తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం, ఒకే మూవీలో పవర్ స్టార్, సూపర్ స్టార్, ఫ్యాన్స్‌కు పూనకాలే !
టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇద్దరి పేరు మీద ఇండస్ట్రీ రికార్డులు ఉన్నాయి.
టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇద్దరి పేరు మీద ఇండస్ట్రీ రికార్డులు ఉన్నాయి. వీరు ప్యాన్ ఇండియా సినిమా చేస్తే..ఆ రికార్డులు కూడా దాసోహమవ్వడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఇద్దరికీ పరాయి భాషల్లో సినిమాలు చెయ్యాలన్న ఇంట్రస్ట్ లేదు. కానీ ఇద్దర్నీ కలిపి ఒకేసారి వెండితెరపై చూసే అవకాశం దక్కుతుందా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇది జరిగితే మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సంచలనమే.
రాజకీయాల్లో బిజీ అయ్యి దాదాపు మూడేళ్ల గ్యాప్ అనంతరం ‘పింక్’ రిమేక్ ‘వకీల్ సాబ్’తో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు పవన్. కరోనా కారణంగా మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. అయితే మాత్రం వరసబెట్టి భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్. మరోవైపు, ‘సరిలేరు నీకెవ్వరు’తో ఈ ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. ప్రస్తుతం ఆయన పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చేయబోతున్నారు. ఈ క్రమంలో మహేశ్‌బాబు-పవన్‌కల్యాణ్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే మహేశ్ సినిమాలో పవన్ కొద్ది నిమిషాలు మాత్రమే సందడి చేయనున్నారట. మహేశ్ ప్రస్తుతం నటించబోతున్న ‘సర్కారువారి పాట’లో పవన్ అతిథి పాత్రలో మెరవనున్నారట. పవర్‌స్టార్ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్క్రీన్‌పై సందడి చేస్తారట. ఈ వార్తలు సోషల్ మీడియాలో చూసిన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. కాగా గతంలో పవన్‌కల్యాణ్ నటించిన ‘జల్సా’కు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరికీ సన్నిహితుడు అవ్వడం వల్ల అప్పట్లో ఇది సాధ్యమైంది. మరి ఈ తాజా క్రేజీ వార్త ఎంతమేర నిజమో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
Also Read :
Concussion Substitute : కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