Bigg Boss 8 Telugu: ఒక యోధుడిలా పోరాడారు.. గౌతమ్ జర్నీ వీడియోతో మనసులను పిండేశావయ్య బిగ్‌బాస్..
బుల్లితెర అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కంటెస్టెంట్స్ జర్నీ వీడియోస్ చూపిస్తున్నారు బిగ్‌బాస్. మొన్నటివరకు సీరియల్ ప్రమోషన్లతో విసుగు పుట్టించినప్పటికీ.. ఇప్పుడు ఒక్కో కంటెస్టెంట్ జర్నీ ఏవీలకు హీరో రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లోనే మరింత హైలెట్ అయ్యింది గౌతమ్ జర్నీ వీడియో.
బిగ్‌బాస్ సీజన్ 8 తుది అంకానికి చేరింది. మరో రెండు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ప్రచారం నడుస్తోంది. డిసెంబర్ 15న ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో ఈసారి విన్నర్ ఎవరనేదానిపై ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం గౌతమ్, నిఖిల్ ఇద్దరి మధ్య టైటిల్ పోరు నడుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ ప్రకారం ఈ ఇద్దరూ స్వల్ప తేడాతో దూసుకుపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే నిన్నటి ఎపిసోడ్ గౌతమ్ కు టైటిల్ మరింత దగ్గర చేసే ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. గౌతమ్ జర్నీ ఏవీతో అడియన్స్ హృదయాలను గెలిచాడు బిగ్‌బాస్. గౌతమ్ బిగ్‌బాస్ ప్రయాణం, టాస్కులు, గొడవలు అన్ని ఎమోషన్లతో మనసులను పిండేశారు. మరి నిన్నటి ఎపిసోడ్ లో అసలేం జరిగిందో చూద్దాం.
నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా గౌతమ్ జర్నీని చూపించారు. హౌస్ లో గడిచిన ప్రయాణాన్ని గుర్తుచేసేలా గార్డెన్ ఏరియాలో అదిరిపోయే సెటప్ చేశాడు. ముందుగా గౌతమ్ గార్డెన్ ఏరియాలోకి వచ్చి తన ఫోటోస్ చూసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత అక్కడే ఆల్బమ్ లో తన బిగ్‌బాస్ మెమొరీస్ అన్నీంటిని ఆరెంజ్ చేశారు. అందులో తన అన్నయ్య ఫోటో చూసి.. నేను ఆర్టిస్టు అవుతా అన్నప్పుడు అన్నయ్యే నాకు సపోర్ట్ చేశాడు అంటూ గుర్తు చేసుకున్నాడు గౌతమ్. జీవితంలో సెకండ్ ఛాన్స్ రేర్ గా వస్తుంది.. కానీ నాకు ఆ ఛాన్స్ బిగ్‌బాస్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్.
గౌతమ్ గురించి మాట్లాడుతూ.. పొగడ్తల వర్షం కురిపించాడు బిగ్‌బాస్. ‘బలవంతుడితో గెలవచ్చు.. కానీ మొండివాడితో గెలవలేము. మనం నమ్మిన దాని గురించి బలంగా నిలబడి.. ఏమైనా ఫర్లేదు అని పోరాడే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మీరు ఒకుర. లక్ష్యాన్ని ఛేదించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లో బలమైన కంటెస్టెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారు. ఇక స్త్రీల పట్ల మీకున్న గౌరవం.. ఆటలో మీ మాటలో స్పష్టంగా కనిపించింది. ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం శారీరకంగా బలమైన కంటెస్టెంట్. కానీ ఇక్కడ కండబలం ఒక్కటే సరిపోదని త్వరగానే మీరు తెలుసుకున్నారు. ఎలిమినేషన్ వరకు వెళ్లినప్పుడు మీ మనసు చలించింది. అప్పుడే మీ వ్యూహాన్ని మార్చుకున్నారు. చేయాల్సిన పనిని చేస్తే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుందనేది మీ విషయంలో జరిగింది. బుద్దిబలం, భుజబలంతో ఒక యోధుడిగా పాదరసంలా కదలుతూ ఏ ఆటంకం లేకుండా మీ ఆట ముందుకు సాగింది. మీ కోరుకున్న ప్రేమ మీకు లభించకపోయినా అది మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అది నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. ఈ రెండూ కనబర్చిన మీ ప్రయాణాన్ని ఓసారి చూసేద్దాం’ అంటూ గౌతమ్ ప్రయాణాన్ని చూపించాడు.
బిగ్‌బాస్ హౌస్ లో గౌతమ్ కు సంబంధించిన కీలకమైన విషయాలు, ఎమోషన్, సీరియస్, ఫన్నీ, లవ్ ఇలా అన్నింటినీ కవర్ చేశారు. జర్నీ వీడియో చూస్తూ ఉండిపోయాడు గౌతమ్. అనంతరం ‘బిగ్‌బాస్ 8 నా జీవితంలోనే ఒక మైల్ స్టోన్. నీ లైఫ్ లో ఎవరూ నీకోసం ఏదీ చేయరు. ఒక్కడివే నిలబడు, ఒక్కడివే పోరాడు’ అని అమ్మ చెప్పింది. ఆ మాటతోనే ఇక్కడిదాకా వచ్చాను. ఈ ఇంట్లో నేను నమ్మిన కొంతమంది నన్ను మోసం చేశారు. కానీ అది తెలుసుకున్న తర్వాత ఒక్కడినే ఆడాలని ఫిక్స్ అయ్యా.. ఒక్కడినే నిలబడ్డాను. చిన్నప్పటి నుంచి నాకెప్పుడూ గౌరవం లభించలేదు. దానికోసమే ఈ సీజన్ కు వచ్చాను. గౌరవం సంపాదించుకున్నాను. జీవితంలో ముగ్గురే ముఖ్యమైనవారు.తల్లి, తండ్రి, గురువు. మీరు నా గురువు బిగ్‌బాస్ అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.