AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ: లైసెన్స్ లేకుండా పట్టుబడితే ఇక జైలుకే..

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పోలీసులకు పట్టుబడితే జైలే గతి. అవునండీ ఇది నిజం. ఇప్పటివరకు భారీ జరిమానాలతో సరిపెట్టుకున్న రవాణాశాఖ ఇకపై రూల్స్‌ను కఠినతరం చేయనుంది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88,872 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రోడ్డు సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ లైసెన్సులు లేకుండా బండి నడిపే వారిని జైలుకు పంపాలని రవాణాశాఖకు సూచించింది. దీంతో ఏపీ రవాణాశాఖ […]

ఏపీ: లైసెన్స్ లేకుండా పట్టుబడితే ఇక జైలుకే..
Ravi Kiran
|

Updated on: Jan 05, 2020 | 5:49 AM

Share

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పోలీసులకు పట్టుబడితే జైలే గతి. అవునండీ ఇది నిజం. ఇప్పటివరకు భారీ జరిమానాలతో సరిపెట్టుకున్న రవాణాశాఖ ఇకపై రూల్స్‌ను కఠినతరం చేయనుంది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88,872 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రోడ్డు సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ లైసెన్సులు లేకుండా బండి నడిపే వారిని జైలుకు పంపాలని రవాణాశాఖకు సూచించింది. దీంతో ఏపీ రవాణాశాఖ కఠిన చర్యలు చేపట్టాలని ఉపక్రమించనుంది. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలను 20 శాతం తగ్గించాలనే ఉద్దేశంతో పోలీసులతో కలిసి సంయుక్తంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలను ముమ్మరంగా చేపట్టనున్నారు.

మరోవైపు లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం విద్యార్హతను తొలగించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఎనిమిదో తరగతి నిబంధనను ఏపీ ప్రభుత్వం తొలగించింది. అంతేకాకుండా సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులు కూడా త్వరలోనే అందుబాటులోకి రానుండటంతో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సు పొందడం మరింత సులభం కానుంది.

Follow Us