సింగర్‌ కౌసల్యకు వేధింపులు.. కారణం ఇదే!

సెలెబ్రిటీలకు సోషల్ మీడియా వేధింపులు కొత్తేం కాదు. ఏవో చిన్నా చితకా జోక్స్ అయితే.. ఈజీగా పక్కన పడేస్తారు. కానీ.. అసభ్య పదజాలంతో.. రోజూ వేధిస్తుంటే.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కక తప్పదు. ఇప్పుడు అదే సమస్య సింగర్ కౌసల్యకు కూడా ఎదురైంది. సెలెబ్రిటీలు ఎన్ని ఫోన్ నెంబర్స్ మార్చినా.. ఇప్పుడున్న కాలంతో, టెక్నాలజీతో ఈజీగా తెలిసిపోతూంటాయి. కొంతమందికి వారి నెంబర్ దొరికితే సంబరపడుతూంటారు. మరికొందరు మాత్రం.. ఇదే ఛాన్స్ కదా అని వేధిస్తూంటారు. సింగర్ కౌసల్య […]

సింగర్‌ కౌసల్యకు వేధింపులు.. కారణం ఇదే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2020 | 8:22 PM

సెలెబ్రిటీలకు సోషల్ మీడియా వేధింపులు కొత్తేం కాదు. ఏవో చిన్నా చితకా జోక్స్ అయితే.. ఈజీగా పక్కన పడేస్తారు. కానీ.. అసభ్య పదజాలంతో.. రోజూ వేధిస్తుంటే.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కక తప్పదు. ఇప్పుడు అదే సమస్య సింగర్ కౌసల్యకు కూడా ఎదురైంది. సెలెబ్రిటీలు ఎన్ని ఫోన్ నెంబర్స్ మార్చినా.. ఇప్పుడున్న కాలంతో, టెక్నాలజీతో ఈజీగా తెలిసిపోతూంటాయి. కొంతమందికి వారి నెంబర్ దొరికితే సంబరపడుతూంటారు. మరికొందరు మాత్రం.. ఇదే ఛాన్స్ కదా అని వేధిస్తూంటారు.

సింగర్ కౌసల్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె తెలియని వారుండరు. కౌసల్య పాడిన ఎన్నో పాటలు ఫుల్ పాపులర్‌ కూడా అయ్యాయి. ఇప్పటికీ ఆమె గాత్రానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా.. ప్రస్తుతం ఆమెకు వాట్సాప్‌ ఓపెన్ చేయాలంటేనే విసుగు వస్తుంది. కారణమేంటంటే.. ఆమెకు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్‌లు పంపి ఆకతాయిలు వేధిస్తున్నారు. ఒకటి బ్లాక్ చేస్తుంటే మరొకటి.. ఇలా విసిగిపోయిన కౌసల్య 10 కాదు.. 20 కాదు.. ఏకంగా 342 కాంటాక్ట్స్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇంకా మెసేజ్‌లు ఆగకపోవడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం కౌసల్యకు సింగర్‌గా అవకాశాలు తగ్గాయి. దీంతో.. నటనలోకి అడుగుపెడుతోంది. సంగీత నేపథ్యం ఉన్న ఓ వెబ్‌ సిరిసీలో ఆమె నటించనుందని సమాచారం.