Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ నుంచి మరో మెలోడీ రిలీజ్.. మరోలోకం తీసుకెళ్తోన్న ‘అలనై నీకై’ సాంగ్..

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి అలనై నీకై అనే మెలోడీని రిలీజ్ చేశారు మేకర్స్.

Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ నుంచి మరో మెలోడీ రిలీజ్.. మరోలోకం తీసుకెళ్తోన్న 'అలనై నీకై' సాంగ్..
Alanai Nikai Song
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2022 | 3:47 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పొన్నియిన్ సెల్వన్ ( ponniyin selvan ). ప్రసిద్ధ రచయిత కల్కి రాసి పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, విక్రమ్, కార్తీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‏గా రాబోతున్న ఈ మూవీ భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి అలనై నీకై అనే మెలోడీని రిలీజ్ చేశారు మేకర్స్.

‘జలసఖి నేనై నిలిచా. నెలరాజా’.. అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. గేయ రచయిత అనంత శ్రీరామ్ ఈ పాట రాయగా.. సింగర్ అంతరా నంది పాడారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు.

అలనై నీకై సాంగ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.