Brahmamudi, April 12th episode: అనామికను దూరం పెట్టిన కళ్యాణ్.. ఇంటి పరువు కాపాడిన కావ్య!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ కోసం అనామిక అందంగా రెడీ అవుతుంది. అందంగా రెడీ అయిన అనామికను చూసి.. బయటకు వెళ్తున్నావా అని కళ్యాణ్ అడిగితే.. భార్య భర్త కోసం కూడా రెడీ అవుతుందని కళ్యాణ్‌కి క్లోజ్‌గా ఉంటుంది. ఇన్ని రోజులూ నిన్న దూరం పెట్టింది చాలు అని అనామిక అంటుంది. ఎందుకు? ఇన్నాళ్లు ఈ దూరానికి, ఈ మార్పుకు కారణం ఏంటి? నువ్వు ఇష్ట పడేది నన్ను కాదు. నీకు కావాల్సింది నా స్థానం. గొప్ప బిజినెస్ మ్యాన్..

Brahmamudi, April 12th episode: అనామికను దూరం పెట్టిన కళ్యాణ్.. ఇంటి పరువు కాపాడిన కావ్య!
Brahmamudi
Follow us

|

Updated on: Apr 12, 2024 | 11:56 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ కోసం అనామిక అందంగా రెడీ అవుతుంది. అందంగా రెడీ అయిన అనామికను చూసి.. బయటకు వెళ్తున్నావా అని కళ్యాణ్ అడిగితే.. భార్య భర్త కోసం కూడా రెడీ అవుతుందని కళ్యాణ్‌కి క్లోజ్‌గా ఉంటుంది. ఇన్ని రోజులూ నిన్న దూరం పెట్టింది చాలు అని అనామిక అంటుంది. ఎందుకు? ఇన్నాళ్లు ఈ దూరానికి, ఈ మార్పుకు కారణం ఏంటి? నువ్వు ఇష్ట పడేది నన్ను కాదు. నీకు కావాల్సింది నా స్థానం. గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలి. కవిత్వం రాసుకునే ఈ కవి అవసరం లేదు. నేను ఇవాళ కంపెనీ బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి నువ్వు దిగి వచ్చావ్. అంతే కదా.. కానీ నా మనసు కోరుకునేది ఈ అనామికను కాదు. నేను కోరుకునేది ఆనాటి ఆ అనామికను అని అంటాడు. నువ్వు అంతట నువ్వు వచ్చిన రోజే నేను సంతోషంగా ఉంటాను అన్నాను. కానీ ఇప్పుడు నా అంతట రోజే రావాలని పించిన రోజే వస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు కళ్యాణ్. దీంతో పూలు విసిరేసి.. నిన్ను నా దారికి తెచ్చుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్తాను అని అనామిన అంటుంది.

రాహుల్‌కి గడ్డి పెట్టిన రుద్రాణి..

