Brahmamudi, April 11th episode: కావ్యను అవమానించిన అపర్ణ.. లెక్కలు తేలాల్సిందేనన్న కళావతి..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. వెన్నెలను బయటకు తీసుకొచ్చేందుకు శ్వేత, కావ్యలు కలిసి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత కావ్యకు సారీ చెప్తుంది శ్వేత. తప్పు చేసేదానివే అయితే.. నువ్వు ఈ సహాయం చేయవు కదా శ్వేత అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ చేసిన దానికి సుభాష్ ఆలోచిస్తూ, బాధ పడుతూ ఉంటాడు. అప్పుడే అపర్ణ వచ్చి నాకు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. బయట వాళ్లు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇంట్లో వాళ్లే మాటలతో నరకం చూపిస్తున్నారు. సహాయం చేయకపోయినా..

Brahmamudi, April 11th episode: కావ్యను అవమానించిన అపర్ణ.. లెక్కలు తేలాల్సిందేనన్న కళావతి..
Brahmamudi
Follow us

|

Updated on: Apr 11, 2024 | 12:22 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. వెన్నెలను బయటకు తీసుకొచ్చేందుకు శ్వేత, కావ్యలు కలిసి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత కావ్యకు సారీ చెప్తుంది శ్వేత. తప్పు చేసేదానివే అయితే.. నువ్వు ఈ సహాయం చేయవు కదా శ్వేత అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ చేసిన దానికి సుభాష్ ఆలోచిస్తూ, బాధ పడుతూ ఉంటాడు. అప్పుడే అపర్ణ వచ్చి నాకు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. బయట వాళ్లు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇంట్లో వాళ్లే మాటలతో నరకం చూపిస్తున్నారు. సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ.. ఎగతాళి చేయకపోతే చాలు. కానీ వాళ్లకు అవకాశం దొరికిందని అపర్ణ అంటుంది. అవును నాకు కూడా అలానే ఉంది. అందరూ పెద్దవాళ్లం అయిపోయాము అని ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటుంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదు.

బాధలో సుభాష్, అపర్ణలు..

చెప్తే రాజ వినడం లేదు.. వీళ్లను ఆపితే వీళ్లు ఆగడం లేదని సుభాష్ బాధగా అంటాడు. అలాఅని మీలాగే నేను ఊరుకోను. వాడు ఇలా ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతాడో చూస్తాను. ఏదో ఒకటి నేనే చేస్తాను అని అపర్ణ వెళ్లి పోతుంది. అప్పుడే రాజ్ పిల్లాడిని తీసుకుని పైకి వెళ్లిపోతాడు. రాజ్ ని చూసి ఆగిన అపర్ణ.. నా స్థానం పడిపోయింది. నా స్థాయి కూడా పడిపోయింది. నేను ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలో నువ్వే చెప్పు అని అపర్ణ అంటే.. నువ్వు క్షమించలేని వారిని మర్చిపోవాలి. మర్చిపోలేని వాళ్లను క్షమించాలి అని రాజ్ చెప్పి వెళ్లిపోతాడు.

కావ్యపై విరుచుకు పడిన అపర్ణ..

ఈ సీన్ కట్ చేస్తే కావ్య ఇంటకి వస్తుంది. బయట పెద్దావిడ వెయిట్ చేస్తూ ఉంటుంది. కావ్యను చూడగానే.. ఏంటి వెన్నెల దొరికిందా? అని అడుగుతుంది. లేదు అమ్మమ్మా శ్వేతకు కూడా తెలీదని కావ్య చెప్తుంది. అదేంటో తేలే వరకు.. ఈ ఇంట్లో ఓపికగా ఉండేవాళ్లు ఎవరూ కనిపించడం లేదు. ఎక్కడ గొడవలు పెరిగిపోతాయోమోనని నాకు టెన్షన్ గా ఉంది. అపర్ణను రుద్రాణి, ధాన్య లక్ష్మి కుదురుగా ఉండనివ్వడం లేదు. రాజ్ విషయంలో సమాధానం చెప్పలేక సతమతమైపోతుందని చెప్తుంది. సరే అమ్మమ్మ.. నేను వెళ్లి అత్తయ్యకు కాఫీ ఇస్తాను అని వెళ్లి.. ట్యాబ్లెట్ ఇస్తుంది కావ్య. తలనొప్పి ట్యాబ్లెట్ కి తగ్గిపోతుంది. కానీ ఈ ఇంటికి పట్టిన అరిష్టం ఎప్పుడు పోతుంది? ఎలా పోతుంది? అని గట్టిగా అరుస్తుంది. పైన ఉన్న రాజ్ కూడా అంతా వింటాడు. ఆ నష్టాన్ని ఎలా ఎప్పుడు పూడ్చాలి? అసలు ఈ గొడవలన్నీ నీ వల్లే మొదలయ్యాయి. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వంటే ఇష్టం లేక.. నీ మీద మనసు లేక నా కొడుకు పక్కదారి పట్టి ఉంటాడు. వాడి వ్యక్తిత్వం దిగజారి పోయింది. వీటన్నింటికీ మూల కారణం నువ్వు. నా కొడుకు వల్ల నీకు అన్యాయం జరిగి ఉంటే ఇంకా ఎందుకు ఈ చూరి పట్టుకుని వేలాడుతున్నావ్? నీ పుట్టింటికి గతిలేకా? అని కావ్యపై రెచ్చిపోతుంది అపర్ణ.

ఇవి కూడా చదవండి

అపర్ణకు గట్టి వార్నింగ్ ఇచ్చిన పెద్దావిడ..

