Pallavi Prashanth: బిగ్ బాస్ ప్రైజ్‌మనీ అంతా రైతులకే.. కారు, నెక్లెస్ మాత్రం: పల్లవి ప్రశాంత్
గ్రాండ్ ఫినాలేలో నాగార్జున తనను టైటిల్ విజేతగా ప్రకటించగానే ఎమోషనల్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొదట హెస్ట్ నాగార్జున ఆతర్వాత తోటి కంటెస్టెంట్లందరినీ ప్రేమతో హత్తుకున్నాడు. అనంతరం నాగార్జున ప్రశాంత్ ను స్టేజిపైకి పిలిచి మాట్లాడాలని కోరాడు. ఈ సందర్భంగా తన విజయానికి కారణమైన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు రైతు బిడ్డ.
రైతు బిడ్డ అనుకున్నది సాధించాడు. జస్ట్ బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్‌గా వస్తే చాలనుకున్న పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. ఆదివారం (డిసెంబర్ 17) జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. శివాజీ, అమర్ దీప్ లాంటి ఉద్దండులను ఎదుర్కొని మరీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు ప్రశాంత్. అంతే కాదు బిగ్ బాస్ హిస్టరీలో ఒక కామన్ మ్యాన్‌గా ఎంటరై విజేతగా నిలిచిన తొలి కంటెస్టెంట్‌గా రైతు బిడ్డ చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ ఫినాలేలో నాగార్జున తనను టైటిల్ విజేతగా ప్రకటించగానే ఎమోషనల్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొదట హెస్ట్ నాగార్జున ఆతర్వాత తోటి కంటెస్టెంట్లందరినీ ప్రేమతో హత్తుకున్నాడు. అనంతరం నాగార్జున ప్రశాంత్ ను స్టేజిపైకి పిలిచి మాట్లాడాలని కోరాడు. ఈ సందర్భంగా తన విజయానికి కారణమైన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు రైతు బిడ్డ. అలాగే తనకు వచ్చిన ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకే ఇచ్చేస్తాంటూ ప్రకటించి మరోసారి అందరి మనసులు గెల్చుకున్నాడు.
రైతుల కోసమే ఇక్కడకు వచ్చా..
‘నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను ఇక్కడివరకు రావాలని ఎన్నో కలలు కన్నాను. అన్న పూర్ణ స్టూడియో చుట్టూ ఎంతో తిరిగాను. ఇందుకోసం ఒక్కోసారి తినకపోయినా సరే మా ఇంట్లోవాళ్లకు తిన్నట్లు అబద్ధం చెప్పేవాడిని. నేనేదైనా అనుకుంటే కచ్చితంగా చేయగలను. అంతకు మించి నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. నా తండ్రి కూడా నన్ను నమ్మాడు. నువ్వు నడువు.. నేను నిన్ను ముందుకు నడిపిస్తాను అన్నాడు. ఆ నమ్మకమే ఇక్కడివరకు వచ్చేలా చేసింది. బిగ్ బాస్ విజేతగా నిలిపింది. ఇక నాకు వచ్చిన రూ.35 లక్షలు అన్నదాతలకే పంచుతాను.నేను రైతుల కోసమే బిగ్ బాస్ షోకు వచ్చాను.. రైతుల కోసమే ఆడాను. నాకు ఇచ్చిన కారు మా నాన్నకు బహుమతిగా ఇస్తాను. అలాగే నెక్లెస్ అమ్మకు గిఫ్ట్‌గాఇస్తాను’ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్.
పల్లవి ప్రశాంత్ అభిమానుల హంగామా..
View this post on Instagram
తనకు వచ్చిన ప్రైజ్ మనీని రైతులకే ఇచ్చేస్తానంటూ గతంలో కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు దానిని నిజం చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. కాగా బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. అలాగే బిగ్ బాస్ స్పాన్సర్ జోయాలుకాస్ సంస్థ ఒక డైమండ్ నెక్లెస్ ను బహుమతిగా ఇచ్చింది. అలాగే మారుతి బ్రీజా కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.
నాన్నకు కారు ఇచ్చేస్తా..
View this post on Instagram
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.