పొంగల్ బరిలో మావోడు కూడా..నందమూరి ఫ్యామిలీ రె’ఢీ’

‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ ఈ సారి పొంగల్ రేస్‌లో నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. గత కొంతకాలంగా రిలీజ్‌ డేట్స్ విషయంలో రెండు చిత్రాల మధ్య ఇన్‌సైడ్ వార్ నడుస్తోంది. రిలీజ్ డేట్స్ దగ్గర పడుతున్నా కూడా రెండు మూవీస్ మేకర్స్ రిలీజ్ డేట్‌ను ఖరారు చేయలేదు. తాజాగా అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ అయ్యే ఒకరేజు తేడాతో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురములో ప్రేక్షకుల […]

పొంగల్ బరిలో మావోడు కూడా..నందమూరి ఫ్యామిలీ రె'ఢీ'
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 04, 2020 | 8:18 PM

‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ ఈ సారి పొంగల్ రేస్‌లో నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. గత కొంతకాలంగా రిలీజ్‌ డేట్స్ విషయంలో రెండు చిత్రాల మధ్య ఇన్‌సైడ్ వార్ నడుస్తోంది. రిలీజ్ డేట్స్ దగ్గర పడుతున్నా కూడా రెండు మూవీస్ మేకర్స్ రిలీజ్ డేట్‌ను ఖరారు చేయలేదు. తాజాగా అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ అయ్యే ఒకరేజు తేడాతో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురములో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక సూపర్‌స్టార్ ‘దర్బార్’ జనవరి 9న పంజా విసరబోతోంది.

అంతా బాగానే ఉంది కానీ ఈ రేస్ మరో సినిమా ఉందనే విషయాన్ని సినీ జనాలు మర్చిపోయారు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంత మంచివాడవురా’ జనవరి 15న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పూర్తిగా వెనుకబడిపోయింది. బజ్ లేదు కదా అని తీసెయ్యడానికి లేదు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా సతీశ్ వేగేశ్న పూర్తి కుటుంబ భరిత చిత్రంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన ‘శతమానం భవతి’ సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. సినిమాకు భారీ క్రేజ్ తీసుకొచ్చేందుకు ‘ఎంత మవంచివాడవురా’  మేకర్స్ భారీ యాక్షన్ ప్లాన్‌ను సిద్దం చేసినట్టు సమాచారం.

నందమూరి ఫ్యామిలీ హీరోలందరూ ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. మెయిన్‌గా బాలయ్య, ఎన్టీఆర్ మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం నేపథ్యంలో వారిద్దరూ కలిస్తే వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవదులు ఉండవు. పోయిన సంవత్సరం  ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అప్పుడు  బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కలిసి స్టేజ్‌పై తామంతా ఒక్కటే అన్న భావాన్ని రేకెత్తించారు. ఇప్పుడు కూడా ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదే పంథాలో నిర్వహించేందుకు మూవీ యూనిట్ సిద్దమవుతోంది. ఇదే కనుక జరిగితే సినిమాకు భారీ హైప్ రావడం ఖాయం.