Allu Arjun: అల్లు అర్జున్‏ను ఓ ఆటాడుకున్న అర్హ.. టంగ్ ట్విస్టర్ గేమ్‏లో కూతురి చేతిలో ఓడిపోయిన బన్నీ..

తాజాగా మరోసారి తన కూతురు అర్హతో కలిసి ఓ ఫన్నీ గేమ్ ఆడారు. అందులో అర్హ వేసిన ప్రశ్నలకు బన్నీ సమాధానాలు చెప్పినా.. టంగ్ ట్విస్టర్ గేమ్‏లో ఓడిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Allu Arjun: అల్లు అర్జున్‏ను ఓ ఆటాడుకున్న అర్హ.. టంగ్ ట్విస్టర్ గేమ్‏లో కూతురి చేతిలో ఓడిపోయిన బన్నీ..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2022 | 2:35 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణలో బన్నీ పాల్గోననున్నాడు. అయితే తనకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు అల్లు అర్జున్ (Allu Arjun). ముఖ్యంగా తన కూతురు అర్హతో కలిసి బన్నీ చేసే అల్లరి మాములుగా ఉండదు. వీరిద్దరు అల్లరి ఆటలకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా మరోసారి తన కూతురు అర్హతో కలిసి ఓ ఫన్నీ గేమ్ ఆడారు. అందులో అర్హ వేసిన ప్రశ్నలకు బన్నీ సమాధానాలు చెప్పినా.. టంగ్ ట్విస్టర్ గేమ్‏లో ఓడిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో ముందుగా అర్హ తాను చెప్పిన మాటలను తప్పు లేకుండా చెప్పాలంటూ ఛాలెంజ్ చేసింజి. అందులో నాలుగు ఎర్ర లారీలు.. నాలుగు తెల్ల లారీలు అని అర్హ ఠక్కున చెప్పగా.. బన్నీ సరిగ్గా చెప్పలేకపోయాడు. ఇక ఆ తర్వాత గంగిగోవు పాలు గట్టుడైన చాలు అని పొడుపు కథ అడగ్గా.. జున్ను అంటూ సమాధానం చెప్పాడు బన్నీ. వీరిద్దరికి సంబంధించిన ఈ క్యూట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం చేస్తుండగా.. ఆయన కూతురు అర్హ సైతం బాలనటిగా వెండితెర అరంగేట్రం చేయబోతుంది. సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో అర్హ కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.