Bigg Boss Telugu 7: ఈసారి బిగ్ బాస్‌లో ఆ సోషల్ మీడియా సెలబ్రిటీ.. క్లారిటీ వచ్చేసిందిగా
కొత్త కొత్త ట్విస్ట్‌లు, ఎమోషన్స్, కామెడీ, ఆట పాటలు, ఎత్తులకు పై ఎత్తులు వేసే టాస్కులు... కలగలిపిన ప్రోగ్రాం బిగ్ బాస్. ఒక్కో సీజన్‌కు క్రేజ్‌ను పెంచుకుంటూ పోతుంది ఈ షో. అయితే సీజన్ స్టార్టయ్యేముందు ఇందులోకి ఎవరు పార్టిసిపెంట్స్‌గా వెళ్తారు అనేది ఎప్పుడూ జనాల్లో ఇంట్రస్ట్ ఉండే టాపిక్కే. ఫస్ట్ సీజన్ నుండి రాబోయే సీజన్ వరకు అనేక మంది బిగ్ బాస్‌కు ఊహించని వ్యక్తులు వచ్చారు. తాజా సీజన్‌కు ఎవరొస్తారు అన్న సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రజంట్ కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

బిగ్ బాస్.. ఇండియాలో మాంచి రేటింగ్ ఉన్న రియాలిటీ షో. ఈ ప్రొగ్రామ్‌ను వాచ్ చేసే వ్యూయర్స్ ఏడాది.. ఏడాదికి పెరిగిపోతున్నారు. మరికొందరు బిగ్ బాస్ పుణ్యమా అని స్టార్స్‌గా అవతరిస్తున్నారు. ఇటు తెలుగునాట కూడా ఈ షోకు మాంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్న బిగ్ బాస్‌కు తెలుగులో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కొత్త కొత్త ట్విస్ట్‌లు, ఎమోషన్స్, కామెడీ, ఆట పాటలు, ఎత్తులకు పై ఎత్తులు వేసే టాస్కులు… కలగలిపిన ప్రోగ్రాం బిగ్ బాస్. ఒక్కో సీజన్‌కు క్రేజ్‌ను పెంచుకుంటూ పోతుంది ఈ షో. అయితే సీజన్ స్టార్టయ్యేముందు ఇందులోకి ఎవరు పార్టిసిపెంట్స్‌గా వెళ్తారు అనేది ఎప్పుడూ జనాల్లో ఇంట్రస్ట్ ఉండే టాపిక్కే. ఫస్ట్ సీజన్ నుండి రాబోయే సీజన్ వరకు అనేక మంది బిగ్ బాస్‌కు ఊహించని వ్యక్తులు వచ్చారు. తాజా సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అందులోకి ఎవరూ వెళ్తారనే టాపిక్ నెట్టింట నడస్తుంది.
కోవిడ్ సమయంలో తనదైన శైలి డాన్స్‌తో టిక్ టాక్ లో ఫేమస్ అయిన దుర్గారావుకి బిగ్ బాస్ 7 సీజన్‌లో ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దుర్గారావు మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చిందని.. బిగ్ బాస్ 7లో తనను ఎంపిక చేసామని వారు చెప్పినట్లు తెలిపాడు. కానీ తనను ఒక్కడినే రమ్మన్నారని కేవలం ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అని చెప్పారని దానికి తాను ఒప్పుకోలేదని అతడు వివరించాడు. టిక్ టాక్ ద్వారా తనకు చాలా పేరు వచ్చింది కానీ తనతో పాటు భార్య లేకపోతే నాకు ఈ పేరు వచ్చేది కాదని అతడు స్పష్టం చేశాడు. ఏం చేసినా తామిద్దరం కలిసి చేస్తామని బిగ్ బాస్‌లో కూడా ఇద్దరికీ ఛాన్స్ ఇవ్వాలని కోరినట్లు వెల్లడించాడు దుర్గారావు. దానికి బిగ్ బాస్ వాళ్ళు ఎలా స్పందించారు..? ఓకే చెప్పారా..? మరొకర్ని సెలక్ట్ చేసుకున్నారా అన్నది త్వరలో తేలనుంది.
మొత్తానికి టిక్ టాక్ డాన్స్ ద్వారా ఎందరో అభిమానిని సొంతం చేసుకున్న టిక్ టాక్ దుర్గారావు దంపతులు బిగ్ బాస్ లో కనిపిస్తే ఆ క్రేజ్ వేర్ అంటున్నారు అతడి అభిమానులు. ఇంకా ఎవరెవరు బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేస్తారు అన్న సస్పెన్స్ ప్రజంట్ కొనసాగుతుంది.

Durgarao And His Wife
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.