ఈ సీన్ కట్ చేస్తే.. మంచమంతా చీరలు వేసి మడత పెడుతుంది స్వప్న. అప్పుడే వచ్చిన రాహుల్ నేను వచ్చాను అని అంటాడు. సో వాట్ అని స్వప్న అంటుంది. అలసిపోయి వచ్చాను అని రాహుల్ అంటే.. లిప్ స్టిక్ రుద్దీ రుద్దీ.. పర్ఫ్యూమ్ కొట్టీ కొట్టీ వచ్చావా అని స్వప్న సీరియస్ అవుతుంది. ఆఫీస్ నుంచి అలసి పోయి వస్తే.. ప్రేమగా కాఫీనో మంచినీళ్లో తీసుకొచ్చి ఇవ్వాలి. ఇలా ఏ ఆడదీ ప్రవర్తించదని రాహుల్ అంటాడు. ఆఫీస్‌కి వెళ్లిన మొగుడు.. పక్క సీట్లో ఉన్న అమ్మాయిల జోలికి వెళ్ల కూడదని గడ్డి పెడుతుంది స్వప్న. ఈ తర్వాత రుద్రాణి దగ్గరకు వెళ్తాడు రాహుల్. అమ్మా అదెలా మాట్లాడుతుందో తెలుసా? ఆఫీస్‌కి వెళ్లి నేను అలిసి పోయి వస్తే.. ఆ స్వప్న తిట్టిందని రాహుల్ చెబుతుండగా.. ఏం చేశావురా ఆఫీస్‌కి వెళ్లి? ఆఫీస్‌లో అడుగు పెట్టి కళ్యాణ్‌ని తప్పించి ఎండీ అవ్వరా అని పంపిస్తే.. లిప్ స్టిక్‌లు, బాడీ స్ప్రేల గురించి ఎంక్వైరీ చేసి పరువు తీసావు. ఎప్పటికైనా నేను ఎండీ అయ్యి.. దాన్ని మెడ పెట్టి బయటకు పంపించేస్తా అని రాహుల్ అంటే.. దాని దగ్గర ఉన్న ఆస్తిని తిని కూర్చుంటుందని రుద్రాణి చెబుతుంది. స్వప్న దగ్గర ఉన్న ఆస్తిని ఎలాగైనా లాక్కోవాలని తల్లీ కొడుకులు ప్లాన్ చేస్తారు.

రాజ్‌కు టార్చర్ చూపించిన శ్వేత అండ్ ఫ్రెండ్స్..

ఆ తర్వాత రాజ్‌కి శ్వేత కాల్ చేస్తుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన రాజ్.. హలో ఎవరు అని అడుగుతారు. ఏంటి నా పేరు కూడా మర్చిపోయావా అని శ్వేత అడుగుతుంది. హో నువ్వా చెప్పు అని రాజ్ అంటాడు. అప్పుడే కావ్య వచ్చి.. గుమ్మం బయట ఉంటుంది. మన అందరి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా.. అందరం కలిసి రీ యూనియన్ ప్లాన్ చేశాం. అందరం కలిస్తే సరదాగా ఉంటుంది కదా అని శ్వేత అంటుంది. నాకు కుదరదు.. నేను రాను అని చెప్పి రాజ్ ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే కావ్యకు కాల్ చేస్తుంది శ్వేత. వాడు రానంటున్నాడని చెబుతుంది. అయితే మీ బ్యాచ్ అందరికీ ఫోన్ చేసి.. ఆయన నెంబర్ ఇచ్చి ఫోన్ చేయించు అని కావ్య చెప్తుంది. దీంతో ఒకరి తర్వాత మరొకరు రాజ్‌కి ఫోన్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా రీ యూనియన్‌కి రావాలని ఒప్పిస్తారు. అలాగే వచ్చేటప్పుడు మీ భార్యను కూడా తీసుకురమ్మని చెప్తారు.

ఇవి కూడా చదవండి

ఇంటి పరువు తీయ్యాలనుకున్న రుద్రాణి.. గడ్డి పెట్టిన పెద్దావిడ..

నెక్ట్స్ దుగ్గిరాల ఇంట్లోని వాళ్లందరూ హాలులోనే కూర్చుంటారు. అప్పుడే అపర్ణా అని ఒకరు వస్తారు. అరే శకుంతలా రా అని అపర్ణ పిలుస్తుంది. శకుంతల వాళ్ల అబ్బాయి పెళ్లి అని అందర్నీ రమ్మని పిలుస్తుంది. ఆ తర్వాత కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడే బాబు ఏడుపు వినిపిస్తుంది. ఏంటి అప్పుడే బాబు కూడా పుట్టేశాడా? ఏంటి అపర్ణ అస్సలు చెప్పనే లేదేంటి అని అడుగుతుంది. ఏమ్మా.. నార్మల్ డెలివరీ అయ్యిందా? లేక సిజేరియన్ చేశారా? అని అడుగుతుంది. అప్పుడే రుద్రాణి వచ్చి ఆ విషయం మా రాజ్‌ని అడగాలి అని అంటుంది. దీంతో కావ్య కవర్ చేస్తుంది. మేనల్లుడి మీద జోక్ చేస్తూ ఉంటున్నారు. నార్మల్ డెలివరీనే అండిని కావ్య చెప్తుంది. ఆ తర్వాత శకుంతల వెళ్లిపోతుంది. వెంటనే రుద్రాణిపై అపర్ణ సీరియస్ అవుతుంది. మమ్మల్ని నలుగురిలో అవమానించేంత వరకూ నీ మనసు ఆగడం లేదా? నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటున్నావో.. ఆ ఇంటిపై విశ్వాసం చూపించడం వదిలేసి అందరి ముందూ పరువు తియ్యాలి అనుకుంటున్నావా అని పెద్దావిడ చివాట్లు పెడుతుంది.

