Bigg Boss Telugu 9: ఈ వారంలోనే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు.. లిస్టులో ఆ టాలీవుడ్ క్రేజీ హీరోలు కూడా..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కొత్త కంటెస్టెంట్ల రాక ఆసన్నమైంది. ఈ వారమే పలువురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే హింట్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. మరి ఆ కొత్త కంటెస్టెంట్స్ ఎవరంటే?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదో వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ బయటకు వెళ్లిపోయిన వారిలో ఉన్నారు. కాగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మరింత ఆసక్తికరంగా మారనుందని తెలుస్తోంది. హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్లు వస్తుండడమే దీనికి కారణం. అది కూడా ఈ వారమే. హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నట్లు బిగ్ బాస్ కూడా క్లారిటీ ఇచ్చాడు. దీనికి సంబంధించి ప్రోమోలో కూడా చెప్పుకొచ్చాడు. ‘ఇక బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారనుందని, ఫైర్ స్టార్మ్ రాబోతుందని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను హెచ్చరించాడు. తద్వారా వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే డేంజర్ జోన్లో ఉన్నవాళ్లకు ముప్పు తప్పదని ముందస్తు వార్నింగ్ కూడా ఇచ్చాడు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇప్పటికే అగ్ని పరీక్ష నుంచి కామనర్స్ కోటాలో దివ్య నిఖిత వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చింది. మరి సెలబ్రిటీల కోటాలో హౌస్ లోకి ఎవరు రానున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. బుల్లితెర ఆర్టిస్టులు సుహాసిని, కావ్యశ్రీ, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, దివ్వెల మాధురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సెలబ్రిటీ వైల్డ్ కార్డు ఎంట్రీతో వీళ్లు హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశముందని తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మౌనీషా చౌదరి కూడా హౌస్ లోకి రానుందని తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ హీరోలు తనీష్, అమర్ దీప్ లు మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ వైల్డ్ కార్డు ఎంట్రీలను ఒకేసారి హౌస్ లోకి పంపిస్తారా? లేదా మిడ్ వీక్ లో ఇద్దరికి ఎంట్రీ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. మరి ఎట్టకేలకు వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్న నేపథ్యంలో ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరగనుందని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవితో హీరో తనీష్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








