Brahmamudi జులై 31వ తేదీ ఎపిసోడ్: కవి అయిన కళ్యాణ్.. రాజ్ తో కావ్య సరసాలు.. కనకం ఇంటికి కష్టాలు!!
బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో సేటు తీసుకొచ్చిన పెద్ద మనుషులు డబ్బులు కట్టడానికి గడువు ఇచ్చి, రెండు రోజుల్లో వడ్డీ డబ్బులు కట్టాలని చెప్పి వెళ్లిపోతారు. ఇక ఆ డబ్బు ఎలా కట్టాలి? అంటూ కృష్ణమూర్తి సతమతమైపోతాడు. ఈ సీన్ కట్ చేసి, దుగ్గిరాల ఫ్యామిలీ సీన్ లోకి ఎంటర్ అయితే.. అందరూ ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా.. ఏదో కొరియర్ వస్తుంది. మళ్లీ ఆర్డర్ ఇచ్చావా స్వప్న అంటూ రాహుల్ స్పప్నని అడగ్గా..

బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో సేటు తీసుకొచ్చిన పెద్ద మనుషులు డబ్బులు కట్టడానికి గడువు ఇచ్చి, రెండు రోజుల్లో వడ్డీ డబ్బులు కట్టాలని చెప్పి వెళ్లిపోతారు. ఇక ఆ డబ్బు ఎలా కట్టాలి? అంటూ కృష్ణమూర్తి సతమతమైపోతాడు. ఈ సీన్ కట్ చేసి, దుగ్గిరాల ఫ్యామిలీ సీన్ లోకి ఎంటర్ అయితే.. అందరూ ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా.. ఏదో కొరియర్ వస్తుంది. మళ్లీ ఆర్డర్ ఇచ్చావా స్వప్న అంటూ రాహుల్ స్పప్నని అడగ్గా.. దీనికి కావ్య రియాక్ట్ అవుతూ.. ఆర్డర్ ఇస్తేనే అన్నీ రావు.. కొన్ని వాటంతట అవే వస్తాయి. వెళ్లి తీసుకోండి కవి గారూ అంటుంది. ఎవరి కోసం వచ్చినా ఆ కొరియర్ ని తెరిచే అర్హత మీకే ఉంది అంటుందిది కావ్య. అదేంటి మేము ఎవ్వరం ఓపెన్ చేయకూడదా అని ధాన్యలక్ష్మి అడగ్గా.. ముందు కవిగారిని ఓపెన్ చేయనివ్వండి చిన్నఅత్తయ్య అని కావ్య జవాబు ఇస్తుంది.
అది ఏంటా అని కళ్యాణ్ ఓపెన్ చేసి చూడగా.. అతని ఫొటో అచ్చు అయి ఓ కవిత ఉంటుంది. ఇది చూసిన కళ్యాణ్ చాలా ఎమోషనల్ అవుతాడు. వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి నిల్చుంటాడు. కళ్యాణ్ ను అలా చూసి అందరూ ఏమయిందని కంగారు పడతారు. అది దుఖం కాదు ఆనంద భాష్పాలు అంటుంది కావ్య. ఎందుకు? ఏమైంది? అని అడుగుతాడు సీతారామయ్య. వదిన నా కవితను ప్రింట్ చేయించారు తాతయ్య చూడండి. నా ఫొటోతో సహా వేశారని చూపించి కళ్యాణ్ మురిసిపోతాడు. అందరూ ఆ కవితను చూసి మురిసిపోతారు. థాంక్స్ వదినా అంటూ కళ్యాణ్ చేతులు పట్టుకుని ఏడుస్తాడు. అయ్యో ఇది మీ గొప్పతనం కవి గారూ అంటుంది కావ్య. ఇక అలా కళ్యాణ్, కావ్యల మధ్య సంభాషణ సాగుతుంది.
