Bigg Boss 7: బిగ్‌బాస్ 7 ప్రారంభమయ్యేది అప్పుడే! ఈ సీజన్‌లో భారీ మార్పులు.. వారికి చుక్కలు తప్పవంటోన్న నాగ్
గత సీజన్లలోలాగానే ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఈసారి మాత్రం గతం కంటే భిన్నంగా బిగ్‌బాస్ షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల రిలీజైన ప్రోమోలో చిన్నపాటి హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున.

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే టైటిల్ లాంఛ్, ప్రోమోలతో ఆసక్తిరేపిన ఈ ఫన్‌గేమ్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. గత సీజన్లలోలాగానే ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఈసారి మాత్రం గతం కంటే భిన్నంగా బిగ్‌బాస్ షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల రిలీజైన ప్రోమోలో చిన్నపాటి హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్. ఆరు సీజన్లు చూసేశాం.. అంతా మాకు తెలుసనుకుంటున్నారు కంటెస్టెంట్లు.. పాపం పసివాళ్లు.. మా ప్లాన్స్ వాళ్లకు తెలియవు కదా.. న్యూ రూల్స్, న్యూ ఛాలెంజెస్, న్యూ బిగ్‌బాస్, ఈసారి బిగ్‌బాస్ 7.. ఉల్టా పల్టా’ అని ప్రోమోలో చెప్పుకొచ్చాడు నాగ్. ఈ మాటలు వింటుంటే బిగ్‌బాస్ 7 లో భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల ఓటింగ్ విషయంలో పెద్ద మార్పులే చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో నామినేషన్స్‌లో ఉన్న వారికి మద్దతుగా ఓట్లు వేయడానికి సోమవారం నుంచి శుక్రవారం వరకు సమయం ఉండేది. అయితే రాబోయే సీజన్‌లో దీనికి 3 రోజులకే పరిమితం చేశారని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ గత సీజన్లలో వారం మధ్యలో గేమ్స్, శని వారం నాగార్జున హోస్టింగ్, ఆదివారం ఎలిమినేషన్.. ఇలా ఒక ప్యాట్రన్‌లో నడిచేవి.
అయితే బిగ్‌బాస్ 7 సీజన్‌లో మాత్రం వీక్ మధ్యలో కూడా నాగార్జున వస్తారని, అలాగే వారం మధ్యలోనే ఎలిమినేషన్స్ ఉండనున్నాయని టాక్ నడుస్తోంది. అలాగే నామినేషన్స్ ప్రక్రియ కూడా చాలా వెరైటీగా ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనివల్ల కంటెస్టెంట్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది. కాగా గతంలో బిగ్‌బాస్ సెప్టెంబర్ 3,4,5 తేదీల్లోనే ప్రారంభమైంది. అయితే ఈసీజన్ కూడా ఇదే తారీఖుల్లోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఒకవేళ సర్‌ప్రైజ్ ఇద్దామనుకుంటే మాత్రం ఒక వారం ముందైనా షో ప్రారంభం కావచ్చు.


