Bigg Boss 6 Telugu: రేవంత్ చేతిలో నుంచి ఎగిరిపడ్డ గొడ్డలి.. కొద్దిలో ప్రాణాలతో బయటపడిన ఇనయ.. లేదంటే ఇక అంతే..
తాజా ఎపిసోడ్లో మాత్రం పెను ప్రమాదం తప్పింది. లేదంటే రేవంత్ గొడ్డలి వేటుకు ఇనయ సుల్తానా బలయ్యేది. కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ గురువారం ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా
బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. పెద్ద బాస్ ఎలాంటి టాస్కులు ఇస్తారో.. కంటెస్టెంట్స్ మధ్య ఎప్పుడు చిచ్చు పెడతాడో కూడా చెప్పలేం. డైలీ సీరియల్ మాదిరిగా ఎంటర్టైన్మెంట్ లేకుండా రోటిన్‌గా సాగుతూ వస్తున్న సీజన్ 6ను ఎట్టకేలకు తన పుట్టిన రోజు వేడుకలతో కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. గత రెండు రోజులుగా బిగ్ బాస్‌ను సంతృప్తి పరిచేందుకు తెగ కష్టపడ్డారు ఇంటి సభ్యులు. దెయ్యాల్లా వేశాలు వేసుకోవడం.. స్కూల్ పిల్లల మాదిరిగా అల్లరి చేయడం.. ఇంట్లో జోకర్ వచ్చి సందడి చేయడం ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తాజా ఎపిసోడ్లో మాత్రం పెను ప్రమాదం తప్పింది. లేదంటే రేవంత్ గొడ్డలి వేటుకు ఇనయ సుల్తానా బలయ్యేది. కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ గురువారం ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా
బిగ్ బాస్ ను ఎంటర్టైన్ చేసేందుకు వాసంతి, మెరీనాలు రాత్రి సమయంలో దెయ్యాల్లా వేషం వేసి పడుకున్నవారిని భయపెట్టేందుకు ప్రయత్నించారు. ఇక ఆ తర్వాత ఇంటి సభ్యుల కోరికలను తెలుసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పారు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎవరికి కావాల్సినవి వాళ్లు చెప్పారు. తాను అనాధల కోసం హెల్ప్ చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని ఈసారి తన చేతులతో కుదరడం లేదని.. తన ప్రేయసి సిరి చేయాలంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇనయ వాళ్ల అమ్మను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక గీతూ.. తన కుక్క పిల్లల బొచ్చు కావాలని అడిగింది. అక్టోబర్ 27న తన కూతురు పుట్టినరోజు వేడుకలు హౌస్ లో జరుపుకుంటే నెక్ట్స్ లెవల్ హ్యాపీ అన్నాడు ఆదిరెడ్డి. లేదంటే కనీసం తన ఫోటో పంపమని అడిగాడు. ఇక ఆ తర్వాత జరిగిన కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా.. మొత్తం జరిగిన టాస్కులలో బెస్ట్ పెర్ఫామెన్ ఇచ్చిన 6గురిని సెలెక్ట్ చేయాలని కెప్టెన్ అయిన కీర్తికి అడిగాడు బిగ్ బాస్. దీంతో ఆమె రాజ్, ఫైమా, బాలాదిత్, సూర్య, రేవంత్, గీతూలను సెలెక్ట్ చేసింది. దీంతో ఆమె సెలక్షన్ పై అసహనం వ్యక్తం చేశారు మెరీనా, వాసంతి.
కెప్టెన్సీ టాస్కులో భాగంగా రాజ్, ఫైమా, సూర్య, బాలాదిత్య, రేవంత్, గీతూలకు గొడ్డలి ఇచ్చి కట్టెలు కొట్టే టాస్క్ ఇచ్చారు. ఇందులో రేవంత్, బాలాదిత్య, ఆర్జే సూర్యలు నెక్ట్స్ లెవల్ కు వెళ్లారు. అయితే రేవంత్ కట్టెలు నరుకుతుండగా.. గొడ్డలి ఎగిరి సంచాలక్ గా ఉన్న ఇనయ వైపు దూసుకొచ్చింది. దీంతో ఆమె అరుస్తూ పక్కకు జరగడంతో కొద్దిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఇక సింగర్ రేవంత్ ఇంటి ఐదో కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది.