Actress Deepa: సినీ నటి దీప ఆత్మహత్య మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?.. ఐఫోన్‍ మిస్సింగ్..

ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి దీప ఫ్రెండ్ ప్రభాకరన్ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లి చూసే సరికి దీప ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమె సోదరుడు దినేష్‌ శనివారం రాత్రి కోయంబేడు

Actress Deepa: సినీ నటి దీప ఆత్మహత్య మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?.. ఐఫోన్‍ మిస్సింగ్..
Deepa
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2022 | 4:10 PM

తమిళ సినీనటి దీప (Actress Deepa) అలియాస్ పౌలిన్‌ జెస్సిక ఆత్మహత్య కోలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది దీప. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీప తమిళంలో ‘వైతా’ సినిమాలో హీరోయిన్‌గా.. మరికొన్ని మూవీల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. శనివారం (సెప్టెంబర్ 17) కుటుంబ సభ్యులు దీపతో మాట్లాడాలని ఆమె మొబైల్ కి పలుమార్లు కాల్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి దీప ఫ్రెండ్ ప్రభాకరన్ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లి చూసే సరికి దీప ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమె సోదరుడు దినేష్‌ శనివారం రాత్రి కోయంబేడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించడంతో దీప మరణానికి ప్రేమనే కారణం అని భావిస్తున్నారు. తన ఆత్మ హత్యకు ఎవరు కారణం కాదని ఆ నోట్‌లో రాసి పెట్టింది.

సూసైడ్ నోట్‏లో జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటానని రాసిన దీప.. అతడి పేరును మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఆమెకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరెవరు? ఎవరితో దీప క్లోజ్ గా ఉండేది? అనే విషయాలు ఆరా తీస్తూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. తన మృతికి ఎవరూ కారణం కాదని ఘటనా స్థలంలో దొరికిన లేఖలో ఉందని పోలీసులు చెబుతున్నారు. దీప సొంతూరైన తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఇంద్రానగర్‌కు ఆదివారం మృతదేహాన్ని తీసువచ్చి.. సోమవారం అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబసభ్యులు. ఇప్పటికే ఆమె ప్రియుడు సిరాజ్ ఉద్ధీన్ ను విచారించేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. ఆమె ఐఫోన్ తోపాటు కొన్ని వస్తువులు సైతం మాయమైనట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

దీప మొదటిసారిగా తమిళనాడులో రిపోర్టర్‌గా, యాంకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలని కోరికతో టిక్ టాక్‌తో చిన్న చిన్న వీడియోలు చేశారు. మంచి ఫాలోవర్లతో ముందకు సాగుతున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. కోలీవుడ్‌లో అనేక సినిమాల్లో దీప నటించింది. చిన్న చిన్న రోల్స్ చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘తూప్పరివాలన్’ లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ మధ్యనే విడుదలైన ‘వైధా’ లో హీరోయిన్ రోల్‌లో కనిపించింది. మంచి నటిగా ఎదగాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. స్టార్ హీరోయిన్ అవుతుందని కుటుంబ సభ్యులు సంతోషిస్తున్న సమయంలో ఈ ఘటన కోలుకోలేని పరిస్థితి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే