‘తిమ్మరుసు’ ఫస్ట్‌లుక్ విడుదల, మరోసారి విభిన్న పాత్రలో కనిపించనున్న యంగ్ హీరో సత్యదేవ్
'బ్లఫ్ మాస్టర్', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటోన్న సత్యదేవ్ హీరోగా..
‘Thimmarusu’ First Look : ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటోన్న సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న తాజా మూవీ ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్ వాలి’ అనేది ట్యాగ్‌లైన్. ‘ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మహేశ్ కోనేరుతో పాటు ‘ఎస్ ఒరిజినల్స్’ బ్యానర్‌పై శ్రుజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. డిసెంబర్ 9న టీజర్‌ను విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ” కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా..సత్యదేవ్ తనకంటూఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘తిమ్మరుసు’ సినిమా విషయానికి వస్తే ఓ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. ఈరోజు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. డిసెంబర్ 9న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. వచ్చే నెల విడుదల చేసేందుకు చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాం. త్వరలో ఇతర విషయాలు తెలియజేస్తాం” అని తెలిపారు.
Super excited to show you the FIRST LOOK of #Thimmarusu on December 9th ?#PriyankaJawalkar @smkoneru @nooble451 @SharanDirects @EastCoastPrdns @actorbrahmaji@SOriginals1 @VamsiKaka @ActorAnkith @SricharanPakala @appunitc pic.twitter.com/RHOXsna9yX
— Satya Dev (@ActorSatyaDev) December 5, 2020
Also Read :
Concussion Substitute : కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