అందంతా విన్న పెద్దావిడ.. అపర్ణా అని గట్టిగా అరుస్తుంది. ఎంత మాట అన్నావ్? నష్ట జాతకురాలా? ఈ ఐశ్వర్యం కోసం ఇక్కడే పడి ఉంటుందా? పుట్టింటికి గతి లేదని వెళ్లడం లేదా? అది అరిష్టం కాదు.. అయిష్టం. సౌభాగ్యం కోసమే ఇక్కడ ఉంది. ఎవరు ఇచ్చారు నీకు ఈ అధికారం. నీ వివేకం, పెద్దరికం ఎక్కడికి వెళ్లిపోయాయి? ఏం తప్పు చేసింది కావ్య.. ఒక్కటి చెప్పు. నీ తోటి కోడల్ని, ఆడపడుచుని, నీ కొడుకుని ఏమీ అనలేక.. నీ కోడల్ని పట్టుకుని అన్నన్ని మాటలు అంటావా? ఇది అమానుషం అపర్ణ అని కోడలికి గట్టి వార్నింగ్ ఇస్తుంది పెద్దావిడ.

ధాన్య లక్ష్మి, రుద్రాణిలకు షాక్ ఇచ్చిన కోడళ్లు..

ఆ తర్వాత కళ్యాణ్, రాహుల్‌లు ఆఫీస్‌కి వెళ్లడంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాణి, ధాన్య లక్ష్మిలు. అప్పుడే స్వప్న, అనామికలు వస్తారు. ఏమైందని అడుగుతారు. నేను తీసుకెళ్లింది తినడానికి ఇష్టం లేదని అనామిక చెప్తే.. మీ అబ్బాయి.. వెళ్లి రోజే అమ్మాయిల అందాల్ని తినేస్తూ బతికేస్తున్నాడు. ఆఫీస్‌లో పని చేసే అమ్మాయిల బాడీ స్ప్రేలు, నెయిల్ పాలిష్‌ల గురించి ఎంక్వైరీలు చేస్తున్నాడు. అందుకే గడ్డి పెట్టి వచ్చాను అని స్వప్న అంటుంది. ఎలాంటి వాళ్లను కన్నారు తల్లుల్లారా? వాళ్లను చేసుకున్నందుకు మా జన్మ ధన్యం అయిపోయిందని అనామిక అంటుంది.

నేను ఒక్కసారి వెళ్తే.. మళ్లీ ఈ ఇంటి గడప తొక్కను..

ఆ తర్వాత కావ్య గదిలోకి వస్తుంది. కళావతి గురించి ఆలోచిస్తూ ఉన్న రాజ్.. ఒక్క మాట చెప్తాను వింటావా అని అడుగుతాడు. పర్లేదు చెప్పండి అని కావ్య అంటుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండొద్దు. నీ పుట్టింటికి వెళ్లిపో. వెంటనే వెళ్లిపో. నేను మంచివాడిని కాదు. నిన్ను నేను ఎప్పుడూ భార్యగా చూడలేదు. ఏముంది? ఇక్కడ. ఏమీ మిగల్లేదు.. నీ జీవితం నీది.. సుఖం లేదు.. సంతోషం లేదు. మా అమ్మ నిన్ను ఎంత అవమానించిందో అంతా విన్నాను. అందరూ నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. సర్దుకు పోవడం అన్ని సార్లూ మంచిది కాదు. అందుకే ఏమీ లేని చోట.. నువ్వు ఎందుకు వెళ్లిపో అని రాజ్ అంటాడు. సరే అయితే వెళ్లి పోతాను అని కావ్య అంటుంది. దానికి రాజ్ షాక్ అవుతాడు. ఏంటి అలా చూస్తున్నారు. ఇంత సులువుగా ఒప్పుకుందేంటి? అనా? నా లెక్కలు నాకున్నాయి. అవి తేల్చుకుని వెళ్తాను. నేను గడప దాటడం అంటూ జరిగితే జీవితంలో మళ్లీ ఈ ఇంటి గడప తొక్కను అని కావ్య చెప్తుంది.

కళ్యాణ్‌ని ఎప్పుడు మన ఇంటికి తీసుకొస్తావ్?

మరోవైపు కళ్యాణ్‌ని ముగ్గులోకి దించేందుకు అనామిక సింగారించుకుంటుంది. నా దారిలోకి తెచ్చుకుంటా అని అనుకుంటుంది. అప్పుడే అనామిక అమ్మ శైలు ఫోన్ చేస్తుంది. ఈ అమ్మ ఉందనుకున్నావా.. పోయింది అనుకున్నావా అని అడుగుతుంది. ఏమైందని అనామిక అడుగుతుంది. మీ నాన్నకు ప్రాబ్లమ్స్ ఎక్కువై పోయాయి. అప్పుల వాళ్లు ఇంటికి రావడం కూడా మొదలు పెట్టారు. నీభర్తను ఆ కుటుంబం నుంచి వేరు చేసి.. ఇక్కడికి ఎప్పుడు తీసుకొస్తావ్ అని అడుగుతుంది. ఇదేమన్నా చిన్న పిల్లల ఆట అనుకున్నావా? కళ్యాణ్ ఇప్పుడే ఆఫీస్ బాధ్యతలు స్వీకరించారు. కళ్యాణ్ కు అనుమానం వచ్చిందంటే జీవితంలో నన్ను నమ్మడు అని అనామిక అంటే.. ఇక్కడ టెన్షన్స్ ఎక్కువై పోయాయి. అది గుర్తు పెట్టుకుని చేయ్ అని చెబుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Articles