అఫీషియల్: ‘సరిలేరు’, ‘అల’ రిలీజ్ డేట్స్ ఫిక్స్
గత కొన్ని రోజులుగా కొనసాగిన సంక్రాంతి సస్పెన్స్ వీడింది. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలకు రిలీజ్ డేట్లు ఖరారు అయ్యాయి. ముందుగా అనుకున్న రోజునే ఈ రెండు సినిమాలు రానున్నాయి. అంటే జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురములో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీనికి సంబంధించి ఇరు సినిమాల నిర్మాతలు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘సమస్య పరిష్కారం అయ్యింది. […]
గత కొన్ని రోజులుగా కొనసాగిన సంక్రాంతి సస్పెన్స్ వీడింది. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలకు రిలీజ్ డేట్లు ఖరారు అయ్యాయి. ముందుగా అనుకున్న రోజునే ఈ రెండు సినిమాలు రానున్నాయి. అంటే జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురములో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీనికి సంబంధించి ఇరు సినిమాల నిర్మాతలు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘సమస్య పరిష్కారం అయ్యింది. ముందుగా అనుకున్న డేట్లకే సరిలేరు, అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీనిపై అందరం కలిసి చర్చించుకున్నాం. రెండు సినిమాలకు మంచి రెవెన్యూ రావాలి. సంక్రాంతికి వస్తోన్న నాలుగు చిత్రాలు బాగా ఆడాలి’’ అని అన్నారు. కాగా ఈ సమస్యకు ప్రొడ్యూసర్స్ గిల్డ్స్ సమక్షంలో పరిష్కారం లభించింది. మరోవైపు దీనిపై నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారమైంది. అందరూ కన్విన్స్ అయ్యారు’’ అని తెలిపారు.
కాగా ఈ రెండు సినిమాలు మొదట జనవరి 12నే విడుదల తేదీగా ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు వస్తే కలెక్షన్ల పరంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని భావించిన ఇరు సినిమా నిర్మాతలు మాట్లాడుకొని ఒక రోజు గ్యాప్‌తో రావాలని అనుకున్నారు. కానీ ప్రమోషన్లలో అల వైకుంఠపురములో మంచి క్రేజ్ రావడంతో.. ముందే రావాలని ఆ మూవీ యూనిట్ భావించింది. అయితే ఈ విషయంలో సరిలేరు నీకెవ్వరు టీమ్ కూడా వెనక్కి తగ్గకపోవడంతో.. మరోసారి ఈ రెండు మూవీల మధ్య క్లాష్ మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూసర్ గిల్డ్స్‌లో సమస్యను పరిష్కరించుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ పాత డేట్లనే ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. రెండు డిఫరెంట్ జోనర్లో వస్తోన్న చిత్రాలు కావడంతో.. ఈ రెండు సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మూవీలపై అటు మహేష్ బాబు, ఇటు బన్నీ కూడా చాలా అంచనాలను పెట్టుకున్నారు. ఈ సారి ఎలాగైన పెద్ద హిట్ కొట్టాలని వారిద్దరు భావిస్తున్నారు.