God Father Digital Rights: విడుదలకు ముందే ‘గాడ్ ఫాదర్’ సునామి.. చిరు మూవీ డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లు తెలుసా ?..
అయితే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం చిరు.. గాడ్ ఫాదర్ (God Father), బోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాకు డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార, సత్యదేవ్, సల్మాన్ కాన్, బ్రహ్మాజీ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఇక టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. అయితే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం.. గాడ్ ఫాదర్ తెలుగు, హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ రూ. 57 కోట్లకు కొనుగోలు చేసిందట. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ గా రాబోతున్న గాడ్ ఫాదర్ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. అయితే ఇందులో చిరు చెల్లిగా నయన్ కనిపించనున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.