‘మైండ్ బ్లాక్’ సాంగ్: మహేష్, రష్మిక లుక్‌లు చూశారా..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీతో హిట్ కొట్టి.. మరో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు మహేష్ బాబు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. కాగా ఈ మూవీలో మొత్తం ఐదు పాటలు ఉండగా.. అవన్నీ ఇప్పటికే విడుదలయ్యాయి. వీటన్నింటికి క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ […]

'మైండ్ బ్లాక్' సాంగ్: మహేష్, రష్మిక లుక్‌లు చూశారా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2020 | 7:54 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీతో హిట్ కొట్టి.. మరో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు మహేష్ బాబు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్.

కాగా ఈ మూవీలో మొత్తం ఐదు పాటలు ఉండగా.. అవన్నీ ఇప్పటికే విడుదలయ్యాయి. వీటన్నింటికి క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ రాగా.. ఫ్యాన్స్ మాత్రం ఈ పాటలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాస్ బీట్‌తో వచ్చిన మైండ్ బ్లాక్, డాంగ్ డాంగ్ పాటలను రిపీట్‌లో వింటున్నారు మహేష్ అభిమానులు. అయితే మైండ్ బ్లాక్ సాంగ్‌ను మహేష్, రష్మికలపై తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. ఈ పాటకు సంబంధించిన ఓ లుక్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మహేష్ లుంగీ కట్టుకొని అదరగొట్టగా.. రష్మిక గ్లామరస్‌ లుక్‌తో ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫొటోను షేర్ చేస్తోన్న అభిమానులు.. ఈ పాటకు థియేటర్లో పండగే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌(డాంగ్ డాంగ్)లో మెరవనుంది. అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ నెల 5న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.