AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: ఫౌల్ గేమ్‌ ఆడతారా.. ? బిగ్‌బాస్ సీరియస్ వార్నింగ్.. ఊహించని షాక్..

బిగ్‌బాస్ సీజన్ 9.. ఈసారి రణరంగమే అంటూ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఐదో వారం నడుస్తోంది. అయితే ఈసారి హౌస్మేట్స్ పై గట్టిగానే సీరియస్ అయ్యాడు బిగ్‌బాస్ . స్ట్రాటజీకి, ఫౌల్ గేమ్ కు ఉన్న తేడా నాకు బాగా తెలుసు.. అంటూ సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా కంటెస్టెంట్లకు ఊహించని షాకిచ్చాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Bigg Boss 9 Telugu: ఫౌల్ గేమ్‌ ఆడతారా.. ? బిగ్‌బాస్ సీరియస్ వార్నింగ్.. ఊహించని షాక్..
Bigg Boss 9 Telugu (3)
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2025 | 7:28 AM

Share

బిగ్‌బాస్ సీజన్ 9.. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారంటూ ముందే కంటెస్టెంట్లకు చెప్పేశాడు బిగ్‌బాస్. రణరంగం మీ ఊహలకు అంచనాలకు అందని ప్రదేశం.. ఏదైతే మీకు ఖచ్చితమైన గెలుపు అనిపిస్తుందో అదైనా.. ఏదైతే నిస్సహాయ స్థితి అనిపిస్తుందో అదైనా.. ఈ రెండు ఒక్క చిటికెలో మారిపోతాయి. కెప్టెన్ రామ్, ఇమ్మాన్యుయేల్ మినహా అందరూ డేంజర్ లో ఉన్నారు. వీరికి ఈ వారం పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వచ్చే ఫైర్ స్ట్రామ్ డేంజర్ లో ఉన్నవారిని కుదిపేస్తుంది. ఆ ఫైర్ స్ట్రామ్ ఏంటంటే.. వైల్డ్ కార్డ్స్.. ఇప్పుడు ఇంట్లోకి రాబోతున్నారు. వాళ్లు మీ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి వస్తున్నారు. మీ స్థానాన్ని కాపాడుకోవడానికి మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. వాటిలో మీ ప్రదర్శన ఆధారంగా మీకు పాయింట్స్ వస్తాయి. లీడర్ బోర్డ్ పై ఎంతపైన ఉంటే ఈ ఇంట్లో కొనసాగేందుకు అంత అవకాశాలు పెరుగుతాయి. అందుకు ముందు జంటలుగా విడిపోవాల్సి ఉంటుంది అని చెప్పాడు.

ఎవరు ఎవరితో జంటగా ఉంటారో చెప్పండి అని బిగ్‌బాస్ అడగ్గా.. దివ్య-భరణి, డీమాన్-రీతూ, సంజన-ఫ్లోరా, సుమన్-శ్రీజ, కళ్యాణ్-తనూజ​టీంలుగా ఏర్పడ్డాయి. ముందుగా పట్టు వదలకు టాస్క్ ఇచ్చారు. బజర్ మోగగానే డేంజర్ జోన్ లో ఉన్న ప్రతి జంటలో ఒకరు తమకు కేటాయించిన సీసాను హ్యాండిల్ పట్టుకోవాలి. మరో సభ్యులు అక్కడున్న హర్డిల్స్ దాటి సాండ్ పిట్ లో ఉన్న ఇసుకను తీసుకొచ్చి.. ఈ పోటీలో చూడకూడదు అనుకునే జంట పట్టుకున్న సీసా బాక్స్ లో ఇసుకను నింపాలి. ఆ బాక్స్ బరువు పెంచి కింద నెలకు టచ్ అయ్యేలా చేయాలి. ఇందులో డీమాన్, రీతూ టీమ్ గెలిచారు. తర్వాత భరణి – దివ్య, కళ్యాణ్ – తనూజ, సంజన – ఫ్లోరా, సుమన్ – శ్రీజ వరుసగా నిలిచారు.

ఇక చివరకు బెలూన్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఏ జంట అయితే ఐదు నిమిషాలు లేదా ఐదు నిమిషాలకు దగ్గర సమయం మీద ఊదిన బెలూన్ బాక్స్ లో ఉన్నవారి నీడిల్ మాస్క్ కు తగిలి పగలకుండా గాలితో ఉంచగలుగుతారో వాళ్లు ఈ టాస్కులో విజేతలుగా నిలుస్తారు. అయితే రూల్స్ చెప్పినప్పటికీ.. అదేం పట్టించుకోకుండా రీతూ స్ట్రాటజీ పేరుతో ఫౌల్ గేమ్ ఆడింది. బెలూన్ తీసుకెళ్లి డీమాన్ వెనకాల సైడ్ కు పెట్టి సైలెంట్ గా నిల్చుంది. ఇక రీతూ ప్లాన్ ఫాలో అయ్యారు తనూజ, శ్రీజ. దీంతో బిగ్‌బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. స్ట్రాటజీకి ఫౌల్ గేమ్‌కి మధ్య ఉన్న తేడా నాకు బాగా తెలుసు.. ఆటలో ముఖ్యమైన రూల్ ఐదు నిమిషాలు చేరడానికి బెలూన్ ను ఊది గాలిలో ఉండేలా చేయడం.. మీరు దానిని పూర్తిగా విస్మరించి తెలివి అనుకున్నారు. ఇది ఆట స్పూర్తికే విరుద్ధం. ఇందులో ముందు వరుసలో ఉన్నది రీతూ పవన్, తర్వాత కళ్యాణ్ తనూజ, శ్రీజ సుమన్.. దివ్య మీరు ప్రయత్నించారు. కానీ మీ పార్టనర్ భరణి రెండున్నర నిమిషాల పాటు బెలూన్ ఊదారు. సంజన, ఫ్లోరా మాత్రమే తప్పు దారి పట్టకుండా ప్రయత్నించారు. ఈ టాస్క్ తక్షణమే రద్దు చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న పాయింట్స్ సగానికి తగ్గిస్తున్నానంటూ షాకిచ్చాడు. దీంతో సంజన ఏడుపు మొదలెట్టింది. టాస్కు గెలిచి ఓడిపోయామంటూ ఓవర్ యాక్షన్ చేసింది.

నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం