తమిళ హీరోలకు సెంటిమెంట్‌గా చిరు ‘టైటిల్స్’

తమిళ నటుడు విజయ్‌‌కి తమిళ్‌లో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంది. అతన్ని అభిమానులు దైవంలా భావిస్తూ ఉంటారు. ఇటీవలే ‘బిగిల్‌’తో తమిళ్‌లో అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఈ మూవీ తెలుగులో ‘విజిల్’గా రిలీజై యావరేజ్‌గా ఆడింది. ఇక న్యూ ఇయర్ రోజున తన నెక్ట్స్ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్ రిలీజ్ చేసిన విజయ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు. ఇది ఇళయ దళపతికి 64వ సినిమా. ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే..ఈ సారి మన మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌ […]

తమిళ హీరోలకు సెంటిమెంట్‌గా చిరు 'టైటిల్స్'
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 04, 2020 | 10:07 PM

తమిళ నటుడు విజయ్‌‌కి తమిళ్‌లో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంది. అతన్ని అభిమానులు దైవంలా భావిస్తూ ఉంటారు. ఇటీవలే ‘బిగిల్‌’తో తమిళ్‌లో అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఈ మూవీ తెలుగులో ‘విజిల్’గా రిలీజై యావరేజ్‌గా ఆడింది. ఇక న్యూ ఇయర్ రోజున తన నెక్ట్స్ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్ రిలీజ్ చేసిన విజయ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు. ఇది ఇళయ దళపతికి 64వ సినిమా.

ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే..ఈ సారి మన మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌ ‘మాస్టర్‌’తో రాబోతున్నాడు విజయ్. చిరు లెక్చలర్‌గా నటించిన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్టయ్యింది. ఇటీవలే ‘ఖైదీ’, ‘దొంగ’ వంటి..చిరు టైటిల్స్‌తో వచ్చిన తమిళ హీరో కార్తీ మంచి విజయాలను అందుకున్నాడు. విజయ్ ఇప్పుడు ‘మాస్టర్‌’ గా మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక మరో తమిళ స్టార్ హీరో ధనుష్ సైతం మెగాస్టార్ టైటిల్‌తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనుష్ తమిళ్‌లో ప్రస్తుతం ‘పటాస్’తో ఈ పొంగళ్‌ బరిలోకి దిగబోతున్నాడు. ఈ మూవీని తెలుగులో మెగాస్టార్ ఫిల్మ్ ‘రుస్తుం’ పేరుతో రిలీజ్ చేయాలనుకుంటుందట మూవీ టీం. ఇలా తమిళ్ హీరోలందరూ మెగాస్టార్ టైటిల్స్‌పై మనసు పారేసుకుంటున్నారు. మున్ముందు మన మెగాస్టార్ టైటిల్స్..తమిళ స్టార్ హీరోలకు సెంటిమెంట్‌ మారే అవకాశం కనిపిస్తోంది. కాగా ఈ సినిమాకు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.