అతిలోకసుందరి మరణంపై బయటపడ్డ నమ్మలేని నిజాలు..!

అతిలోకసుందరి శ్రీదేవి.. 2018 ఫిబ్రవరి 24న.. ఈ లోకాన్ని వీడిన విషయం తెలిసిందే. ఆమె అకాల మరణ వార్త విన్న ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. తన రిలేటివ్స్ మ్యారేజ్ కోసం దుబాయ్ వెళ్లిన ఆమె.. ఓ హోటల్‌ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసారు. అయితే అప్పట్లో ఆమె మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే తాజాగా శ్రీదేవి మరణంపై ప్రముఖ రచయత సత్యర్ధి నాయక్ షాకింగ్ న్యూస్‌ను […]

అతిలోకసుందరి మరణంపై బయటపడ్డ నమ్మలేని నిజాలు..!
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2020 | 12:52 AM

అతిలోకసుందరి శ్రీదేవి.. 2018 ఫిబ్రవరి 24న.. ఈ లోకాన్ని వీడిన విషయం తెలిసిందే. ఆమె అకాల మరణ వార్త విన్న ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. తన రిలేటివ్స్ మ్యారేజ్ కోసం దుబాయ్ వెళ్లిన ఆమె.. ఓ హోటల్‌ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసారు. అయితే అప్పట్లో ఆమె మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే తాజాగా శ్రీదేవి మరణంపై ప్రముఖ రచయత సత్యర్ధి నాయక్ షాకింగ్ న్యూస్‌ను బయటపెట్టాడు. శ్రీదేవి జీవితంపై బయోగ్రఫీ పుస్తకం రాసిన ఆయన.. అందులో శ్రీదేవి మరణానికి గల అసలు కారణాలు ఏంటో తెలిపాడు.

శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు ఆమెకు సన్నిహితులైన సినిమావాళ్లతో శ్రీదేవి గురించి ఆరా తీశాడు. అనంతరం వారి నుంచి వచ్చిన సమాచారంతో ఆమె మరణానికి కారణాలను పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వెల్లడించాడు. శ్రీదేవికి తొలి నుంచి లో బీపీ ఉండేదని.. అప్పుడప్పుడు షూటింగ్‌ స్పాట్‌లో కూడా కళ్లు తిరిగిపడిపోయేదన్న విషయాన్ని తెలిపాడు. ఇలా అనేక సార్లు పడిందని… శ్రీదేవితో ‘చాల్‌‌బాజ్’ చిత్రాన్ని తెరకెక్కించిన పంకజ్ పరాషర్ చెప్పినట్లు సత్యార్ధి వెల్లడించాడు.

అంతేకాదు.. హీరో నాగార్జునతో ఓ చిత్ర షూటింగ్‌ జరిగేటపుడు కూడా ఓసారి బాత్రూమ్‌లో పడిపోయిన సందర్భాన్ని తనతో ప్రస్తావించినట్టు నాయక్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీదేవి బంధువు.. మహేశ్వరి, భర్త బోనీ కపూర్‌ కూడా శ్రీదేవి ఒక్కోసారి వాకింగ్ చేసేటపుడు స్పృహకోల్పోయి కిందపడ్డ సందర్భాలున్నాయన్నారు. అయితే ఆమెకు “లో బీపీ” ఉన్న విషయాన్ని వైద్యులకు చూపించినా ఉపయోగం లేకుండాపోయిందన్న విషయం కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అసలు శ్రీదేవి మరణానికి “లో బీపీ”నే కారణమన్న విషయాన్ని ఈ సంఘటనలు తేల్చేస్తున్నాయన్నారు రచయత.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..