కళావతిపై నోరు పారేసుకున్న ధాన్య లక్ష్మి, రుద్రాణిలు..

ఏం చేస్తావ్ వదినా? ఏమీ చేయలేం? తప్పు చేసి ఇంటికి బిడ్డను తీసుకొచ్చిన నీ కొడుకుని ఏమీ చేయలేం? నీ కోడలు సంగతి ఏంటి? నార్మల్ డెలివరీ అని సింపుల్‌గా అబద్ధం ఆడేసిందని రుద్రాణి అంటుంది. ఏం అంటారు పాపం. రోజూ కావ్య వండి పెట్టే అన్నం తింటూ కూడా గడ్డి తిన్న పశువులాగా మీరు మాట్లాడుతుంటే.. ఇంకా మీలాంటి వాళ్లకు తింటి పెట్టి పోషించే వాళ్లకు మొత్తం.. మిమ్మల్ని ఏం అంటుంది? ఏమీ అనలేదు కదా.. ఇంటి గుట్టు ఎక్కడ బయట పడుతుందోమోనని అబద్ధం చెప్పింది అంతే అని స్వప్న అంటుంది. ఏయ్ స్వప్నా నీ చెల్లెల్లి వెనకేసుకు రాకు. భర్త ఓ బిడ్డను తీసుకొస్తే ఎవరు? ఏంటి అని నిలదీయకుండా.. ఆ బిడ్డను చూసుకుంటూ ఇంకా ఇక్కడే ఎందుకు ఉంది? ఈ ఆస్తి కోసమే కదా అని ధాన్య లక్ష్మి అంటుంది. రేపు ఆ బిడ్డ తల్లిని కూడా తీసుకొస్తే సొంత అక్కని చూసుకున్నట్టు చూసుకుంటుందేమో అని రుద్రాణి అంటుంది. షటప్? జస్ట్ షటప్. చాలా మాట్లాడారు ఇక ఆపండి. తప్పు చేసింది నేను. ఎన్ని మాటలు అన్నా పడతాను. కానీ కళావతి ఏ తప్పూ చేయలేదని రాజ్ సీరియస్ అవుతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Articles
ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుపై కౌంటర్..
ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుపై కౌంటర్..
గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన RCB.. టీమ్‌లో ఎవరున్నారంటే?
గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన RCB.. టీమ్‌లో ఎవరున్నారంటే?
ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణ
ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణ
రూ. 999కే నాయిస్ కొత్త బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటలు
రూ. 999కే నాయిస్ కొత్త బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటలు
డబ్బులు ఇస్తాను ఉద్యోగమివ్వండి.. పని నచ్చకపోతే తొలగించండి.
డబ్బులు ఇస్తాను ఉద్యోగమివ్వండి.. పని నచ్చకపోతే తొలగించండి.
మా అమ్మముందే నన్ను కమిట్‌మెంట్ అడిగారు..
మా అమ్మముందే నన్ను కమిట్‌మెంట్ అడిగారు..
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలపండి.. ఏం జరుగుతుంది అంటే..?
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలపండి.. ఏం జరుగుతుంది అంటే..?
నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్
బెల్లం కలిపిన పాలు తాగితే సూపర్ బెనిఫిట్స్
బెల్లం కలిపిన పాలు తాగితే సూపర్ బెనిఫిట్స్