ఇక ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ కవితను చదువుతో ఓ అమ్మాయి ఊయలలో కూర్చొని తెగ మురిసిపోతూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి కళ్లు మాత్రమే చూపించారు.. ఫేస్ చూపించలేదు. ఆ వెంటనే బైక్ మీద శనక్కాయలు తింటూ అప్పు కూర్చొని ఉన్న సీన్ వచ్చింది. ఇక అప్పుడే కళ్యాణ్ వచ్చి ఎంతో ఆనందంగా ఇది చూడు అంటూ తన కవితను చూపిస్తాడు. దీనికి అప్పు రియాక్ట్ అవుతూ.. ఇదేందిరా భయ్ ఏదైనా కేసులో ఇరుక్కున్నావా ఏంది.. అని అంటుంది. దీనికి కళ్యాణ్ జవాబు ఇస్తూ.. నేను రాసిన కవితను మెచ్చుకుంటూ నా కవితతో పాటు నా ఫొటో కూడా వేశారు అదిరిపోయింది కదా అంటాడు. నిజం చెప్పు ఈ ఫొటో వేయడానికి ఎంతిచ్చావ్.. అందుకే పెద్దగా వేశారు.. అంటుంది అప్పు. నీకూ మా వదినకి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మా వదిన మనిషిని మనిషిగా చూస్తుంది. నువ్వు మాత్రం డబ్బున్న వాళ్లను తప్ప అందరినీ మనుషుల్లానే చూస్తావ్.. అంత కష్టపడి కవిత రాస్తే అవమానిస్తావా అంటాడు కళ్యాణ్. అలా వీరి మధ్య సంభాషణ సాగుతుండగా.. ఓ అమ్మాయి వచ్చి కళ్యాణ్ రాసిన కవితను పొగుడుతుంది. ఎంతో గొప్పగా రాశారో అంటూ చెబుతుంది. అలాగే కళ్యాణ్ దగ్గర ఆటో గ్రాఫ్ కూడా తీసుకుంటుంది. ఇది చూసిన అప్పుడు కుళ్లుకుంటుంది. ఆటోగ్రాఫ్ తీసుకుని ఆ అమ్మాయి వెళ్లిపోయాక.. అది మన కవితకి ఉన్న పవర్.. ఇందాక ఏమన్నావ్.. డబ్బులిచ్చి బుక్ లో పబ్లిష్ చేయించుకున్నాను అంటావా.. ఇప్పుడేమంటావ్ అంటాడు కళ్యాణ్.




ఆ తర్వాత కావ్య నిద్రపోడానికి పరుపు వేసుకుంటుండగా.. రాజ్ వచ్చి నిల్చుంటాడు. ఇది చూసిన కావ్య అనండి.. ఏదో ఒకటి అనడానికి వచ్చారు కదా అంటుంది. నేనేమీ అనడానికి రాలేదు.. కాదు చెప్పడానికి వచ్చాను అంటాడు. ఓ బుద్ధి చెప్పడానికి వచ్చారా.. అని అనగానే.. నేను చెప్పేవరకు ఆగలేవా.. అన్నీ నీకు నువ్వే అనేసుకుంటావా.. నోరు మూసుకుని చెప్పేది విను అంటూ థ్యాంక్స్ అంటాడు రాజ్. ఇది విన్న కావ్య షాక్ అయి కిందపడిపోతుంది. ఏంటి ఏమన్నారు అని అడుగుతాడు. మా కళ్యాణ్ కవితను ప్రింట్ వేయించినందుకు అంటాడు. ఓ అందుకా నేను ఏమీ మీ కోసమో, మీ పిన్ని గారి కోసమో ఆ పని చేయలేదు.. మా మరిదిగారి సంతోషం కోసమే ఆ పని చేశాను అంటుంది. మీ నోటి నుండి అంత దారుణమైన మాట వినలేను అంటూ ఆటపట్టిస్తుంది. అయితే నా థ్యాంక్స్ నాకు తిరిగి ఇచ్చేయ్.. అంటాడు. ఓ నా మాట నాకే అప్పజెప్పుతున్నారా.. పోయినసారి మా అక్క యాడ్ బ్యాన్ చేయించినందుకు నేను చెప్పిన థ్యాంక్స్ తిరిగి ఇవ్వలేదు కదా దానికి దీనికి చెల్లు.. అంటుంది కావ్య. ఆ తర్వాత అసలు విషయం చెప్పలేదు.. రేపు నాతో ఆఫీస్ కి రావాలి అంటాడు రాజ్. ఎందుకు.. అని కావ్య అడగ్గా.. ఓ క్లయింట్ తో మాట్లాడాలని రాజ్ చెప్తాడు. ఇలా వీరి సంభాషణ జరుగుతుంది.
ఆ నెక్ట్స్ సేటుకు డబ్బు ఎలా కట్టాలా అని కనకం, కృష్ణమూర్తిలు బాధపడుతూంటారు. ఇళ్లు అమ్మేయాలని కృష్ణమూర్తి అనగా.. దానికి కనకం షాక్ అయి ఎలా అమ్మేస్తాం అయ్యా.. ఇదంతా నావల్లే అంటూ బాధపడుతుంది. తప్పు నీది మాత్రమే కాదు కనకం.. నాది కూడా ఉంది. నీకు మంచి చెడుతు చెబుతున్నా అనుకున్నా కానీ.. అది నువ్వు వింటున్నావా లేదా అని తెలుసుకోలేకపోయాను అంటాడు. నామీద మీరు పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోలేకపోయాను అంటుంది. ఇలా వీరు మాట్లాడుకుంటున్నదంతా గది బయట నుంచి అప్పడు అప్పు వింటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. ఇక రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.




