Bigg Boss 7 Telugu: బిగ్బాస్ ఫిటింగ్.. దోస్తుల మధ్య కొట్లాట.. శోభా వర్సెస్ అమర్..
బుధవారం కంటెస్టెంట్స్ మద్య కాయిన్స్ గేమ్ పెట్టారు బిగ్బాస్. ఇప్పటికే ఇంటి సభ్యులు అయిన శివాజీ, సందీప్, శోభా శెట్టిలను బ్యాంకర్స్ అని .. ఏ కంటెస్టెంట్ దగ్గర అయితే ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వాళ్లే నాల్గవ పవరాస్త్ర పోటీదారులు అవుతారని చెప్పారు బిగ్బాస్ . దీంతో మొదటి ప్రోమోలో బజర్ కొట్టేందుకు హౌస్మేట్స్ ఒకరినొకరు తోసేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ తలకు గాయం కాగా.. ప్రిన్స్ యావర్ కు గాయాలైనట్లుగా తెలుస్తోంది. కిందపడి నొప్పితో అల్లాడిపోతున్నాడు.
మొత్తానికి బిగ్బాస్ నాలుగో వారం నామినేషన్స్ గొడవ ముగిసింది. సోమవారం, మంగళవారం రెండు రోజులు హౌస్ లో హీట్ డిస్కషన్ నడిచిన సంగతి తెలిసిందే. నువ్వేంత అంటే నువ్వేంత అంటూ రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. చివరకు బూతులు మాట్లాడారు హీరోస్. ఇక ఆ తర్వాత సద్దుమణిగిన గొడవలే మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ గొడవపడ్డారు. ఇక బుధవారం కంటెస్టెంట్స్ మద్య కాయిన్స్ గేమ్ పెట్టారు బిగ్బాస్. ఇప్పటికే ఇంటి సభ్యులు అయిన శివాజీ, సందీప్, శోభా శెట్టిలను బ్యాంకర్స్ అని .. ఏ కంటెస్టెంట్ దగ్గర అయితే ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వాళ్లే నాల్గవ పవరాస్త్ర పోటీదారులు అవుతారని చెప్పారు బిగ్బాస్ . దీంతో మొదటి ప్రోమోలో బజర్ కొట్టేందుకు హౌస్మేట్స్ ఒకరినొకరు తోసేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ తలకు గాయం కాగా.. ప్రిన్స్ యావర్ కు గాయాలైనట్లుగా తెలుస్తోంది. కిందపడి నొప్పితో అల్లాడిపోతున్నాడు. అయితే ముందుగా బజర్ కొట్టింది అమర్ అని.. శుభశ్రీ అని వాదించుకుంటున్నారు. అయితే వీరిలో ఎవరు ముందుగా బజర్ నొక్కారనేది సంచాలక్స్ శోభాశెట్టి, సందీప్, శివాజీలు నిర్ణయించాల్సి ఉంటుంది.
ఇక తాజాగా రెండో ప్రోమోను రిలీజ్ చేశారు. స్మైల్ ప్లీజ్ ఛాలెంజ్ లో భాగంగా సందీప్, గౌతమ్ ఇద్దరు కలిసి తమ అపోనెంట్స్ కెమెరా ముందు సెల్ఫీలు తీసుకోకుండా అపాలని అనౌన్స్ చేసారు. ముందుగా రతిక, తేజ ఇద్దరిని గౌతమ్, అమర్ ఆపేందుకు ట్రై చేయగా.. తేజ ఈ గేమ్ లో గెలిచినట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram
ఇక ఆ తర్వాత అన్ని ఫోటోలను చూసి ఏవి వ్యాలిడ్ అనేది.. ఏ జంట గెలిచిందనేది బిగ్బాస్ కు చెప్పాలని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత అమర్, శోభా మధ్య వాదన జరిగింది. ఫోటోస్ సెలక్షన్ దగ్గర అమర్ , శోభా మధ్య మాటల యుద్ధం నడిచింది. మరి ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలిచారనేది చూడాలి. ఇక నాలుగో వారం నామినేషన్స్ విషయానికి వస్తే.. టేస్టీ తేజ, రతిక, గౌతమ్ కృష్ణ, యావర్, శుభ శ్రీ, ప్రియాంక నామినేట్ అయిన సంగతి తెలిసిందే.