీళ్లు కిచెన్ గొడవలను ఆఫీస్‌ వరకూ తీసుకొచ్చారు. నెక్ట్స్ రోడ్డు ఎక్కుతారేమో.. అని శ్రుతి అనుకుంటుంటే.. వాట్ అని అనామిక అడుగుతుంది. ఏమీ లేదు మేడమ్ గుడ్ మార్నింగ్ అని శ్రుతి కవర్ చేస్తుంది. అది తర్వాత మా ఆయన వర్క్ ఎలా చేస్తున్నాడు? కవితలు చెప్తున్నారా? ఎండీలా వర్క్ చేస్తున్నాడా అని అడుగుతుంది. అయ్యో లేదు మేడమ్ చాలా స్ట్రిక్ట్‌గా వర్క్ చేస్తున్నారు అని చెప్తుంది. ఆ తర్వాత మా ఆయన సంగతి ఏంటి? నిన్నేమన్నా గోకాడా అని స్వప్న అడిగితే.. మీకెలా తెలుసు మేడమ్? అని శ్రుతి అమాయకంగా అడుగుతుంది. నా మొగుడు గురించి నాకే బాగా తెలుసులే. ముందు ఏం చేశాడో చెప్పు అని స్వప్న అడుగుతుంది. ఏం చేయాలో అడగండి మేడమ్. కాళ్లకు పెట్టుకున్న నెయిల్ పాలిష్ నుంచి జుట్టు కలర్ వరకు అన్నీ అడిగారు అని శ్రుతి చెప్తుంది. అనుకున్నా రాహుల్ బుద్ధే అంత అని స్వప్న అంటుంది.

ఇవి కూడా చదవండి

అనామికను గాడిదతో పోల్చిన కళ్యాణ్..

ఈ సీన్ కట్ చేస్తే.. అనామిక కళ్యాణ్ దగ్గరకు వెళ్లి సెకిలిస్తుంది. అనామికను చూసిన కళ్యాణ్.. నువ్వా సెకిలిస్తూ ఉంటే.. మన ఆఫీస్‌కి గుర్రం ఎప్పుడు వచ్చిందా? అని అనుకున్నా అంటాడు. ఎందుకంత చిరాకు కాస్త ప్రేమగా మాట్లాడొచ్చు కదా అని అనామిక అంటుంది. లైఫ్‌లో అన్నీ దొరకవు అనామికా అని కళ్యాణ్ అంటాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావ్? నీ కోసం కష్ట పడి వంట చేసుకొస్తే అని అంటుంది అనామిక.. ఏంటి కష్ట పడ్డాను అని అంటున్నావ్.. షాపులో కొన్నావ్? ఇంట్లో వండావ్. నేనేమీ వ్యవసాయం చేయడం లేదు. కష్ట పడి పని చేస్తున్నా అని చెప్పడానికి అని కళ్యాణ్ అంటే.. ఇప్పుడు తింటావా తినవా అని అనామిక అడుగుతుంది. నాకు ఇప్పుడు మూడ్ లేదని కళ్యాణ్ చెప్తాడు. దీంతో అనామిక కోపంగా వెళ్లిపోతుంది.

వెన్నెల కోసం కావ్య వేట..

ఆ తర్వాత కావ్య కంగారుగా ఎవరూ చూడకుండా.. బయటకు వెళ్తుంది. అప్పుడే ఇందిరా దేవి వచ్చి ఎక్కడికి అమ్మా వెళ్లున్నావ్ అని అడుగుతుంది. శ్వేత దగ్గరకు వెళ్తున్నా.. తనకు వెన్నెల ఎవరో తెలుసు అని చెప్తుంది. మరి రాజ్‌కి చెప్పావా అని ఇందిరా దేవి అడిగితే.. తెలీదు మీరు కూడా చెప్పండి. ఆయనకు తెలిస్తే.. జాగ్రత్త పడతారు కదా అందుకే అని అంటుంది. సరే నేను వెళ్తున్నా అని కావ్య వెళ్తుంది. నెక్ట్స్.. స్వప్న బయట ఉంటే.. రాహుల్ వచ్చి ఏంటి నా కోసం క్యారేజ్ తీసుకొచ్చావా అని అడుగుతాడు. తెచ్చాను కానీ.. తప్పని మళ్లీ తెలుసుకున్నా. వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు. అప్పుడే ఆడవాళ్ల వెంట పడటం మొదలు పెట్టావా? అని స్వప్న అంటుంది. నన్ను అలా తక్కువ చేసి మాట్లాడకు.. అని రాహుల్ అంటాడు. అప్పుడే అనామిక వచ్చి.. పోనీలే వదిలెయ్ స్వప్న.. పాపం ఎప్పటి నుంచో ఉన్న అలవాటు కదా.. ఇప్పుడు ఎలా మార్చుకుంటాడని అనామిక అంటుంది. దీంతో రాహుల్ కోపంగా వెళ్లిపోతాడు.

రాబంధుల్లా మారిన రుద్రాణి, ధాన్య లక్ష్మిలు..

