Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‌కు క్లాస్ తీసుకున్న నాగార్జున.. కెప్టెన్సీ క్యాన్సిల్ అంటూ..
తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే హౌస్ మేట్స్ మధ్య రకరకాల టాస్కులు పెట్టి ఆడుకుంటున్నాడు బిగ్ బాస్.

Bigg Boss 5 Telugu: తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే హౌస్ మేట్స్ మధ్య రకరకాల టాస్కులు పెట్టి ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌ల్లో గెలవడంకోసం కంటెస్టెంట్స్ నానా హడావిడి చేస్తున్నారు. తిట్టుకోవడం, అరుసుకోవడం, ఒకరిమీదకు ఒకరు వెళ్లడం, ఏడవడం ఇలా రచ్చరచ్చ చేస్తున్నారు. ఇక వారాంతం వచ్నదంటే హోస్‌లో సందడి డబుల్ అవుతుంది. హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్‌లో ఉన్నవాళ్ళల్లో జోష్ పెంచుతారు. అంతే కాదు వారం మొత్తంలో ఎవరెవరు ఏం చేశారు అనే చూపించి క్లాస్ తీసుకుంటాడు నాగ్. అయితే ఈ వారాం కూడా హౌస్ లో గొడవలు, ఏడుపులు జరిగాయి. ఈ సారి ప్రియాకు సన్నీకి ఒక రేంజ్‌లో గొడవ జరిగింది. కోడి గుడ్డు టాక్స్ లో ప్రియాకు సన్నీకి మధ్య పెద్ద యుద్దమే జరిగింది.
రెచ్చిపోయిన ప్రియా చెంపపగిలిద్ది అంటూ సన్నీ పై ఫైర్ అవ్వగా.. దమ్ముంటే కొట్టిచూడు అంటూ సన్నీ సీరియస్ అయ్యాడు. ఇక నేడు శనివారం కావడంతో నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ముందుగా రవికి క్లాస్ తీసుకున్నారు నాగార్జున. సిరి దగ్గర స్టిక్కర్స్ దొంగతనం చేశావ్ అని ప్రశ్నించగా నేను దొంగతనం చేయలేదు.. నాకు దొరికాయి అని చెప్పుకొచ్చాడు రవి.. దానికి నవ్వుతూనే రవి అబద్ధం ఆడుతున్నడని కనిపెట్టేశారు నాగ్. అలాగే ప్రియా గురించి మాట్లాడుతూ.. చెంప పగలకొడతా.. అంటూ ఎందుకు అన్నిసార్లు అన్నావ్ అని ప్రియను ప్రశ్నించారు నాగ్. దానికి సన్నీ ఫిజికల్ గా అటాక్ చేస్తే చెంప పగలకొడతా.. అన్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే టాస్క్ సమయంలో కాజల్ సన్నీకి హెల్ప్ చేసిందని ఆనీ మాస్టర్ చెప్పింది. ఇక వ్యక్తిగతంగా ఆడాల్సిన టాస్క్ ల్లో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నందుకు కెప్టెన్సీ క్యాన్సిల్ అయ్యింది అని అనడంతో సన్నీ -శ్రీరామ్ డల్ అయ్యారు. ఇదంతా చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ ఆసక్తిగా ఉండనుందని అర్ధమవుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :