Krishnam Raju Statue: కోనసీమలో రూపుదిద్దుకున్న కృష్ణం రాజు వ్యాక్స్ విగ్రహం.. దశదిన కర్మ కార్యక్రమంలో అందజేత..
దివంగత కృష్ణంరాజు దశదిన కార్యక్రమంలో శిల్పి రాజ్ కుమార్ వడయార్ కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు ఈ విగ్రహాన్ని అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ 23న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు స్వగృహంలో ..
Krishnam Raju Statue: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రముఖ సినీనటుడు రెబల్ స్టార్ దివంగత కృష్ణంరాజు వ్యాక్స్ విగ్రహం రూపుదిద్దుకుంది. ఇటీవల కృష్ణం రాజు మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు కృష్ణం రాజు జ్ఞాపకాలను పదికాలాల పాటు ఉండేలా చూడాలని భావించారు. ఈ నేపథ్యంలో కృష్ణం రాజు విగ్రహాన్ని తయారు చేయించాలనుకున్నారు. దీంతో కొత్తపేటలో ఫేమస్ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ను సంప్రదించారు.
కృష్ణంరాజు కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన విగ్రహాన్ని ప్రముఖ శిల్పి వడయార్ రూపొందించారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే విగ్రహాన్ని పూర్తిచేశారు.
దివంగత కృష్ణంరాజు దశదిన కార్యక్రమంలో శిల్పి రాజ్ కుమార్ వడయార్ కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు ఈ విగ్రహాన్ని అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ 23న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు స్వగృహంలో దశదిన కార్యక్రమాన్ని కృష్ణం రాజు కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా శిల్పి వడయార్ మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు అని అన్నారు. ఆయన మరణం తనకు ఎంతో బాధను కలిగించిందని.. కుటుంబ సభ్యుల కోరిక మేరకు తాను కేవలం 4 రోజుల్లోనే ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..