ఈ సీన్ కట్ చేస్తే.. రాజ్ బయట పిల్లాడిని ఆడిస్తూ ఉంటాడు. రాజ్‌ని చూసిన రుద్రాణి.. రాజ్‌లో చాలా మార్పులు వచ్చాయి కదా.. ఇంతకు ముందు ఒకప్పుడు అన్నీ టైమ్‌కి అవ్వాలి అని అనేవాడు. కానీ ఇప్పుడు ఇలా ఐపోయాడు అని చెప్తుంది. చేసిన తప్పు అలాంటిది మరి అని ధాన్య లక్ష్మి అంటుంది. అప్పుడే అపర్ణ గదిలో నుంచి బయటకు వస్తుంది. అపర్ణను గమనించి రుద్రాణి.. మరిన్ని పుల్లలు పెడుతుంది. ఏంటో మరి విచిత్రం.. అక్కడ రాజ్‌ని.. ఇక్కడ వదినని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. అక్కా బాబుకు నామ కరణం చేశారో లేదో కనుక్కున్నావా? మరి బారసాల, అన్నప్రాసన చేశారో లేదో కనుక్కుంటే మంచిది కదా.. ఎంత కాదన్నా రాజ్ కొడుకే కదా అని ధాన్య లక్ష్మి అంటే.. మరి వాడి తల్లి ఏమైంది అంటావ్? వాడి తల్లి వచ్చి ఇవన్నీ ఎందుకు చేశారు? అని నిలదీస్తే ఏం చేస్తావ్ అని రుద్రాణి అడుగుతుంది. అవునులే ఆమె ఎలాంటిదో ఎలా ఉంటుందో అని ధాన్యం అంటుంది. అవునూ ఇప్పుడు ఆమె వస్తే.. కావ్య పరిస్థితి ఏంటో.. రుద్రాణి అడిగితే.. ఏముంది నచ్చితే కలిసి ఉంటారు. లేదంటే విడిపోతారు అని ధాన్య లక్ష్మి అంటుంది. ఇవన్నీ పక్కకు పెడితే.. చీటింగ్ కేస్ కింద రాజ్‌ని అరెస్ట్ చేస్తారేమో అని రుద్రాణి అంటుంది. చాలు ఆపండి.. మీరు బంధువులా? రాబంధులా? బ్రతికి ఉండగానే పీక్కు తింటున్నారు. ఇక ఇద్దరికీ క్లాస్ పీకుతుంది అపర్ణ.

వెన్నెల కోసం.. శ్వేత, కావ్యల మాస్టర్ ప్లాన్..

ఆ తర్వాత శ్వేత, కావ్యలు కలుస్తారు. రాజ్ ఇలా చేస్తాడని అనుకోలేదని శ్వేత అంటుంది. శ్వేత నీకు వెన్నెల తెలుసా? అని కావ్య అడిగితే.. తెలుసు. అప్పట్లో తను మా క్లేసే. రాజ్ అంటే చాలా ఇష్ట పడేది. వెన్నెల ఫ్యామిలి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉండేది. అది తెలుసుకున్న రాజ్ వాళ్ల తాతయ్యతో మాట్లాడి ఆ సమస్యలు అన్నీ తీర్చాడు. అప్పటి నుంచి వెన్నెల, రాజ్ బాగా క్లోజ్ అయ్యారు. మూడు నెలల తర్వాత వెన్నెలే కనిపించకుండా పోయింది. మేము తన గురించి తెలుసుకోవడానికి బాగా ట్రై చేశామని శ్వేత అంటుంది. హా.. శ్వేతా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అంతా రీయూనియన్ అని చెప్పు. అలాగే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టు అది చూసి అయినా.. తను రియాక్ట్ అవ్వొచ్చు కదా.. అలాగే ఈ విషయం మా ఆయనకు తెలీకూడదని చెప్తుంది కావ్య. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Articles
'ఈ సీజన్‌లో ముంబై కథ ముగిసింది.. అతనే ఈ వరుస ఓటములకు కారణం'
'ఈ సీజన్‌లో ముంబై కథ ముగిసింది.. అతనే ఈ వరుస ఓటములకు కారణం'
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..!
కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..!
చక్రవర్తిలా పాలిస్తుంది ఎవరో తెలుసు: ప్రియాంక గాంధీ
చక్రవర్తిలా పాలిస్తుంది ఎవరో తెలుసు: ప్రియాంక గాంధీ
నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్..
నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్..
ఒక పార్టీ.. ఒకే రోజు.. రెండు దీక్షలు.. అటు మోత్కుపల్లి.. ఇటు
ఒక పార్టీ.. ఒకే రోజు.. రెండు దీక్షలు.. అటు మోత్కుపల్లి.. ఇటు
కలలో గుడ్లు కనిపించాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
కలలో గుడ్లు కనిపించాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ఓటీటీలోకి వచ్చేస్తున్నపొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్..
ఓటీటీలోకి వచ్చేస్తున్నపొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్..
ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్