Bigg Boss Priyanka Jain: ఇక ప్రియాంకకు దూరంగా ప్రియుడు.. అమెరికాలో సెటిలయ్యేందుకు ప్లాన్.. కారణమిదే
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ తో తెలుగు వారికి బాగా చేరువైపోయింది కన్నడ బ్యూటీ ప్రియాంక జైన్. అంతకు ముందు పలు సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొంది. అయితే బిగ్ బాస్ తో ప్రియాంక క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఆటల్లోనూ, మాటల్లోనూ ఆమె ఎంతో హుందాగా వ్యవహరించింది.
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ తో తెలుగు వారికి బాగా చేరువైపోయింది కన్నడ బ్యూటీ ప్రియాంక జైన్. అంతకు ముందు పలు సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొంది. అయితే బిగ్ బాస్ తో ప్రియాంక క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఆటల్లోనూ, మాటల్లోనూ ఆమె ఎంతో హుందాగా వ్యవహరించింది. ఇదే ప్రియాంకను చాలా మందికి చేరువచేసింది. టాప్-5లో నిలిచేలా చేసింది. ఏడో సీజన్‌లో టాప్-5కు వెళ్లిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంకనే కావడం గమనార్హం. కాగా బిగ్ బాస్ హౌజ్‌లోనే తన ప్రేమ, ప్రియుడి గురించి ఓపెన్ అయ్యిందీ అందాల తార. తన లవర్ శివ్ కుమార్ హౌజ్ లోకి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందాం అంటూ హత్తుకుంది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా శివ్ కుమార్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ప్రియాంక. ఇటీవలే ఆమె కళ్లకు దగ్గరుండి మరీ సర్జరీ చేయించాడు శివ్ కుమార్. ఇదిలా ఉంటే సడెన్ గా అమెరికాకు పయనమయ్యాడు ప్రియాంక లవర్. దీనికి సంబంధించిన తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను కూడా అప్ లోడ్ చేశాడు. అందులో వీసా పొందేందుకు ఎన్ని కష్టాలు పడ్డాడతో చూపించాడు శివ కుమార్. అలాగే ఢిల్లీ గల్లీల్లో పడిన ఇక్కట్లను చూపించాడు.
‘యూఎస్ ఎంబసీ ముందు వీడియోలు తీస్తే మన ఫోన్‌లు లాగేసుకుంటారట. అందుకని అక్కడ వీడియో చేయలేకపోయాను. కానీ మొదటి ప్రయత్నంలోనే నాకు వీసా వచ్చేసింది. ప్రియాంక కాళ్లు మొక్కి మరీ వెళ్లాను. ప్రియాంకతో పాటు అమ్మ ఆశీర్వాదం వల్లే వీసా వచ్చింది. 20 సెకన్లలోనే ఇంటర్వ్యూ పూర్తి అయిపోయింది. ఇంటర్వ్యూలో ఎందుకు అమెరికాకు వెళుతున్నావని అడిగారు. ఒక సీరియల్ కోసం అని చెప్పాను. అలాగే ఏడాది వేతనం, ఎవరెవరు వెళుతున్నారు? అని అడగ్గా అన్ని వివరాలు చెప్పేశాను. చివరకు వీసా అప్రూవ్ అని చెప్పడంతో చాలా హ్యపీగా ఫీలయ్యాను. త్వరలోనే మరొక సర్ ప్రైజ్ ఉండనుంది’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు శివ్ కుమార్. చాలామంది ప్రియాంకతో పాటే శివకుమార్ అమెరికా వెళుతున్నాడనుకున్నారు. అయితే వీడియోలో చివరకు శివ ఒక్కడే వెళ్లిపోయాడు? అసలు అతను అమెరికాకు వెకేషన్ వెళ్తున్నాడా? లేదంటే అక్కడే స్థిరపడే ఆలోచనలున్నాయా? అనేది మాత్రం వీడియోలో క్లారిటీ ఇవ్వలేకపోయాడు.
ఢిల్లీలో ప్రియాంక, శివ కుమార్..
View this post on Instagram
అమెరికాకు వెళుతోన్న శివ కుమార్.. వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.