అమరావతి బంద్! పోలీసుల కాళ్లు పట్టుకుంటూ..

అమరావతి మందడంలో ఉదయం నుంచీ బంద్ వాతావరణం నెలకొంది. దుకాణాలు తెరవనీయకుండా.. రోడ్లపైకి వచ్చి రైతులు బంద్‌ పాటిస్తున్నారు. దీంతో.. అమరావతి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు తమ షాపుల వద్ద కూర్చోవద్దంటూ.. తమ ప్రాంతం మీదుగా వెళ్లకూడదంటూ.. పోలీసు వాహనాలను వెనక్కి పంపించేస్తున్నారు రైతులు. ఈ సందర్భంగా.. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా.. అమరావతికి మద్దతుగా పలు జిల్లాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాగా.. తుళ్లూరు డీఎస్పీ కాళ్లు పట్టుకున్నారు రైతులు. […]

అమరావతి బంద్! పోలీసుల కాళ్లు పట్టుకుంటూ..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 04, 2020 | 10:13 AM

అమరావతి మందడంలో ఉదయం నుంచీ బంద్ వాతావరణం నెలకొంది. దుకాణాలు తెరవనీయకుండా.. రోడ్లపైకి వచ్చి రైతులు బంద్‌ పాటిస్తున్నారు. దీంతో.. అమరావతి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు తమ షాపుల వద్ద కూర్చోవద్దంటూ.. తమ ప్రాంతం మీదుగా వెళ్లకూడదంటూ.. పోలీసు వాహనాలను వెనక్కి పంపించేస్తున్నారు రైతులు. ఈ సందర్భంగా.. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా.. అమరావతికి మద్దతుగా పలు జిల్లాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాగా.. తుళ్లూరు డీఎస్పీ కాళ్లు పట్టుకున్నారు రైతులు. తమ బంద్‌కు సహకరించాలంటూ కోరుతూ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు.

శుక్రవారం మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా.. రైతులు నేడు రాజధాని బంద్ ప్రకటించారు. శాంతీయుతంగా నిరసన చేస్తోన్నా.. తమ పట్ల పోలీసులు అనైతికంగా వ్యవహరించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా.. తమ పోరును మరింత ఉధృతం చేస్తామని తేల్చి చెప్తున్నారు రైతులు.